Tuesday, November 30, 2010

కొడుకు కోడలు--1972














సంగీత::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, వాణీశ్రీ, S.V.రంగారావు, శాంతకుమారి, లక్ష్మి 
పల్లవి::
నేలకు ఆశలు చూపిందెవరో..నింగికి చేరువ చేసిందెవరో 
నేనెవరో నువ్వెవరో..నిన్ను నన్నూ కలిపిందెవరో  
నేనెవరో నువ్వెవరో నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో నువ్వెవరో
చరణం::1
ఈ రోజు నువ్వు..ఎదురు చూచిందే  
యీ పాట నాకు..నువ్వు నేర్పిందే
యీ సిగ్గెందుకు...నా ఎదుట
యీ సిగ్గెందుకు...నా ఎదుట 
ఆచిరు చెమటెందుకు..నీ నుదుట  
నేనెవరో నువ్వెవరో నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో నువ్వెవరో
చరణం::2
నేనడగకె నువ్వు...మనసిచ్చావు 
నీ అనుమతిలేకె...నేనొచ్చాను 
మనసుకు తెలుసు ఎవ్వరిదో..తానెవ్వరిదో
మనసుకు తెలుసు ఎవ్వరిదో..తానెవ్వరిదో 
అది ఋజువయ్యింది వొద్దికలో..మన ఒద్దికలో
నేనెవరో నువ్వెవరో...నేనెవరో నువ్వెవరో 
నిన్ను నన్నూ...కలిపిందెవరో

చరణం::3

ఏ జన్మ మమత..మిగిలి పోయిందో 
ఈ జన్మ మనువుగా..మనకు కుదిరిందీ
ఈ అనురాగానికి...తనివి లేదు 
ఈ అనురాగానికి...తనివి లేదు 
ఈ అనుబంధానికి...తుది లేదు 
నేనెవరో నువ్వెవరో..నిన్ను నన్నూ కలిపిందెవరో
నేనెవరో నువ్వెవరో..నేనెవరో నువ్వెవరో

No comments: