Wednesday, September 09, 2009

కన్నకొడుకు--1973

సంగీతం::T.చలపతిరావు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు.

పల్లవి::

ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 
ఆ ఇల్లే బంగరు కోవెల..ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల..ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి

చరణం::1

చిన్నబాబుగారున్నారు..వెన్నపూసతో పెరిగారు
చిన్నబాబుగారున్నారు..వెన్నపూసతో పెరిగారు
సరదాబాబుల సహవాసంలో..దారితప్పి పోతున్నారు
చేజారి పోతున్నారు
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 

చరణం::2

పెద్దయ్యగారి పేరుచెప్పితే..పెద్దపులే భయపడుతుంది
ఛెళ్ళున కొరడా ఝళిపిస్తేనే..ఇల్లు దద్దరిల్లి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 
ఆ ఇల్లే బంగరు కోవెల..ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి

చరణం::3

పాపమ్మలాంటి అత్తమ్మగారు..ప్రతి ఇంటిలోన వుంటారు 
ఆయమ్మగారు మహమ్మారి తీరు..ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు..గుటకాయస్వాహా చేస్తారు
ఉన్నది నాకొక ఇల్లు..ఉన్నది నాకొక తల్లి 

చరణం::4

అమ్మ అనే రెండక్షరాలలో..కోటి దేవతల వెలుగుంది
అమృత మనేది వుందంటే..అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మ మనసులోనే వుంది 
ఆ తల్లి చల్లని దీవెన చాలు..ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు

Kanna Koduku--1973
Music::T.Chalapati Rao
Lyrics::D.C.Narayana Reddi
Singer's::Gantasala

:::

unnadi naakoka illu..unnadi naakoka talli 
aa ille bangaru kovela..aa talli challani devataa
unnadi naakoka illu..unnadi naakoka talli
unnadi naakoka illu - unnadi naakoka talli 
aa ille bangaru kovela..aa talle challani devataa
unnadi naakoka illu- unnadi naakoka thalli

:::1

chinnabaabugaarunnaaru..vennapoosato perigaaru
chinnabaabugaarunnaaru..vennapoosato perigaaru 
saradaabaabula sahavaasamlo..daaritappi potunnaaru
cheyjaari pothunnaaru
unnadi naakoka illu..unnadi naakoka talli 

:::2

peddayyagaari perucheppite..peddapule bhayapadutundi
chelluna koradaa jhalipistene..illu daddharilli potundi
maa ollu hunamaipotundi 
unnadi naakoka illu..unnadi naakoka talli 
aa ille bangaru kovela..aa talle challani devataa
unnadi naakoka illu..unnadi naakoka talli

:::3

paapammalanti attammagaaru..prati intilona vuntaaru 
aayammagaaru mahammaari teeru..aayammagaaru mahammaari theeru 
annee swaahaa chestaaru..gutakaayaswaahaa chestaaru  

:::4

amma ane rendakksharaalalo..koti devatala velugundi
amruta manedi vundante - adi amma manasulone vundi
maa amma manasulone vundi 
aa talli challani deevena chaalu
inkenduku veeyi varaalu inkenduku veeyi varaalu

No comments: