Saturday, September 12, 2009

మరపురాని మనిషి--1973






సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి.

పల్లవి::

ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు
మమతలున్నమనసులో..కొలువుంటాడు 
మమతలున్నమనసులో..కొలువుంటాడు
కరుణగల కళ్ళలో..కనుపిస్తాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు

చరణం::1

పుట్టే ప్రతి చిట్టిపాప..పుట్టుకలో
తనకు మనిషిమీద..నమ్మకం చాటుతాడు 
పుట్టే ప్రతి చిట్టిపాప..పుట్టుకలో
తనకు మనిషిమీద..నమ్మకం చాటుతాడు 
ఆ నమ్మికతో బోసినోట..నవ్వుతాడు
ఆ నమ్మికతో బోసినోట..నవ్వుతాడు
నిన్నా నవ్వు పెంచి..పంచమని పంపినాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు

చరణం::2

చదువుతో ఎదగాలి..హృదయము
ఆ హృదయానికి..నేర్పాలి త్యాగము
చదువుతో ఎదగాలి..హృదయము
ఆ హృదయానికి..నేర్పాలి త్యాగము
నువ్వు కోరాలి..పదిమంది సౌఖ్యము
నువ్వు కోరాలి..పదిమంది సౌఖ్యము 
నిన్నె కోవెలగా చేసుకుని..వుంటాడు దైవము 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు

చరణం::3

తనరక్తం పాలుగా..పంచుగోవులో 
గోవులాంటి పేదవాడి..చెమటలో
తనరక్తం పాలుగా..పంచుగోవులో 
గోవులాంటి పేదవాడి..చెమటలో
ఆ చెమట తుడుచు..నెనరైన చేతిలో
ఆ చెమట తుడుచు..నెనరైన చేతిలో 
తానుండి లీలగా..ప్రేమగా లాలిస్తాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే..అక్కడే వున్నాడు
మమతలున్నమనసులో..కొలువుంటాడు 
కరుణగల కళ్ళలో..కనుపిస్తాడు 
ఎక్కడో లేడులే..దేవుడు 
నువ్వెక్కడుంటే అక్కడే..వున్నాడు 
ఆహా ఆ ఆ ఆ ఆ 

No comments: