Monday, September 21, 2009

గీతాంజలి--1989




సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,S.జానకి


ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం
నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో
ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

రేగిన కోరికలతో గాలులు వీచగా
జీవన వేణువులలో మోహన పాడగా
దూరము లేనిదై లోకము తోచగ
కాలము లేనిదై గగనము అందగా
సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా
ముద్దుల సద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఓం

ఒంటరి బాటసారి జంటకు చేరగా
కంటికి పాపవైతే రెప్పగ మారనా
తూరుపు నీవుగా వేకువ నేనుగా
అల్లిక పాటగా పల్లవి ప్రేమగా
ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే
జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహా నయన శృతులకు ఓం నమహా హృదయ లయలకు ఓం
ఓం నమహా అధర జతులకు ఓం నమహా మధుర స్మృతులకు ఓం

No comments: