Monday, September 21, 2009

గీతాంజలి--1989



సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,చిత్ర


ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన..సందె పొద్దు సీకట్లో
నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా..నా వూరేది..యేదీ
నా పేరేది..యేదీ..నా దారేది..యేదీ..నా వారేరి..
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..

యేనాడో ఆరింది నా వెలుగు..నీ దరికే నా పరుగూ
ఆనాడే కోరాను నీ మనసు..నీ వరమే నన్నడుగూ
మోహినీ పిసాచి నా చెలిలే..షాకినీ విషూచి నా సఖిలే
మోహినీ పిసాచి నా చెలిలే..షాకినీ విషూచి నా సఖిలే
విడవకురా..వదలను రా..ప్రేమే రా నీ మీదా
నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో

భూత ప్రేత పిసాచ భేతాళ మారే డం డం
ఝడం భం భం..నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన..సందె పొద్దు సీకట్లో..నీడల్లె ఉన్నా
నీతొ వస్తున్నా..నీ కభళం పడథా..నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా..నిను పట్టుకు పోతా
ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ..

ఢాకిని ఢక్క ముక్కల చెక్క..డంభో తినిపిస్తాన్
తాటకి కనిపిస్తే..తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క డొక్కలొ చొక్క..అంభో అనిపిస్తాన్
నక్కను తొక్కిస్తాన్..చుక్కలు తగ్గిస్తాన్
రక్కిస మట్టా..తొక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్
తీటువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
రక్కిస మట్టా..తొక్కిస గుట్ట పంభే దులిపేస్తాన్
తీటువు పిట్ట ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్
వస్తాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్..వస్తాయ ఝట్ ఝట్ ఝట్
ఫట్..కోపాల మసజస థథగా..సార్థులా

నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కోనల్లోన..సందె పొద్దు సీకట్లో
నీడల్లె ఉన్నా..న న న..ణీథొ వస్థునా
నీ కభళం పడతా..నిను కట్టుకు పోతా
నీ భరతం పడతా..నిను పట్టుకు పోతా
ఆఎ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…ఏ…
నంది కొంద వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో
చంద్ర వంక కొనల్లొన..సందె పొద్దు సీకట్లో

గీతాంజలి--1989




సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగ
కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం

గీతాంజలి --- 1989



సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::చిత్ర


జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

వాగులు వంకులు జలజలా చిలిపిగా పిలిచినా
గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా
మనసు ఆగదు ఇదేమి అల్లరో
తనువు దాగదు అదేమి తాకిడో
కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి
వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా
తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా
వానదేవుడే కళ్ళాపి జల్లగా
మాయదేవుడే మొగ్గేసి వెళ్ళగా
నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న
కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికొసమ

జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే
ఉరుకులు పరుగులు
ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు
తొలకరి మెరుపులా
ఉలికిపడిన కలికి సొగసు
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే
కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లొ వెన్నెల్లు తెచ్చిందిలే

Sunday, September 20, 2009

ఘరాన మొగుడు--1992





సంగీతం::MM..కీరవాణి
రచన::భువనచంద్ర
గానం::SP.బాలు,KS.చిత్ర

Film Director::K. Raghavendra Rao
తారాగణం::చిరంజీవి,నగ్మ,వాణివిశ్వనాథ్,రావుగోపాలరావు,కైకాలసత్యనారాయణ,బ్రహ్మనందం,రమాప్రభ,శుభ,
సాక్షిరంగారావు,డిస్కోశాంతి.

::::::::

అప్ హ్యండ్సప్..పాపా హ్యండ్సప్
పాపా హ్యండ్సప్..పాపా హ్యండ్సప్

బంగారు కోడిపెట్టె వచ్చేనండి
ఏ పాప ఏ పాప ఏ పాప.....
బంగారు కోడిపెట్టె వచ్చేనండి
ఏ పాప ఏ పాప ఏ పాప.....
చెంగావి చీర గుట్టు చూసుకొందీ
హే పాప..హే పాప..హే పాప....
అప్ అప్ హ్యండ్సప్..చెప్ చెప్ నీలక్..
ఢిక్ ఢిక్ ఢిక్ డోలక్కుతో ....
చేస్తా..జిప్ జిప్ జూకప్
పిప్ పిప్ షేకప్ ..స్టేప్ స్టేప్ మ్యుజిక్కుతో
బంగారు కోడిపెట్టె వచ్చేనండి
ఏ పాప ఏ పాప ఏ పాప.....
చెంగావి చీర గుట్టు చూసుకొందీ
హే పాప..హే పాప..హే పాప....

::::1


ఒంటమ్మ ఒంటమ్మ సుబ్బులూ..
అంతంత ఉన్నాయి ఎత్తులూ..బోలో బోలో..
నీకన్ను పడ్డక ఓరయ్యో..
పోంగేస్తున్నాయి సొత్తులూ చలో చలో
సిగ్గులేని రైకతెక్కు చూస్తా..
గోలుమాలు కోకపోంగులో.....
కావలిస్తే మళ్ళి వస్తనయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకూ
అప్ అప్ హ్యండ్సప్..చెప్ చెప్ నీలక్..
ఢిక్ ఢిక్ ఢిక్ డోలక్కుతో ....
చేస్తా..జిప్ జిప్ జూకప్
పిప్ పిప్ షేకప్ ..స్టేప్ స్టేప్ మ్యుజిక్కుతో

బంగారు కోడిపెట్టె వచ్చేనండి
ఏ పాప ఏ పాప ఏ పాప.....
చెంగావి చీర గుట్టు చూసుకొందీ
హే పాప..హే పాప..హే పాప....

::::2


ఎంటమ్మ ఏంటమ్మ అందుల్లో అందాల చిట్టి గంపలో బోలో..బోలో
నా ఈడు నక్కింది బావయ్యో చేయేసాక మత్తులో..చలో చలో
చేతజిక్కినావె గిన్నెకోడి దాచుకొన్న గుట్టూ తీయన తీయనా
కాకమీద వున్నదాని రయ్యో దాకమీద కోపమెందుకూ

అప్ అప్ హ్యండ్సప్..చెప్ చెప్ నీలక్..
ఢిక్ ఢిక్ ఢిక్ డోలక్కుతో ....
చేస్తా..జిప్ జిప్ జూకప్
పిప్ పిప్ షేకప్ ..స్టేప్ స్టేప్ మ్యుజిక్కుతో

బంగారు కోడిపెట్టె వచ్చేనండి
ఏ పాప ఏ పాప ఏ పాప.....
చెంగావి చీర గుట్టు చూసుకొందీ
హే పాప..హే పాప..హే పాప.
...

గీతాంజలి--1989


సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,కోరస్


జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే...రంపంపం..
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం

ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో..హే..హే..
మా వెనకే వుంది ఈ తరం
మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢియ్యాటలో
నేడేరా నీకు నేస్తము రేపే లేదు
నిన్నంటే నిండు సున్న రా రానే రాదు
ఏడేడు లోకాల తోన బంతాట లాడాలి ఈ నాడె
తక తకదిమి తకఝను

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం

పడనీరా విరిగి ఆకశం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేను లే..ఓ..హో..
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చేయాలి లోకం..మా జోరు చూసాక..ఈ నాడె
తక తకదిమి తకఝను

జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే...రంపంపం..
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
తకిట..తకిట..తకధిమి
తకిట..తకిట..తకధిమి
తకిట..తకిట..తకధిమి

మల్లె పందిరి--1981

పాట ఇక్కడ వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి

గానం::SP.బాలు,S.జానకి
నిర్మాణ సంస్థ R.K.మూవీస్


ఏ..హె హె హే.హే..హే..ఆ..ఆ..హ హ హా హా హా
కదిలే..కోరికవో...హా
కథలో..నాయికవో..హ..హా
కవితా కన్యకవో..ఆ..హా
భువిలో..తారకవో..ఆ..హ్హా
ఓ..ప్రియా..ఓ..ప్రియ..నీకిదే..స్వాగతం
లలలలలా..ఆ..ఆ..హా..హా..ఆ..ఆ..హా..హా

వలచే..గోపికనీ..హా
కొలిచే..రాధికనీ..ఓ..హో
మనసే..కానుకనీ..ఆ..హా
మురిసే..బాలికనీ..ఓ..హ్హో
ఓ..ప్రియా..ఓ..ప్రియా..నీకిదే స్వాగతం

జాజిమల్లె..వానజల్లుల్లోనా..జలకాలాడే
జాణ..శింగరాలే..నావిగా..లాల..లా
సందెగాలి..తావి చిందుల్లోనా
అందాలన్నీ..ముద్దమందారాలై..నావిగా..ఆ..హ్హా..హా
ఏ..వంకలేని..వంక జబిల్లీ..నావంకరావే
నడచే..రంగవల్లీ..అందుకో..కమ్మనీ ఆమనీ..ప్రేమనీ

కదిలే..కోరికవో..హా
కథలో..నాయికవో..హ..హ్హా
కవితా..కన్యకవో..ఆ..హా
భువిలో..తారకవో..ఆ..హ్హా
ఓ..ప్రియా..ఓ..ప్రియా..నీకిదే..స్వాగతం

కోనసీమ పచ్చికోక గట్టి
గోదారమ్మా పోగే కొంగు చుట్టి..లీలగా..లాలలా
నీవంటే? దా చిలక..చిలకమ్మ గూడేకోరే గోరింక
పంచుకో..గూడునీ..గువ్వనీ..గుండెనీ

వలచే..గోపికనీ..హా
కొలిచే..రాధికనీ..ఓ..హో
మనసే..కానుకనీ..ఆ..హా
మురిసే..బాలికనీ..ఓ..హ్హో
ఓ..ప్రియా..ఓ..ప్రియా..నీకిదే స్వాగతం

మల్లె పందిరి--1981
















పాట ఇక్కడ వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల
నిర్మాణ సంస్థ R.K.మూవీస్


::::::::::::::::::::::::

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే

తొలిచూపు తో రణమాయే..మ్..రాముని తోక..హహహ
"సారీ..అచ్చు తెలుగు నా కంతగా రాదు..అంటే..
అంటే..మిగతా భాషలో పండితుడినని కాదు"..హహహ

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే
తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే

పగడాల పెదవులతోనే..బిడియాలు కలబడుతుంటే
వగలమారి చెక్కిలిమీద..పగటి చుక్క పకప్కమంటే..
శివమై..అనుభవమై..శుభమై..సుందరమై..
శివమై..అనుభవమై..శుభమై..సుందరమై..
కనుచూపు శుభలేఖలుగా..కనుచూపు శుభలేఖలుగా
కల్యణ రేఖలు మెరిసే...

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే
తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే

మనువు..పసుపు..కుంకుమలై..మనువు..గడప దాటుతువుంటే..
కల్కి..బొట్టు..కాటుకలై..కాపురాన అడుగిడుతుంటే..
సిరిగా..శ్రీహరిగా..కలిసే లావిరిలో..
నయనాలు..ప్రియవచనాలై..నయనాలు..ప్రియవచనాలై
అనురాగమే వినిపించే....

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే
తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే

Wednesday, September 16, 2009

శక్తి --- 1983



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

అందమంత మోసుకొచ్చా..అందగాడి కోసమొచ్చా
రారా రాకుమారా..నన్నే..ఏలుకోరా..వయ్యారీ బుల్లోడా
అందాలే..నీవయ్యా...అందాలే..నీవయ్యా..
బ్యూటీక్వీన్..యా..బ్యూటీక్వీన్..యా..లలలలా..లలలలా

అందమంత మెచ్చుకొన్నా..చందమామలిచ్చుకొన్నా
రావే..రాణిబొమ్మా..నీదేరాచనిమ్మ..వయ్యారీ బుల్లెమ్మా..అందాలే..నావమ్మా..
లవ్లీ కింగ్..హా..లవ్లీ కింగ్..హా..లలలలా లలలలా
చక్కదనాల రాణీ..చెక్కిలి చెక్కర కేళీ
చెక్కిన నాడే కానీ..చుక్కలు చూడని బోణీ..
లలలలా...లలలలలా..

అందమంత మెచ్చుకొన్నా..చందమామ ఇచ్చుకొన్నా
రారా రాకుమారా..నన్నే..ఏలుకోరా..
వయ్యారీ బుల్లెమ్మా..అందాలే..నావమ్మా..
లవ్లీ కింగ్..హా..లవ్లీ కింగ్..హా..లలలలా మ్మ్హు.హూ..

ఉలిపిరిచీరకు ఊపిరి పైటంటా..హహహా..ఆ..ఆ
జారినపైటే..జావళిపాటంటా..హ్హా..
చూసిన కన్నే..రాయని కవితంటా..
కమ్మని కవితకు కౌగిలి ఇల్లంటా..హ్హా..
మోవికి అందే మోవీ..మోహన పిల్లనగ్రోవీ..
హాయిగ ప్రాణాలూదే..అల్లరి పల్లవి రాణీ..
లలలలా...మ్మ్మ్..హుహుహూ..

అందమంత మోసుకొచ్చా..అందగాడి కోసమొచ్చా
రావే..రాణిబొమ్మా..నీదేరాచనిమ్మ
వయ్యారీ బుల్లోడా
అందాలే..నీవయ్యా...అందాలే..నీవయ్యా..
బ్యూటీక్వీన్..యా..బ్యూటీక్వీన్..యా..లలలలా..లలలలా
లవ్లీ కింగ్..హా..లవ్లీ కింగ్..హా..లలలలా లలలలా..ఆహ..అహహహా...ఓహో..
ఓహోహోహో..

Tuesday, September 15, 2009

చుట్టాలున్నారు జాగ్రత్తా--1980



సంగీతం::MS.విశ్వనాథన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,S.జానకి


అమ్మీ ఓ లమ్మీ గుమ్మైన అప్పలమ్మీ
నా చింతమాను సిగురా నా గున్నమావిడి గుబురా
నా ఏడిబులమ షారా నా ఇప్పపూలసారా..
అరిసెలపాకంకన్నా అందమైన జాణా..ఆ..ఆ..ఆ..
అరిసెలపాకం కన్నా అందమైనదానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..అహ..అహ..అహా..

అబ్బీ ఓ రబ్బీ చురుకైన సోకులబ్బీ
నా సింగరాయకొండ..నా సికాకోలుదండ
నా చంద్రహారం గొలుసా..నా గుమ్మిడాల పులుసా..
గుడమేటి వరదకన్నా సురుకైన వాడా..ఆ..ఆ..ఆ..
హేయ్..గుడమేటి వరదకన్నా సురుకైన వాడా
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..హ్హు..
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..ఆ..హేయ్..

తాళ్ళపాకలో నిన్ను కలిసినప్పుడు
రంగు గళ్ళకోకలో నువ్వు మెరిసినప్పుడు
నిన్ను చూసానో లేదో..చెయ్యివేసానో..లేదో
నిన్ను చూసానో లేదో..చెయ్యివేసానో..లేదో
నివు నిప్పుదగ్గరి నక్కలాగ కరగలేదా
కరిగి కరిగి ఒక్కమాటు వొరగలేదా..

ఎల్లమ్మ జాతరకు ఎల్లినప్పుడు
ఎంట..ఎంటబడి నా చేయ్యి గిల్లినప్పుడు..అహా..
కాస్త..కసిరానూ..లేదో..కొంగు ఇసిరానో..లేదో..
కాస్త..కసిరానూ..లేదో..కొంగు ఇసిరానో..లేదో..
నువ్వు కాలుకాలిన పిల్లిలాగ..తిరగలేదా..
తిరిగి..తిరిగి..అరుగుమీద ఒరగలేదా..

అమ్మీ ఓ లమ్మీ గుమ్మైన అప్పలమ్మీ
నా చింతమాను సిగురా నా గున్నమావిడి గుబురా
నా ఏడిబులమ షారా నా ఇప్పపూలసారా..

హేయ్..గుడమేటి వరదకన్నా సురుకైన వాడా
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..హ్హా..
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..ఆ..హేయ్..

సందెకాడ నేను తానమాడినప్పుడు..
తడికసాటునుంచి నువ్వు తొంగి చూసినప్పుడు
అయ్య..లేసాడో..లేదో..కర్ర తీసాడో..లేదో..
అయ్య..లేసాడో..లేదో..కర్ర తీసాడో..లేదో..
నా కాళ్ళమీదబడి మొక్కలేదా..
కట్టుకొంటానని ఒట్టుపెట్టలేదా..

నీ సికిలి సూపు నాపైన యిసిరినప్పుడు..
నీ మొకమంతా సిరినవ్వే విరిసి నప్పుడు..
ఏమైదో..ఏమో..ఏమవుతుందో..ఏమో..
ఆనాటినుంచి నా మనసే నిలవకున్నదే..
నాటుమందేసిన నీ ఊసే..వదలకున్నదే..

గుడమేటి వరదకన్నా సురుకైన వాడా
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..హ్హా..
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..ఆ..హేయ్..

అరిసెలపాకం కన్నా అందమైనదానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..అహ..అహ..అహా..

Saturday, September 12, 2009

మరపురాని మనిషి--1973




















సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి

పల్లవి::

హేయ్..య్యా..
వచ్చింది వచ్చింది..లచ్చిమి 
వచ్చింది వచ్చింది..లచ్చిమి 
వనలచ్చిమి మాహలచ్చిమి ధనలక్ష్మి మాలచ్చిమి  
వచ్చింది వచ్చింది..లచ్చిమి మాలచ్చిమి
పచ్చాని చిలకల్లే..పసి నిమ్మపండల్లే 
పచ్చాని చిలకల్లే..పసి నిమ్మపండల్లే 
ముచ్చటైన వయ్యారం..మూటగట్టి తెచ్చింది 
వచ్చింది..హేయ్..వచ్చింది లచ్చిమి మా లచ్చిమి

చరణం::1

మెత్తగా ఓరచూపు..నాటుకుంది  
మెత్తగా ఓరచూపు..నాటుకుంది  
సుర కత్తిలా గుండెల్లో..దిగుతుంది 
తీయగా ఒక నవ్వు..చిలుకుతుంది
గుండెగాయాన్ని..మరీ మరీ కెలుకుతుంది 
హేయ్..తీయగా ఒక నవ్వు చిలుకుతుంది
గుండెగాయాన్ని మరీ మరీ..కెలుకుతుంది హాయ్ అల్లా 
అరె అందమంటే దానిదే..బతుకెందుకురా అది లేనిదే 
హాయ్ హాయ్..వచ్చింది వచ్చింది లచ్చిమి మా లచ్చిమి

చరణం::2

లేని నడుము ఓయమ్మో..కదులుతుంది 
అది ఉన్నమనసునే..కాస్తాకాజేస్తుంది  
ఘల్లూ ఘల్లూన అది..నడుస్తుంది దాని 
కాళ్ళకింద పడుచుదనం..పడిచస్తుంది
ఘల్లూ ఘల్లూన..అది నడుస్తుంది దాని 
కాళ్ళకింద పడుచుదనం..పడిచస్తుంది 
అయ్ బాబోయ్..నా ప్రక్కనే వుంటే 
ఆ చెలి ఇంకెక్కడిదిరా..ఆకలి 
వచ్చింది..హేయ్..వచ్చింది..లచ్చిమి మా లచ్చిమి

చరణం::3

ఖాదర్ బాయికి..కోడిపలావు తెచ్చింది 
సింహాద్రికి చేపల..పులుసు తెచ్చింది
ఖాదర్ బాయికి..కోడిపలావు తెచ్చింది 
సింహాద్రికి చేపల..పులుసు తెచ్చింది
యాదగిరికి దూదుమలాయి..తెచ్చింది
యాదగిరికి..దూదుమలాయి తెచ్చింది 
మరి నీకూ..
అన్ని రుచులూ కలిగివున్న కన్నెవయసే తెచ్చింది 
ముద్దుల కానుకగా ఇంచ్చింది..హాయ్ హాయ్ హాయ్
వచ్చింది వచ్చింది లచ్చిమి  
మనలచ్చిమి మహలచ్చిమి ధనలక్ష్మి మా లచ్చిమి
వచ్చింది వచ్చింది లచ్చిమి మాలచ్చిమి

మరపురాని మనిషి--1973







సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి

పల్లవి::

ఓ రామయా శ్రీరామయా..ఓ రామయా శ్రీరామయా 
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఓ రామయ్యా శ్రీరామయ్యా  
ఆడదాన్ని పుట్టించి..వదిలావయా  
దాన్నందుకునేదాక..మాకు రందేనయా 
దాన్నందుకునేదాక..మాకు రందేనయ్యా
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఓ రామయ్యా శ్రీరామయ్యా 
ఆడదాన్ని పుట్టించి..వదిలావయ్యా 
దాన్నందుకున్న మగవాడే..మొనగాడయ్యా 
దాన్నందుకున్న మగవాడే..మొనగాడయ్యా

చరణం::1

చురకత్తి మీసాల సోగ్గాడా..నీసురుకైనా సూపులు నాకాడా 
చురకత్తి మీసాల సోగ్గాడా..నీసురుకైనా సూపులు నాకాడా 
నీలాల కన్నుల సినదాన..నీ నిక్కెంత సేపో నేనెరుగనా
నీలాల కన్నుల సినదాన..నీ నిక్కెంత సేపో నేనెరుగనా
ఈపాటి సూపులకే పడిపోను..యీ మాపంతా ఆడినా అలసిపోను
వయసేమో వానకాలం మనదంటిదీ..ఆహా..
నువ్వొద్దన్నా అది నిన్ను..ముంచేస్తది 
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఆడదాన్ని పుట్టించి వదిలావయ్యా 
దాన్నందుకున్న మగవాడే..మొనగాడయ్యా

చరణం::2
  
కళ్ళకు కాటుక గిరిగీస్తే..అవి కట్టుబడి వుంటాయీ జత వస్తే 
కళ్ళకు కాటుక గిరిగీస్తే..అవి కట్టుబడి వుంటాయీ జత వస్తే  
కళ్ళల్లో ఆశేమో కాగుతుంటది..కాటుకేమొ ఆ సెగకు కరిగిపోతది
కళ్ళల్లో ఆశేమో కాగుతుంటది..కాటుకేమొ ఆ సెగకు కరిగిపోతది
కొంగుతోటి బిర్రుగా బిగకడితే..గుండె కొట్టుకోక వుంటదా కోరికైతే
మనసుకూ కాళ్ళకూ జగడమౌతదీ..మనసుకూ కాళ్ళకూ జగడమౌతదీ 
ఎటుబోను తోచక..ఏడుపొస్తది
ఓ రామయ్యా..శ్రీరామయ్యా 
ఆడదాన్ని పుట్టించి..వదిలావయా  
దాన్నందుకునేదాక..మాకు రందేనయా
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఓ రామయ్యా 
శ్రీరామయ్యా ఓ రామయ్యా..శ్రీరామయ్యా

మరపురాని మనిషి--1973








సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P సుశీల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి

పల్లవి::

ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు 
పెద్ద మొనగాడల్లే..వచ్చాడు 
మన మధ్యన పడితే..ఏమవుతాడు  
ఏమవుతాడు..ఏమవుతాడు

ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు 
పెద్ద మొనగాడల్లే..వచ్చాడు 
మన మధ్యన పడితే..ఏమవుతాడు  
ఏమవుతాడు..హ్“..ఏమవుతాడు 
ఆటు పోటుకు ఆగుతాడు..రాటు తేలి
తేలుతాడు అంతకన్నా..ఏమవుతాడు
ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు 

చరణం::1

పగ్గం తెంచి పడుచుదనం..పైపై కొస్తే
ఏంజేస్తాడు..పైపై కొస్తే ఏంజేస్తాడు  
పగ్గం తెంచి పడుచుదనం..పైపై కొస్తే ఏంజేస్తాడు 
బుగ్గమీద ఒక కాటేస్తాడు..ఆ..ఆ..ఆ
సిగ్గులు నిలువున..దోచేస్తాడు  
ఓయ్ యహయహు ఓయ్ యహయహు 
బుగ్గమీద ఒక కాటేస్తాడు..ఆ ఆ..ఆ
సిగ్గులు నిలువున.. దోచేస్తాడు
దోచేలోగా దొంగను బట్టి..అల్లరిచేస్తే ఏం చేస్తాడు
అల్లరైనది ఇక అడ్డేముందని..ఆలూమగలం 
మేమంటాడు మేమంటాడు..ఇంకేమంటాడు 
ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు 
పెద్ద మొనగాడల్లే..వచ్చాడు 
మన మధ్యన పడితే..ఏమవుతాడు  
ఏమవుతాడు..ఏమవుతాడు

చరణం::2

జలకాలాడే జవ్వనులు..తళతళలాడుట చూశాడు 
తళతళలాడుట..చూశాడు 
జలకాలాడే జవ్వనులు..తళతళలాడుట చూశాడు
గోపికలేమో..అనుకున్నాడు 
పాపం..గోపాలుడల్లే..వచ్చాడు
ఓయ్ యహయహు..గోపికలేమో అనుకున్నాడు 
గోపాలుడల్లే..వచ్చాడు
ఎత్తుకుపోను..కోకలు లేవు 
ఎక్కేటందుకు..కొమ్మలులేవు
కోకకు బదులు కోర్కెవుంది..కొమ్మకు బదులీ బొమ్మ వుంది 
ఎత్తుకుపోతాడు..ఇలా ఎత్తుకుపోతాడు

మరపురాని మనిషి--1973























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి

పల్లవి::

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును
నా కళ్ళకే వెలుగైన..నువ్వు చాలును 
నీ నవ్వు..చాలును

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును

చరణం::1

చెప్పలేని వెన్నెన్నో..లోన దాగివున్నవి 
వుండి వుండి నిన్నే కాదని..వుబికి వురుకుతున్నవి 
చెప్పలేని వెన్నెన్నో..లోన దాగివున్నవి 
వుండి వుండి నిన్నే కాదని..వుబికి వురుకుతున్నవి 
ఒప్పుకోక వోపలేక మనసు..వూగుతున్నది 
తప్పుకాదు తప్పదు అని..వయసు లాగుతున్నది 
ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును

చరణం::2

వలపు చదువుకు ఓనమాలు..నువ్వు నేర్పావు 
ఆ..ఓ..కు వున్న వొంపులన్నీ..నువ్వు చూపావు
వలపు చదువుకు ఓనమాలు..నువ్వు నేర్పావు 
ఆ..ఓ..కు వున్న వొంపులన్నీ..నువ్వు చూపావు
ప్రేమ నీకు ధారబోసి..పేదనైనాను 
పేదవాడిదే రాజ్యమని..నన్నేలుతున్నావు

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును

చరణం::3

తీయనైన కోర్కెలేవో..రేయి రేగుతున్నవి 
తెల్లవారి పక్కనజేరి..నన్ను లేపుతున్నవి
తీయనైన కోర్కెలేవో..రేయి రేగుతున్నవి 
తెల్లవారి పక్కనజేరి..నన్ను లేపుతున్నవి
లేచి చూచి వేచి వేచి..లేత ముదురైపోతుంది 
మొగ్గ ముదిరి సిగ్గువిడిచి..పూవు తానై పూస్తుంది

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును
నా కళ్ళకే వెలుగైన..నువ్వు చాలును 
నీ నవ్వు చాలును..మ్మ్ హూహుహూ

మరపురాని మనిషి--1973






సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి.

పల్లవి::

ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు
మమతలున్నమనసులో..కొలువుంటాడు 
మమతలున్నమనసులో..కొలువుంటాడు
కరుణగల కళ్ళలో..కనుపిస్తాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు

చరణం::1

పుట్టే ప్రతి చిట్టిపాప..పుట్టుకలో
తనకు మనిషిమీద..నమ్మకం చాటుతాడు 
పుట్టే ప్రతి చిట్టిపాప..పుట్టుకలో
తనకు మనిషిమీద..నమ్మకం చాటుతాడు 
ఆ నమ్మికతో బోసినోట..నవ్వుతాడు
ఆ నమ్మికతో బోసినోట..నవ్వుతాడు
నిన్నా నవ్వు పెంచి..పంచమని పంపినాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు

చరణం::2

చదువుతో ఎదగాలి..హృదయము
ఆ హృదయానికి..నేర్పాలి త్యాగము
చదువుతో ఎదగాలి..హృదయము
ఆ హృదయానికి..నేర్పాలి త్యాగము
నువ్వు కోరాలి..పదిమంది సౌఖ్యము
నువ్వు కోరాలి..పదిమంది సౌఖ్యము 
నిన్నె కోవెలగా చేసుకుని..వుంటాడు దైవము 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు

చరణం::3

తనరక్తం పాలుగా..పంచుగోవులో 
గోవులాంటి పేదవాడి..చెమటలో
తనరక్తం పాలుగా..పంచుగోవులో 
గోవులాంటి పేదవాడి..చెమటలో
ఆ చెమట తుడుచు..నెనరైన చేతిలో
ఆ చెమట తుడుచు..నెనరైన చేతిలో 
తానుండి లీలగా..ప్రేమగా లాలిస్తాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు
మమతలున్నమనసులో..కొలువుంటాడు 
కరుణగల కళ్ళలో..కనుపిస్తాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే అక్కడే..వున్నాడు 
ఆహా ఆ ఆ ఆ ఆ 

Friday, September 11, 2009

మైనరు బాబు--1973




సంగీతం::T.చలపతిరావు 
రచన::ఆత్రేయ
గానం::S.P. బాలు,బృందం

పల్లవి::

జీవితానికొక..ధ్యేయం కావాలి
ఆ ధ్యేయాన్ని..సాధించే దీక్ష కావాలి 

ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి
శ్రమ శక్తిని తెలుసుకొనీ
క్రమ శిక్షణ మలచుకొనీ
శ్రమ శక్తిని తెలుసుకొనీ
క్రమ శిక్షణ మలచుకొనీ
నిటారుగా నిలుచుంటే
విజయం నీదే..అంతిమ విజయం నీదే       
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి 

చరణం::1

ఓహ్హో హ్హో హ్హో హ్హో ఓహో
ఓహ్హో హ్హో హ్హో హ్హో ఓహో

కండలే..ఏ..కొండల్ని పిండిచేస్తాయి
వంగనీ..ఈ..లోహాన్ని లొంగ దీస్తాయి
కండలే..ఏ..కొండల్ని పిండిచేస్తాయి
వంగనీ..ఈ..లోహాన్ని లొంగ దీస్తాయి 
చిని చిన్ని చినుకులే..ఏ..పెను వాగు లౌతాయిలే
చిని చిన్ని చినుకులే..ఏ..పెను వాగు లౌతాయిలే        
ఓఓఓఓ..మనిషి..ఓహోఓఓఓ..మనిషి 

చరణం::2

ఓ హో హో హో హో ఓ హో హో హో హో
తరం తరం..దూరమైన కాలమిదీ
క్షణం క్షణం..మారుతున్న లోకమిదీ
తరం తరం..దూరమైన కాలమిదీ
క్షణం క్షణం..మారుతున్న లోకమిదీ
ఈ తరంలో..ఈ క్షణంలో
ఈ తరంలో..ఈ క్షణంలో 
నీవు నీవుగా..బ్రతకాలీ
భావి బాటనే వెతకాలీ..బతకాలీ   
ఓఓఓఓ.మనిషి..ఓహోఓఓఓ..మనిషి

చరణం::3

ఆ ఆఅ హాహాహా ఆఆఆ హాహాహా 
తిండి దొరకని..వారొకవైపూ
తిన్న దరగని..వారొకవైపూ
తిండి దొరకని..వారొకవైపూ
తిన్న దరగని..వారొకవైపూ
రాళ్ళు బండలు..ఒక వైపూ
పళ్ళు పాయస..మొకవైపూ
ఎగుడు దిగుడుల..లోకమిదీ
వెలుగు చీకటుల..కాలమిదీ       
ఎగుడు దిగుడుల..లోకమిదీ
వెలుగు చీకటుల..కాలమిదీ   
ఓఓఓఓ..మనిషి..ఈ  

మైనరు బాబు--1973
























సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

రమ్మంటే గమ్మునుంటాడందగాడూ బలే అందగాడూ..హత్తెరి
రమ్మంటే గమ్మునుంటాడందగాడూ..బలే అందగాడూ 
వెళ్ళిపోతుంటే నా వెంటేపడతనంటడు..బలే గడుసు గుంటడు
వెళ్ళిపోతుంటే నా వెంటేపడతనంటడు..బలే గడుసు గుంటడు

ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్లా..బలే కొంటె పిల్లా..హత్తెరి
ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్లా..బలే కొంటె పిల్లా  
చేరబొతేనే ఓరబ్బో జారుకుంటదీ..అయ్యో జడుసుకుంటది 
చేరబొతేనే ఓరబ్బో జారుకుంటదీ..అయ్యో జడుసుకుంటది 

చరణం::1

కురిసే మబ్బులాగ వురుము తున్నడూ
కొంగుగాలి విసురుకే వురుకుతున్నడూ
కురిసే మబ్బులాగ వురుము తున్నడూ
కొంగుగాలి విసురుకే వురుకుతున్నడూ 
మాటలతోనే కోటలు కడతడూ
చూపులతోనే చురకలు పెడతడూ
మాటలతోనే కోటలు కడతడూ
చూపులతోనే చురకలు పెడతడూ
తీరా నే ఢీ కొంటే సామిరంగా..బోర్ల పడతడు..హత్తెరి
రమ్మంటే గమ్మునుంటాడందగాడు..బలే అందగాడు 
వెళ్ళిపోతుంటే నా వెంటేపడతనంటడు
బలే గడుసు గుంటడు..హత్తెరి
రమ్మంటే గమ్మునుంటాడందగాడు..బలే అందగాడు 

వసబోసిన పిట్టలాగ వాగుతుంటదీ..కసిగా చూస్తేనే కంది పోతదీ
వసబోసిన పిట్టలాగ వాగుతుంటదీ..కసిగా చూస్తేనే కంది పోతదీ
నడకల తోనే నన్నుడికిస్తదీ..నవ్వులతోనే నను కవ్విస్తదీ
నడకల తోనే నన్నుడికిస్తదీ..నవ్వులతోనే నను కవ్విస్తదీ
తీరా పైపైకెళితే సామిరంగా..బ్యారుమంటదీ..హత్తెరి
ఊరుకుంటే గీరుతుంటదీ కోతి పిల్ల..బలే కొంటె పిల్ల 

చరణం::2

ఎచ్చులకోరు పిచ్చయ్యల్లే ఎగురుతుంటడూ
మచ్చిక చేస్తుంటే రెచ్చిపోతడూ
ఎచ్చులకోరు పిచ్చయ్యల్లే ఎగురుతుంటడూ
మచ్చిక చేస్తుంటే రెచ్చిపోతడూ

పూసల పిల్ల బాసలు చేస్తదీ
ఆశకు పోతే అల్లరి పెడతదీ
పూసల పిల్ల బాసలు చేస్తదీ
ఆశకు పోతే అల్లరి పెడతదీ

ఇద్దరమూ ఏకమైతే సామిరంగా
చల్ మోహనరంగా
హత్తెరి..ఊరుకుంటే గీరుతుంటది
కోతి పిల్లా..బలే కొంటె పిల్లా  
హత్తెరి..రమ్మంటే గమ్మునుంటాడందగాడూ..బలే అందగాడూ

Wednesday, September 09, 2009

కన్నకొడుకు--1973


























సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు.

పల్లవి::

ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 
ఆ ఇల్లే బంగరు కోవెల..ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల..ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి

చరణం::1

చిన్నబాబుగారున్నారు..వెన్నపూసతో పెరిగారు
చిన్నబాబుగారున్నారు..వెన్నపూసతో పెరిగారు
సరదాబాబుల సహవాసంలో..దారితప్పి పోతున్నారు
చేజారి పోతున్నారు
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 

చరణం::2

పెద్దయ్యగారి పేరుచెప్పితే..పెద్దపులే భయపడుతుంది
ఛెళ్ళున కొరడా ఝళిపిస్తేనే..ఇల్లు దద్దరిల్లి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 
ఆ ఇల్లే బంగరు కోవెల..ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి

చరణం::3

పాపమ్మలాంటి అత్తమ్మగారు..ప్రతి ఇంటిలోన వుంటారు 
ఆయమ్మగారు మహమ్మారి తీరు..ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు..గుటకాయస్వాహా చేస్తారు
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 

చరణం::4

అమ్మ అనే రెండక్షరాలలో..కోటి దేవతల వెలుగుంది
అమృత మనేది వుందంటే..అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మ మనసులోనే వుంది 
ఆ తల్లి చల్లని దీవెన చాలు..ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు

Kanna Koduku--1973
Music::T.Chalapati Rao
Lyrics::D.C.Narayana Reddi
Singer's::Gantasala

:::

unnadi naakoka illu..unnadi naakoka talli 
aa ille bangaru kovela..aa talli challani devataa
unnadi naakoka illu..unnadi naakoka talli
unnadi naakoka illu - unnadi naakoka talli 
aa ille bangaru kovela..aa talle challani devataa
unnadi naakoka illu- unnadi naakoka thalli

:::1

chinnabaabugaarunnaaru..vennapoosato perigaaru
chinnabaabugaarunnaaru..vennapoosato perigaaru 
saradaabaabula sahavaasamlo..daaritappi potunnaaru
cheyjaari pothunnaaru
unnadi naakoka illu..unnadi naakoka talli 

:::2

peddayyagaari perucheppite..peddapule bhayapadutundi
chelluna koradaa jhalipistene..illu daddharilli potundi
maa ollu hunamaipotundi 
unnadi naakoka illu..unnadi naakoka talli 
aa ille bangaru kovela..aa talle challani devataa
unnadi naakoka illu..unnadi naakoka talli

:::3

paapammalanti attammagaaru..prati intilona vuntaaru 
aayammagaaru mahammaari teeru..aayammagaaru mahammaari theeru 
annee swaahaa chestaaru..gutakaayaswaahaa chestaaru  

:::4

amma ane rendakksharaalalo..koti devatala velugundi
amruta manedi vundante - adi amma manasulone vundi
maa amma manasulone vundi 
aa talli challani deevena chaalu
inkenduku veeyi varaalu inkenduku veeyi varaalu

కన్నకొడుకు--1973






సంగీతం::T.చలపతిరావు
రచన:ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు.

పల్లవి::

తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా వుండాలి..సై యంటే స్వర్గాలే దిగిరావాలి
తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి 

చరణం::1

మొలక మబ్బులు ముసిరితే ఓహో..చిలిపి గాలులు విసిరెతే ఓహో
మొలక మబ్బులు ముసిరితే..చిలిపి గాలులు విసిరెతే
పచ్చపచ్చని పచ్చిక బయలే పానుపుగా..అమరితే అమరితే అమరితే

తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా వుండాలి..సై యంటే స్వర్గాలే దిగిరావాలి

చరణం::2

నీ నల్లని నీ కురులను నే దువ్వీ..యీ సిరిమల్లెలు నీ జడలో నే తురిమీ
పట్టుచీరే కట్టించి..పైట నేనే సవరించి, సవరించి సవరించి
నిగనిగలాడే నీ సొగసంతా..నే నొక్కడినే చూడాలి 
       
తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా వుండాలి..సై యంటే స్వర్గాలే దిగిరావాలి

చరణం::3

తీయగా నువు కవ్విస్తే ఓహో..తీగలా నను పెనవేస్తే ఓహో
తీయగా నువు కవ్విస్తే..తీగలా నను పెనవేస్తే
పూలతోట పులకరించీ..యీల పాటలు పాడితే పాడితే పాడితే
పొంగే అంచుల పల్లకిపైన..నింగి అంచులను దాటాలి
  
తింటే గారెలే తినాలి..వింటే భారతం వినాలి 
ఉంటే నీ జంటగా వుండాలి..సై యంటే స్వర్గాలే దిగిరావాలి

Kanna Koduku--1973
Music::T.Chalapati Rao
Lyrics::Arudra
Singer's::P.Suseela,Gantasala

:::

tinte gaarele tinaali..vinte bhaaratam vinaali
unte nee jantagaa vundaali..sai yante svargaale digiraavaali
tinte gaarele tinaali..vinte bhaaratam vinaali 

:::1

molaka mabbulu musirite oho..chilipi gaalulu visirete oho
molaka mabbulu musirite..chilipi gaalulu visirete  
pacha pachani pachchika bayale Paanupugaa..amarite amarite amarite

tinte gaarele tinaali..vinte bhaaratham vinaali 
unte nee jantagaa vundaali..sai yante..svargaale digiraavaali

:::2

nee nallani nee kurulanu ne duvvee
ii sirimallelu nee jadalo ne turimee
pattucheere kattinchi..paita nene savarinchi, savarinchi, savarinchi
niganigalaade nee sogasantaa..ne nokkadine choodaali          
tinte gaarele tinaali..vinte bhaaratham vinaali  
Unte nee jantagaa vundaali..sai yante svargaale digiraavaali

:::3

teeyagaa nuvu kavviste oho..teegalaa nanu penaveste oho
teeyagaa nuvu kavviste..teegalaa nanu penaveste  
poolatota pulakarinchee..yeela Paatalu paadite paadite paadite
ponge anchula pallakipaina..ningi anchulanu daataali 
tinte gaarele tinaali..vinte bhaaratam vinaali  
unte nee jantagaa vundaali..sai yante svargaale digiraavaali

కన్నకొడుకు--1973






సంగీతం::T.చలపతిరావు
రచన:ఆరుద్ర
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు.

పల్లవి::

నేను నేనేనా..నువ్వు నువ్వేనా
నేను నేనేనా..నువ్వు నువ్వేనా
ఎక్కడికో..ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది..హృదయం
చిక్కని చక్కని..సుఖంలో  
మునిగిపోతోంది దేహం..హాయ్  
నేను నేనేనా..నువ్వు నువ్వేనా       

చరణం::1

ఇదా మనిషి కోరుకొను..మైకం
ఇదా మనసు తీరగల..లోకం 
జిగేలు మంది..జీవితం 
పకాలుమంది..యవ్వనం
జిగేలు మంది..జీవితం 
పకాలుమంది..యవ్వనం    
నేను నేనేనా..నువ్వు నువ్వేనా
ఎక్కడికో..ఎక్కడికో 
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది..హృదయం 
చిక్కని చక్కని..సుఖంలో 
మునిగిపోతోంది దేహం..హాఆ 
నేను నేనేనా..నువ్వు నువ్వేనా 

చరణం::2

ఓహో యీ మత్తు..చాల గమ్మత్తు
ఊహూ ఊహూ..ఇంకేది మనకు వద్దు
నిషాలు గుండె..నిండనీ 
ఇలాగె రేయి..సాగనీ
నిషాలు గుండె..నిండనీ
ఇలాగె రేయి..సాగనీ 
నేను నేనేనా..నువ్వు నువ్వేనా
ఎక్కడికో..ఎక్కడికో 
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది..హృదయం 
చిక్కని చక్కని..సుఖంలో
మునిగిపోతోంది దేహం హాఆ  

కన్నకొడుకు--1973






సంగీతం::T.చలపతిరావు
రచన:ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల,జయదేవ్,రంది రమేష్
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

లోకం..మ్మ్ మ్మ్ మ్మ్..శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లోకం..మ్మ్ మ్మ్ మ్మ్..శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లలలాలా..ఆఆఆ 
మైకం..మ్మ్ మ్మ్ మ్మ్..తదేకం..మ్మ్ మ్మ్ మ్మ్..
మైకం తదేకం..వదలొద్దు..లాలాలాలాలలా
అను అను అను..హరేరాం..అను 
అను అను అను..హరేకృష్ణ అను
హరేరాం..లాలాలాలా..హరేరాం..లాలాలాలాలా
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం 
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం

చరణం::1

నీతి నియమం బూడిద..ఏహే
పాత సమాజం వీడర..ఏహే
నీతి నీయమం బూడిద..ఏహే
పాత సమాజం వీడర..అహో 
ఇల్లూ వాకిలీ..తల్లీ తండ్రీ..ఎవరూ లేరు 
ఏవరూ రారు..నీతో..నేవే 
నీలో నీవే..బతకాలి బతకాలి బతకాలి 
హరేరాం..లాలాలాలా..హరేరాం..లాలాలాలాలా
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం 
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం

చరణం::2

అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో  
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో 
   
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో    

ఆడాళ్ళకు మగవాళ్ళకు..తేడా తెలియదు 
అయ్య పంపే డబ్బులకే..అర్దం తెలియదు
కలసి మెలసి విందు..అహా..కైపులోన్ చిందు 
కలసి మెలసి విందు..అహా..కైపులోన చిందు
ఈ పోకడ దగా దగా..బతుకంతా వృధా వృధా  
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో    

చరణం::3

సౌఖ్యాలకు దొడ్డిదారి..వెతికేవాళ్ళు
బ్లాకుల్లోన లక్షలెన్నో..నూకేవాళ్ళు 
పాటు పడనివాళ్ళు..సాపాటు రాయుళ్ళు
ఏ పాటు పడనివాళ్ళు..సాపాటు రాయుళ్ళు
అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా 
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో  

చరణం::4

కష్టాల్లో పేదాళ్ళకు..మీరు అవసరం
కలవాళ్ళ దోపిడీకి..మీరు ఆయుధం
ఆపదలో ముడుపు..ఆపైన పరగడుపు
ఆపదలో ముడుపు..ఆపైన పరగడుపు 
అనాదిగా ఇదే ఇదే..రివాజుగ సాగాలా ?      
అయ్యో రామా..అయ్యో కృష్ణా 
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో

కన్నకొడుకు--1973



























సంగీతం::T.చలపతిరావు
రచన:దాశరథి
గానం::P.సుశీల,ఘంటసాల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

కళ్ళతో కాటేసి..వొళ్ళు ఝల్లుమనిపించి 
రమ్మంటే రానంటావెట్టాగే..పిల్ల యెట్టాగే..పిల్ల యెట్టాగే
బుగ్గమీద సిటికేసి సిగ్గులోన ముంచేసి
నన్నెట్ట రమ్మంటవ్ పిల్లగాడ..భలే పిల్లగాడ..కొంటె పిల్లగాడ

చరణం::1

తోటలోనా మాటువేసీ..వెంటబడితే బాగుందా 
పంటసేనూ గట్టుమీద..పైనబడితే బాగుందా 
సెంగావి చీరతో..బంగారు రైకలో 
మోజులెన్నో ఊరిస్తే..బాగుందా 
ఈ..కళ్ళలో కాటేసి..వొళ్ళు ఝల్లుమనిపించి 
రమ్మంటే రానంటావెట్టాగే..పిల్ల యెట్టాగే..పిల్ల యెట్టాగే

చరణం::2

మొదటిసారీ చూడగానే..మత్తుమందూ చల్లావే 
మాయజేసీ..మనసు దోచీ..తప్పునాదే అంటావే
బెదురెందుకు నీకనీ..ఎదురుగ నుంచోమనీ
పెదవిమీద నా పెదవిమీద..అమ్మమ్మో..బాగుందా    
బుగ్గమీద సిటెకేసి..సిగ్గులోన ముంచేసి
నన్నెట్ట రమ్మంటవ్ పిల్లగాడ..భలే పిల్లగాడ..కొంటె పిల్లగాడ

చరణం::3

సైగ చేసి సైకిలెక్కి..సరసమాడితే బాగుందా 
పైటసెంగూ నీడలోన..నన్నుదాస్తే బాగుందా 
కందిరీగ నడుముతో..కన్నెలేడి నడకతో   
కైపులోన ముంచెస్తే..బాగుందా 
ఈ..కళ్ళలో కాటేసి..వొళ్ళు ఝల్లుమనిపించి 
రమ్మంటే రానంటావెట్టాగే..పిల్ల యెట్టాగే..పిల్ల యెట్టాగే

చరణం::4

పెంచుకున్నా ఆశలన్నీ..పంచుకుంటానన్నావే 
ఊసులాడీ..బాసలాడీ..వొళ్ళుమరచీ పోయావే
జాబిల్లి వెలుగులో..తారల్ల తళుకులో..ఏవేవో కొరికలు కోరావే         
బుగ్గమీద సిటెకేసి..సిగ్గులోన ముంచేసి
నన్నెట్ట రమ్మంటవ్ పిల్లగాడ..భలే పిల్లగాడ..కొంటె పిల్లగాడ

Kanna Koduku--1973
Music::T.Chalapati Rao
Lyrics::Dasarathi
Singer's::P.Suseela,Ghantasala

:::

kallato kaatesi..vollu jhallumanipinchi 
rammante raanantaavettaage..pilla yettaage.. pilla yettaage
Buggameeda sitekesi siggulona munchesi
nannetta rammantav pillagaada 
bhale pillagaada..Konte pillagaada

:::1

totalonaa maatuvesee ventabadite baagundaa 
pantasenoo gattumeeda painabadite baagundaa 
sengaavi chiiralo bangaaru raikalo 
mojulenno uriste..baagundaa 
ii..kallalo kaatesi..vollu jhallumanipinchi 
rammante raanantaavettaage..pilla yettaage..pilla Yettaage 

:::2

modatisaari choodagaane..mattumandu challaave 
maayajesi manasu dochee..tappunaade antaave
bedurenduku neekanee..eduruga nunchomanee 
pedavimeeda naa pedavimeeda..ammammo..baagundaa    
buggameeda sitekesi siggulona munchesi
nannetta rammantav pillagaada
bhale pillagaada..Konte pillagaada

:::3
saiga chesi saikilekki..sarasamaadithe baagundaa 
paitasengu needalona..nannudaasthe baagundaa 
kandireega nadumuto..kanneledi nadakato 
kaipulona munchesthe..baagundaa 
ii..kallalo kaatesi vollu jhallumanipinchi 
rammante raanantaavettaage..pilla yettaage..pilla Yettaage 

:::4

penchukunnaa aasalannee..panchukuntaanannaave 
oosulaadee..baasalaadee..vollumarachee poyaave
jaabilli velugulo..taaralla thalukulo
evevo korikalu koraave       
buggameeda sitekesi siggulona munchesi
nannetta rammantav pillagaada..bhale pillagaada..konte pillagaada

కన్నకొడుకు--1973


























సంగీతం::T.చలపతిరావు
రచన:దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

ఎన్నడైనా అనుకున్నానా..ఎప్పుడైనా కలగన్నానా
ఇంత చల్లని మనసు నీ..కుందనీ
ఆ మనసులో నా కెంతో..చోటుందనీ 
ఎన్నడైనా..అనుకున్నానా..ఆ  

చరణం::1

నీ చిరునవ్వుల నీడలలోన..మేడకడతాననీ 
అల్లరిచేసే నీ చూపులతో..ఆడుకుంటాననీ     
ఎవరికి అందని నీకౌగిలిలో..వాలిపోతాననీ 
నీ రూపమునే నా కన్నులలో..దాచుకుంటాననీ..ఈ ఈ ఈ 
   
ఎన్నడైనా అనుకున్నానా..ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు..నీ కుందనీ
ఆ మనసులో నా కెంతో..చోటుందనీ 
ఎన్నడైనా..అనుకున్నానా..ఆ  

చరణం::2

వలపులు చిందే నా గుండెలలో..నిండివుంటావనీ 
పెదవుల దాగిన గుసగుసలన్నీ..తెలుసుకుంటావనీ
నా గుడిలోపల దైవము నీవై..వెలుగుతుంటావనీ
విరిసే సొగసుల విరజాజులతో..పూజ చేసేననీ..ఈ ఈ ఈ 

ఎన్నడైనా అనుకున్నానా..ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీ..కుందనీ 
ఆ మనసులో నా కెంతో..చోటుందనీ 
ఎన్నడైనా..అనుకున్నానా?   


Kanna Koduku--1973
Music::T.Chalapati Rao
Lyrics::Dasarathi
Singer's::P.Suseela

:::

ennadainaa anukunnaanaa..eppudainaa kalagannaanaa
inta challani manasu..nee kundanee 
aa manasulo naa kento..chotundanee 
ennadainaa Anukunnaanaa..aa   

:::1

nee chirunavvula needalalona..medakadataananee 
allaricaese nee choopulato..aadukuntaananee     
Evariki andani neekaugililo..vaalipotaananee 
nee roopamune naa kannulalo daachukuntaananee..ii ii ii 
   
ennadainaa anukunnaanaa..eppudainaa kalagannaanaa
inta challani manasu..nee kundanee 
aa manasulo naa kento..chotundanee 
ennadainaa anukunnaanaa   

:::2

valapulu chinde naa gundelalo..nindivuntaavanee 
pedavula daagina gusagusalannee..telusukunTaavanee
naa gudilopala daivamu neevai..velugutuntaavanee
virise sogasula virajaajulato..pooja chesenanee..ii ii ii 

ennadainaa anukunnaanaa..eppudainaa kalagannaanaa
inta challani manasu..nee kundanee  
aa manasulo naa kento..chotundanee 
ennadainaa anukunnaanaa..aa 

కన్నకొడుకు--1973




























సంగీతం::T.చలపతిరావు
రచన:దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

దేవుడిచ్చిన వరముగా..కోటి నోముల ఫలముగా 
ఇంటిలోని దివ్వెగా..కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా నవ్వరా చిన్ని కృష్ణా నవ్వరా 
దేవుడిచ్చిన వరముగా..కోటి నోముల ఫలముగా

చరణం::1

నన్ను దోచిన దేవుడే..ఈ నాటిలో కరుణించెలే 
కన్న కలలే నిజములై..నీ రూపమున కనిపించలే 
బొసి నవ్వులు ఒలకబోసి..లోకమే  మరపించరా 
దేవుడిచ్చిన వరముగా..నా కోటి నోముల ఫలముగా     

చరణం::2

మామ ఆస్తిని మాకు చేర్చే..మంచి పాపా నవ్వవే 
ఆదిలక్ష్మివి నీవేలే..మా ఆశలన్నీ తీర్చవే 
గోపి బావను చేసుకోని..గోపి బావను చేసుకోని కోటికే పడగెత్తవే  
    
