సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,కోరస్
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే...రంపంపం..
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటే సయ్యాటలో..హే..హే..
మా వెనకే వుంది ఈ తరం
మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢియ్యాటలో
నేడేరా నీకు నేస్తము రేపే లేదు
నిన్నంటే నిండు సున్న రా రానే రాదు
ఏడేడు లోకాల తోన బంతాట లాడాలి ఈ నాడె
తక తకదిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
పడనీరా విరిగి ఆకశం విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేను లే..ఓ..హో..
నడిరేయే సూర్య దర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే
ఓ మాట ఒక్క బాణము మా సిధ్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చేయాలి లోకం..మా జోరు చూసాక..ఈ నాడె
తక తకదిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
మరల మరల జననం రానీరా
మరల మరల మరణం మింగేస్తాం
భువన భగన గరళం మా పిలుపే ఢమరుఖం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన
మా ఊహలు కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రిక్కటిల్లిపోయే...రంపంపం..
జగడ జగడ జగడం చేసేస్తాం
రగడ రగడ రగడం దున్నేస్తాం
ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
చం..చం..చం..
తకిట..తకిట..తకధిమి
తకిట..తకిట..తకధిమి
తకిట..తకిట..తకధిమి
No comments:
Post a Comment