సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి
పల్లవి::
ఓ రామయా శ్రీరామయా..ఓ రామయా శ్రీరామయా
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఓ రామయ్యా శ్రీరామయ్యా
ఆడదాన్ని పుట్టించి..వదిలావయా
దాన్నందుకునేదాక..మాకు రందేనయా
దాన్నందుకునేదాక..మాకు రందేనయ్యా
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఓ రామయ్యా శ్రీరామయ్యా
ఆడదాన్ని పుట్టించి..వదిలావయ్యా
దాన్నందుకున్న మగవాడే..మొనగాడయ్యా
దాన్నందుకున్న మగవాడే..మొనగాడయ్యా
చరణం::1
చురకత్తి మీసాల సోగ్గాడా..నీసురుకైనా సూపులు నాకాడా
చురకత్తి మీసాల సోగ్గాడా..నీసురుకైనా సూపులు నాకాడా
నీలాల కన్నుల సినదాన..నీ నిక్కెంత సేపో నేనెరుగనా
నీలాల కన్నుల సినదాన..నీ నిక్కెంత సేపో నేనెరుగనా
ఈపాటి సూపులకే పడిపోను..యీ మాపంతా ఆడినా అలసిపోను
వయసేమో వానకాలం మనదంటిదీ..ఆహా..
నువ్వొద్దన్నా అది నిన్ను..ముంచేస్తది
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఆడదాన్ని పుట్టించి వదిలావయ్యా
దాన్నందుకున్న మగవాడే..మొనగాడయ్యా
చరణం::2
కళ్ళకు కాటుక గిరిగీస్తే..అవి కట్టుబడి వుంటాయీ జత వస్తే
కళ్ళకు కాటుక గిరిగీస్తే..అవి కట్టుబడి వుంటాయీ జత వస్తే
కళ్ళల్లో ఆశేమో కాగుతుంటది..కాటుకేమొ ఆ సెగకు కరిగిపోతది
కళ్ళల్లో ఆశేమో కాగుతుంటది..కాటుకేమొ ఆ సెగకు కరిగిపోతది
కొంగుతోటి బిర్రుగా బిగకడితే..గుండె కొట్టుకోక వుంటదా కోరికైతే
మనసుకూ కాళ్ళకూ జగడమౌతదీ..మనసుకూ కాళ్ళకూ జగడమౌతదీ
ఎటుబోను తోచక..ఏడుపొస్తది
ఓ రామయ్యా..శ్రీరామయ్యా
ఆడదాన్ని పుట్టించి..వదిలావయా
దాన్నందుకునేదాక..మాకు రందేనయా
ఓ రామయ్యా శ్రీరామయ్యా..ఓ రామయ్యా
శ్రీరామయ్యా ఓ రామయ్యా..శ్రీరామయ్యా
No comments:
Post a Comment