)
సంగీతం::SM.సుబ్బయ్య నాయుడు
రచన::ముద్దు క్రిష్ణ
గానం::రాధా జయలక్ష్మి
రాగం :: వరాళి
కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
దయ కావవే అమ్మా దేవీ పూజాసేతునే
నన్ను కావవే అమ్మా దేవీ నును పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే..ఏ..ఏ..
నీ పాదకమలములు సదా..ఆ..ఆ..
నీ పాదకమలములు సదా మది దేవీ నమ్మితి
కరుణ గనవే మాతా
నీ పాదకమలములు సదా మది దేవీ నమ్మితి
కరుణ గనవే మా
కడు దీనురాల కనవే నా
ఓ భవహారి పరమ కౄపాకరీ
నన్ను కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే..ఏ..ఏ...
జీవితలతలే సుమములుగని
నాదగు బాధలే తీరేనే
మాతా భువిపై నీవే సకలమని
మది గని తలతు శివురాణీ
ఈ లోకము వొడిదుడుకులు గడుప
ఇలలో మాకుల దేవతవే
ఈ లోకము వొడిదుడుకులు గడుప
ఇలలో మాకుల దేవతవే
శ్రీ రాజరాజేశ్వరీ సేతు
నీకే నమతులెన్నో దయానిధి
కావవే అమ్మా దేవీ నిను పూజాసేతునే
శివును సతి నీవే గతి
కావవే..ఏ..ఏ...