Friday, March 26, 2010

శ్రీ Mకృష్ణ సత్య--1971



సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల,S.జానకి 
తారాగణం::S.T.రామారావు,కాంతారావు,S.V.రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం

పల్లవి::

అలుక మానవే..చిలుకల కొలికిరొ
తలుపు తీయవే..ప్రాణ సఖీ
తలుపు తీయవే..ప్రాణ సఖీ

దారి తప్పి..ఇటు చేరితివా 
నీ దారి..చూచుకో వోయీ
నా దరికి..రాకు రాకోయీ

చరణం::1

కూరిమి కలిగిన..తరుణివి నీవని 
తరుణము నెరిగియే..చేరితినే..ఏ
కూరిమి కలిగిన..తరుణివి నీవని 
తరుణము నెరిగియే..చేరితినే..ఏ
నీ నెరినెరి వలపునే..కోరితినే   
నీ నెరినెరి వలపునే..వేడితినే
అలుక మానవే..చిలుకల కొలికిరొ 
తలుపు తీయవే..ప్రాణ సఖీ   
తలుపు తీయవే..ప్రాణ సఖీ

చరణం::2

చేసిన బాసలు..చెల్లించని 
బలు..మోసగాడవీవోయీ
చేసిన బాసలు.. చెల్లించని 
బలు..మోసగాడవీవోయీ
ఇక ఆశ లేదు..లేదోయీ  
ఇక ఆశ లేదు..పోవోయీ 

దాసుని నేరము..దండముతో సరి  
బుసలు మాను..ఓ వగలాడీ..హ్హు 
దాసుని నేరము..దండముతో సరి   
బుసలు మాని..ఓ వగలాడీ
నా సరసకు రావే..సరసాంగీ   
నా సరసకు రావే..లలితాంగీ   
అలుక మానవే..చిలుకల కొలికిరొ 
తలుపు తీయవే..ప్రాణ సఖీ  
తలుపు తీయవే..ప్రాణ సఖీ