సంగీతం::S. P. కోదండపాణి
రచన::కొసరాజు
గానం::ఘంటసాల
తారాగణం::కృష్ణంరాజు, జమున,సత్యనారాయణ, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య
పల్లవి::
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా..ఓ
చరణం::1
తండ్రిమాట..మీరకే
అయొధ్యను..వదిలేశావు
అడుగడుగున..ఎన్నెన్నోకష్టాలు భరించావు
తండ్రికి అన్నం బెట్టని..తనయులున్నరు
చూడు లోకం తీరూ..రామా
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా
చరణం::2
ఆనాడు..ప్రజావాక్య మాలకించి సీతనడవి కంపావు
మచ్చలేని సూర్యవంశ..మర్యాదను నిలిపావు
ఈనాడు..ప్రజలు జుట్టుబట్టీడ్చిన.కదలకున్నారూ
పదవులు వదలకున్నారూ..రామయ్యా
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా
చరణం::3
అన్నమో రామచంద్ర..అనువారే లేరపుడూ
అలో లక్ష్మణా అన్న గోల..వినపడ లే దెప్పుడూ
ధరలు పెరిగి తిన తిండిలేక..చస్తున్నా రిపుడూ
ధరలు పెరిగి తిన తిండిలేక..చస్తున్నా రిపుడూ
యీ వెత తీరే దెపుడు..రామా
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా
చరణం::4
దుష్టుల శిక్షించే..ఆ దొరవు నీవులే
ధర్మము స్థాపించే..శ్రీహరివి నీవులే
నీ అవతారం రావలసిన..అవసరముందీ
తగిన సమయమే ఇది..రామయ్యా
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా
ఓ రామచంద్రా..శ్రీరామచంద్రా
ఒకసారి భువిలోకి..రావాలయ్యా
పేరెత్తి నిను మేము..పిలిచేమయ్యా
No comments:
Post a Comment