దేవుడిచ్చిన వరముగా..నా కోటి నోముల ఫలముగా 
ఇంటిలోని దివ్వెగా..ఆ..కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా నవ్వరా..చిన్ని గోపి నవ్వరా
   

కన్నకొడుకు--1973



























సంగీతం::T.చలపతిరావు
రచన:కొసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల,శరావతి
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ.. 
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక..నిలిచిందే చూడడూ
అయ్యో రామా..పిలిచిందే చూడడూ
అయ్యో రామా..పిలిచిందే చూడడూ         
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ 

చరణం:1

బూరెల బుగ్గల బుడగడే..ఏమన్నా యిటు తిరగడే
బూరెల బుగ్గల బుడగడే..ఏమన్నా యిటు తిరగడే
బెల్లం కొట్టిన రాయిలాగా..బెల్లం కొట్టిన రాయిలాగా
బిర్రబిగుసుకొని వున్నాడే
అయ్యో రామా..బుర్ర గోక్కుంటున్నాడే   
అయ్యో రామా..బుర్ర గోక్కుంటున్నాడే
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ 

చరణం::2

ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా..బిత్తర చూపులు చూస్తాడమ్మా
ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా..బిత్తర చూపులు చూస్తాడమ్మా
ఏ యమ్మగన్న పిల్లోడోగాని..ఏ యమ్మగన్న పిల్లోడోగాని
ఎంత జెప్పినా..వినడమ్మా
అయ్యో రామా..ఏమైపోతాడోయమ్మా       
అయ్యో రామా..ఏమైపోతాడోయమ్మా 
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ 

చరణం::3

కలిగిన పిల్లను కాదంటాడే..పేదపిల్లపై మోజంటాడే 
కలిగిన పిల్లను కాదంటాడే..పేదపిల్లపై మోజంటాడే
డబ్బున్నవాళ్ళకు..ప్రేమ వుండదా
డబ్బున్నవాళ్ళకు ప్రేమ వుండదా..లేనివాళ్ళకే వుంటుందా   
అయ్యో రామా పిచ్చి..యింతగా ముదిరిందా 
అయ్యో రామా పిచ్చి..యింతగా ముదిరిందా    
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక..నిలిచిందే చూడడూ
అయ్యో రామా..పిలిచిందే చూడడూ 
అయ్యో రామా..పిలిచిందే చూడడూ

జీవన తరంగాలు--1973




సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ 

పల్లవి::

అది పవిత్రమైన మంగళ సూత్రం
కాదు..కాదు..కాదు
అది బలవంతాన వేసిన వురితాడు

తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?
తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?
ఇది పవిత్రమైన మంగళ సూత్రం..మంగళ సూత్రం
అది బలవంతాన వేసిన వురితాడు..వురితాడు వురితాడు
హాహాహా..ఎవరు వేశారు?
ఏనాడో విధి నీ నొసటను రాశాడు
అది అతడు చేశాడు..నీ భర్తైనాడు

చరణం::1

హా హా హా..భర్త..? 
ఎవరు భర్త..? 
ఆ మనసులేని పశువా?
పశువు కట్టినదా మాంగల్యం? 
కసాయితోనా దాంపత్యం..?
మనసు చచ్చీ బ్రతికితే నువు మనిషివి కావు
ఉరితాటి కింత పసుపు రాస్తే తాళి కాదు 

తెంచెయ్..
తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?
తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?

చరణం::2

భగవాన్..నాకెందుకీ శిక్ష..ఏమిటీ పరీక్ష..?
నేను కోరుకోలేదు ? నాకు తెలిసి జరగలేదు?

హా హా..పిచ్చిదానా ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే
నువ్వేనాటికైనా..అతని సతివే
ఒక్కసారే ఆడదానికి..పెళ్ళి జరిగేది
తెంచుకున్నా తీరిపోని..బంధమే యిది
తాళి తెంచే దెవరికమ్మా..ఆపై..ఆ
ఆడబ్రతుకు దేనికమ్మా..ఆ
ఆడబ్రతుకు దేనికమ్మా..ఆ 

Tuesday, September 08, 2009

జగమే మాయ--1973



















సంగీతం::సత్యం
రచన::D.C. నారాయణరెడ్డి
గానం::S. జానకి
తారాగణం::మురళీ మోహన్,గిరిబాబు,సునందిని,విజయ, విజయలలిత,రాజబాబు 
Murali Mohan First film::Jagame Maya

పల్లవి::

ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ 

చరణం::1
     
మృత్యువునై ప్రతినిత్యం..నిను వెంటాడుతు వున్నాను  
పచ్చని శీలం చెరిచిన..ఆ పచ్చి కసాయివి నీవే
ఇక చూసుకో..నను తెలుసుకో నేనే..నేనే..నేనే 
    
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ
   
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి  
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ

చరణం::2

కాళివలె సుడిగాలివలె..నీ కంటబడుతున్నాను
మృత్యువునై ప్రతినిత్యం నిను..వింటాడుతు వున్నాను
కణకణమండే కసితో..నీకై.. కాచుకొని వున్నాను
ఇటు చూసినా ఎటు చూసినా..నేనే..నేనే..నేనే  
   
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి  
ఆ....ఆ....ఆ  

చరణం::3

పచ్చని శీలం చెరిచిన..ఆ పచ్చి కసాయివి నీవే
మనుషుల రక్తం మరిగిన..ఆ రక్కసి జాతి నీదే
చీకటి మాటున చేసిన పాపం..చీల్చివేయును నిన్నె
ఇక చూసుకో..నను తెలుసుకో..నేనే..నేనే..నేనే
              
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ  అ..ఆ ఆ ఆ ఆ ఆ అ 
ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ
ఈ జ్వాల ఆరేది కాదు..ఈ బాధ తీరేది కాదు
ఏనాటికో ఒక నాటికి..నిను దహియించు ముమ్మాటికి
ఆ ఆ ఆ ఆ ఆ  అ..ఆ ఆ ఆ ఆ ఆ అ..ఆ ఆ ఆ ఆ ఆ అ

చరణం::4

కాళివలె సుడిగాలివలె..నీ కంటబడుతున్నాను
మృత్యువునై ప్రతినిత్యం నిను..వింటాడుతు వున్నాను
కణకణమండే కసితో..నీకై.. కాచుకొని వున్నాను
ఇటు చూసినా ఎటు చూసినా..నేనే..నేనే..నేనే  

ఇంటిదొంగలు--1973




సంగీతం::S. P. కోదండపాణి
రచన::కొసరాజు
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణంరాజు, జమున,సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య

పల్లవి::

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా..ఓ

చరణం::1

తండ్రిమాట..మీరకే
అయొధ్యను..వదిలేశావు 
అడుగడుగున..ఎన్నెన్నోకష్టాలు భరించావు
తండ్రికి అన్నం బెట్టని..తనయులున్నరు  
చూడు లోకం తీరూ..రామా        

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

చరణం::2

ఆనాడు..ప్రజావాక్య మాలకించి సీతనడవి కంపావు
మచ్చలేని సూర్యవంశ..మర్యాదను నిలిపావు
ఈనాడు..ప్రజలు జుట్టుబట్టీడ్చిన.కదలకున్నారూ
పదవులు వదలకున్నారూ..రామయ్యా           

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

చరణం::3

అన్నమో రామచంద్ర..అనువారే లేరపుడూ
అలో లక్ష్మణా అన్న గోల..వినపడ లే దెప్పుడూ
ధరలు పెరిగి తిన తిండిలేక..చస్తున్నా రిపుడూ
ధరలు పెరిగి తిన తిండిలేక..చస్తున్నా రిపుడూ
యీ వెత తీరే దెపుడు..రామా                 

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

చరణం::4

దుష్టుల శిక్షించే..ఆ దొరవు నీవులే
ధర్మము స్థాపించే..శ్రీహరివి నీవులే
నీ అవతారం రావలసిన..అవసరముందీ
తగిన సమయమే ఇది..రామయ్యా              

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా

ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా 
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా