Sunday, May 17, 2009

వైకుంఠపాళి--1975


సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శారదా,రంగనాద్,సత్యనారాయణ,రాజబాబు,అరుణ,K.విజయ, జ్యొతిలక్ష్మి

పల్లవి::

గౌరమ్మోలే గౌరమ్మ గౌరమ్మోలే గౌరమ్మా 
నీ గుట్టు నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మా
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు 
నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ
గౌరమ్మ..గౌరమ్మ

చరణం::1

బిత్తర చూపులు చూచేవెందుకు
బిరబిర నడకలు నడిచేవెందుకు
బిత్తర చూపులు చూచేవెందుకు
బిరబిర నడకలు నడిచేవెందుకు
కొత్త కధలు చెప్పకు నాకు
కొత్త కధలు చెప్పకు నాకు
మెత్తగ వున్నాననుకోకు        
గౌరమ్మ గౌరమ్మ హోయ్ హోయ్ 
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు 
నాకు తెలిసిందే గౌరమ్మా 
నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ

చరణం::2

కనకుండానే పిల్లాడా అసలు మొగుడంటూ ఉన్నాడా గౌరమ్మ 
కనకుండానే పిల్లాడా అసలు మొగుడంటూ ఉన్నాడా
బిగువు సడలని ఈ సొగసు
పెళ్ళైయిన పిల్లకు వుంటుందా బిగువు 
సడలని ఈ సొగసు పెళ్ళైయిన పిల్లకు వుంటుందా      
గౌరమ్మోలే గౌరమ్మ నీ గుట్టు నాకు తెలిసిపొయిందే 
గౌరమ్మా నీ పట్టు నాకు దొరికిందే గౌరమ్మ
గౌరమ్మ గౌరమ్మ ఆ ఆ గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మ

రామయ్య తండ్రి--1975


సంగీతం::సత్యం
రచన::మల్లెమాల
గానం::S.P.బాలు,S.జానకి
తారాగణం::సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి 

పల్లవి::


అదే అదే భద్రాచలం ఆర్తుల పాలిటి దివ్య వరం

ఆ పుణ్యస్థలి అడుగు మోపితే అడుగక దొరుకును ఆత్మానందం 

చరణం::1


పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా

పాహి పాహి మాంపాహి పరాత్పర పావన గుణధామా 
నీ పాద కమలములె మాకు శరణ్యము భద్రాచల రామా
పాల ముంచినా నీట ముంచినా భారము నీదే రామా 
భారము నీదే రామా భారము నీదే రామా

చరణం::2


లేక లేకనీ దర్శన భాగ్యము నేటికి కల్గిందీ

రామయ్య తండ్రీ రామయ్య తండ్రీ
రామయ్య తండ్రీ అని నొరారగ పిలవాలని వుంది 
కాని పిలువలేక నా గుండె గొంతుతో కొట్టుక చస్తూంది
పుడమిలోన నావంటి దురాత్ముడు పుట్టబోడు రామా
నీల మేఘశ్యామా శ్రీరామ పరంధామా
నన్నేలుకొమ్ము రామా భద్రాచల రామా
రామా రామా రామా రామా రామా

రాముని మించిన రాముడు--1975



సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,ప్రభాకర రెడ్డి,త్యాగరాజు,అల్లు రామలింగయ్య,వాణిశ్రీ,శ్రీవిద్య,S.వరలక్ష్మి

పల్లవి :

ఏదో మైకంలో ఉన్నాను నేను..హహహ
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను..నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా

చరణం::1 

నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా మేనిలో నేడేలనో రగిలింది కనరాని జ్వాల..రగిలింది కనరాని జ్వాల  
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా 

చరణం::2

నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
ఈ రేయిలో ఈ వేళలో...తీరాలి 
ఇన్నాళ్ళ దాహం..తీరాలి ఇన్నాళ్ళ దాహం   
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను.. నీవే రావాలిరా

చరణం::3

నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
ఆ రూపమే నా కోసమే..నిలిచింది 
నా కళ్ళలోన..నిలిచింది నా కళ్ళలోన  
     
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను...నేను
ఏదో మైకంలో పాడేను నేను..నీవూ పాడాలిరా
ఓ ప్రియా..ఆ..హరే..హరే..హరే..హరే       
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను..నీవే రావాలిరా