సంగీతం::T.V.రాజు రచన::D.C.నారాయణరెడ్డి గానం::ఘంటసాల తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ పల్లవి:: ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ ఏక పత్నీ వ్రతుడు..మా..ఆ..రామచంద్రుడే రామ రామ రామ సీతా..రామా రఘురామా దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా చరణం::1 కైక కిచ్చిన మాటకోసమై..కట్టుపడెను ఆ దశరధుడు తండ్రిచేసిన బాసకోసమై..తరలె కానలకు రాఘవుడు పౌరులెంత విలపించినా..ప్రకృతికూడ శోకించినా భరతుడెంత ప్రార్థించినా..తిరిగిరాననె రాముడు ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ ఆదర్శము ఒకే మాట అదే మా రాముని రాచబాట రామ రామ రామ సీతా..రామా రఘురామా దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా చరణం::2 దశకంఠుడు సీతమ్మ నెత్తుకొని మింటికేగిరిపోగా వానిని ప్రతిఘటించిన జటాయువు పాపం ఢరణి నొదిగిపోగా ఆ పక్షికి మోక్షం ప్రసాదించి వానరకోటిని సమీకరించి సమభావనకే పాదులువేసె శౌర్య ధర్మనిధి దాశరధి ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ జీవులందరిది ఒకే జాతి..అదే రాముని ఆదర్శ నీతి
రామ రామ రామ సీతా..రామా రఘురామా దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా చరణం::3
సీతమ్మ చెర విడిపించుటకై సేతు బంధనము గావించీ శరణుకోరిన విభీషణునిపై కరుణా మృతమును కురిపించీ సురులు మునులు వినుతింపగ లంకేశ్వరుని ద్రుంచి యిల రక్షించీ అగ్ని పునీతను సీతను పరిగ్రహించె శ్రీరాముడు ఏ యుగాలకైనా..ఏ జగాలనైనా..ఆ ఆ ఆ ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని..అదే మా రాముని ఆదర్శం రామ రామ రామ సీతా..రామా రఘురామా దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా రామ రామ రామ సీతా..రామా రఘురామా దశరధ నందన దానవ భంజన..జయ జయ శ్రీరామా రామ రామ రామ సీతారామా రఘురామా దశరధ నందన దానవ భంజన జయజయ శ్రీరామా జయ జయ శ్రీరామా జయ జయ శ్రీరామా జయ జయ శ్రీరామా
సంగీతం::T.V.రాజు రచన::D.C.నారాయణరెడ్డి గానం::ఘంటసాల తారాగణం::N.T.రామారావు, కాంతారావు, S.V.రంగారావు,రాజనాల,వాణిశ్రీ పల్లవి:: రామా..ఆ ఆ ఆ ఆ రఘురామా..ఆ ఆ ఆ ఎన్నాళ్ళు వేచేను..ఓ రామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా ఎన్నాళ్ళు వేచేను..ఓ రామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా చరణం::1 నీ అండ నేచేర రాలేను..రామా నా కొండకే నీవు రావయ్య..రామా ఏ జన్మకైనా..నా జపము నా తపము నీవే..నీవే..రఘురామా జగధభి రామా..జానకి రామా జయరామా..శ్రీరామా ఎన్నాళ్లు వేచేను..ఓ రామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా చరణం::2 సీతమ్మ సేమం..తెలిపానే నీ తమ్ముని ప్రాణం..నిలిపానే సీతమ్మ సేమం..తెలిపానే నీ తమ్ముని ప్రాణం..నిలిపానే మహిరావణుని..గుట్టు చెప్పానే నిన్ను మూపున..ఇడుకొని మోశానే ఇంతగ కొలిచిన..నీ పదదాసుని ఇంతగ కొలిచిన..నీ పదదాసుని ఎటుల మరచితివయ్యా..రామయ్యా ఎన్నాళ్లు వేచేను..ఓ రామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా నీకు ఇకనైన దయరాదా..శ్రీరామా
నిర్మాత::G రాధాకృష్ణమూర్తి దర్శకత్వం::K. ప్రత్యగాత్మ సంగీతం::T.చలపతిరావ్ రచన::దాశరధి గానం::జిక్కి,P.సుశీల బృందం తారాగణం::అక్కినేని, జమున,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు బుల్లి బుల్లి రాధకు..ముద్దు ముద్దు రాజుకు బుల్లి బుల్లి రాధకు..ముద్దు ముద్దు రాజుకు పెళ్ళండీ..పెళ్ళీ..ముచ్చటైన పెళ్ళి బహుముచ్చటైన పెళ్ళి చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చరణం::1 కొంగులు ముడివేసి..కోర్కెలు పెనవేసి బుగ్గలపై సిగ్గుతో..కన్నులలో వలపుతో అడుగులలో అడుగులతో..నడచిపోవు బొమ్మలు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చరణం::2 మెరసిపోవు తాళితో..మెడలో పూమాలతో మేళాలూ..తాళాలు..సన్నాయీ..బాజాలు రాజు వెంట రాణి..కాళ్ళకు పారాణి రాజు వెంట రాణి..కాళ్ళకు పారాణి చేయి చేయి కలుపుకొని..చిందులేయు బొమ్మలు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చిట్టిపొట్టి బొమ్మలు..చిన్నారి బొమ్మలు చరణం::3