సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
వయసే ఒకపూలతోట
వలపే ఒక పూలబాట
ఆతోటలో..ఆ బాటలో..
పాడాలీ తీయని పాట..
పాడాలీ తీయని పాట
:::1
పాలబుగ్గలు ఎరుపైతే..హో
లేతసిగ్గులు ఎదురైతే..హో..హో
పాలబుగ్గలు ఎరుపైతే..ఆఆఆ
లేతసిగ్గులు ఎదురైతే..
రెండు మనసులు ఒకటైతే..
పండువెన్నెలతోడైతే
రెండు మనసులు ఒకటైతే..
పండువెన్నెలతోడైతే
కోరికలే..తీరెనులే..
పండాలీ వలపుల పంటా
.పండాలీ వలపుల పంటా
:::2
నీ కంటి కాటుక చీకటిలో..
పగలు రేయిగ మారెనులే
నీ కంటి కాటుక చీకటిలో..
పగలు రేయిగ మారెనులే
నీ కొటెనవ్వుల కాంతులలో..
రేయి పగలై పోయేనులే
నీ కొటెనవ్వుల కాంతులలో..
రేయి పగలై పోయేనులే
నీ అందమూ..నాకోసమే..
నీ మాట ముద్దులమూటా
నీ మాట ముద్దులమూటా
:::3
పొంగిపోయే పరువాలూ..హో
నింగినంటె కెరటాలు..ఆఆ..2
చేరుకొన్నవి తీరాలూ..
లేవులే,,ఇక దూరాలూ..2
ఏనాటికీ..మనమొక్కటే..
ఒక మాటా..ఇద్దరినోటా..2
వయసే ఒకపూలతోట
వలపే ఒక పూలబాట
ఆతోటలో..ఆ బాటలో..
పాడాలీ తీయని పాట..2