Wednesday, September 09, 2009

జీవన తరంగాలు--1973




సంగీతం::J.V.రాఘవులు
రచన::ఆత్రేయ
గానం::P.సుశీల,L.R.ఈశ్వరి
తారాగణం::శోభన్‌బాబు, వాణిశ్రీ, గుమ్మడి, కృష్ణంరాజు, లక్ష్మి, చంద్రమోహన్ 

పల్లవి::

అది పవిత్రమైన మంగళ సూత్రం
కాదు..కాదు..కాదు
అది బలవంతాన వేసిన వురితాడు

తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?
తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?
ఇది పవిత్రమైన మంగళ సూత్రం..మంగళ సూత్రం
అది బలవంతాన వేసిన వురితాడు..వురితాడు వురితాడు
హాహాహా..ఎవరు వేశారు?
ఏనాడో విధి నీ నొసటను రాశాడు
అది అతడు చేశాడు..నీ భర్తైనాడు

చరణం::1

హా హా హా..భర్త..? 
ఎవరు భర్త..? 
ఆ మనసులేని పశువా?
పశువు కట్టినదా మాంగల్యం? 
కసాయితోనా దాంపత్యం..?
మనసు చచ్చీ బ్రతికితే నువు మనిషివి కావు
ఉరితాటి కింత పసుపు రాస్తే తాళి కాదు 

తెంచెయ్..
తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?
తెంచుకుంటావా? 
ఉంచుకుంటావా ?

చరణం::2

భగవాన్..నాకెందుకీ శిక్ష..ఏమిటీ పరీక్ష..?
నేను కోరుకోలేదు ? నాకు తెలిసి జరగలేదు?

హా హా..పిచ్చిదానా ఎలా జరిగినా పెళ్ళి పెళ్ళే
నువ్వేనాటికైనా..అతని సతివే
ఒక్కసారే ఆడదానికి..పెళ్ళి జరిగేది
తెంచుకున్నా తీరిపోని..బంధమే యిది
తాళి తెంచే దెవరికమ్మా..ఆపై..ఆ
ఆడబ్రతుకు దేనికమ్మా..ఆ
ఆడబ్రతుకు దేనికమ్మా..ఆ 

No comments: