Friday, September 11, 2009

మైనరు బాబు--1973
























సంగీతం::T.చలపతిరావు 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

పల్లవి::

రమ్మంటే గమ్మునుంటాడందగాడూ బలే అందగాడూ..హత్తెరి
రమ్మంటే గమ్మునుంటాడందగాడూ..బలే అందగాడూ 
వెళ్ళిపోతుంటే నా వెంటేపడతనంటడు..బలే గడుసు గుంటడు
వెళ్ళిపోతుంటే నా వెంటేపడతనంటడు..బలే గడుసు గుంటడు

ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్లా..బలే కొంటె పిల్లా..హత్తెరి
ఊరుకుంటే గీరుతుంటది కోతి పిల్లా..బలే కొంటె పిల్లా  
చేరబొతేనే ఓరబ్బో జారుకుంటదీ..అయ్యో జడుసుకుంటది 
చేరబొతేనే ఓరబ్బో జారుకుంటదీ..అయ్యో జడుసుకుంటది 

చరణం::1

కురిసే మబ్బులాగ వురుము తున్నడూ
కొంగుగాలి విసురుకే వురుకుతున్నడూ
కురిసే మబ్బులాగ వురుము తున్నడూ
కొంగుగాలి విసురుకే వురుకుతున్నడూ 
మాటలతోనే కోటలు కడతడూ
చూపులతోనే చురకలు పెడతడూ
మాటలతోనే కోటలు కడతడూ
చూపులతోనే చురకలు పెడతడూ
తీరా నే ఢీ కొంటే సామిరంగా..బోర్ల పడతడు..హత్తెరి
రమ్మంటే గమ్మునుంటాడందగాడు..బలే అందగాడు 
వెళ్ళిపోతుంటే నా వెంటేపడతనంటడు
బలే గడుసు గుంటడు..హత్తెరి
రమ్మంటే గమ్మునుంటాడందగాడు..బలే అందగాడు 

వసబోసిన పిట్టలాగ వాగుతుంటదీ..కసిగా చూస్తేనే కంది పోతదీ
వసబోసిన పిట్టలాగ వాగుతుంటదీ..కసిగా చూస్తేనే కంది పోతదీ
నడకల తోనే నన్నుడికిస్తదీ..నవ్వులతోనే నను కవ్విస్తదీ
నడకల తోనే నన్నుడికిస్తదీ..నవ్వులతోనే నను కవ్విస్తదీ
తీరా పైపైకెళితే సామిరంగా..బ్యారుమంటదీ..హత్తెరి
ఊరుకుంటే గీరుతుంటదీ కోతి పిల్ల..బలే కొంటె పిల్ల 

చరణం::2

ఎచ్చులకోరు పిచ్చయ్యల్లే ఎగురుతుంటడూ
మచ్చిక చేస్తుంటే రెచ్చిపోతడూ
ఎచ్చులకోరు పిచ్చయ్యల్లే ఎగురుతుంటడూ
మచ్చిక చేస్తుంటే రెచ్చిపోతడూ

పూసల పిల్ల బాసలు చేస్తదీ
ఆశకు పోతే అల్లరి పెడతదీ
పూసల పిల్ల బాసలు చేస్తదీ
ఆశకు పోతే అల్లరి పెడతదీ

ఇద్దరమూ ఏకమైతే సామిరంగా
చల్ మోహనరంగా
హత్తెరి..ఊరుకుంటే గీరుతుంటది
కోతి పిల్లా..బలే కొంటె పిల్లా  
హత్తెరి..రమ్మంటే గమ్మునుంటాడందగాడూ..బలే అందగాడూ

No comments: