సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,P సుశీల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి
పల్లవి::
ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు
పెద్ద మొనగాడల్లే..వచ్చాడు
మన మధ్యన పడితే..ఏమవుతాడు
ఏమవుతాడు..ఏమవుతాడు
ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు
పెద్ద మొనగాడల్లే..వచ్చాడు
మన మధ్యన పడితే..ఏమవుతాడు
ఏమవుతాడు..హ్“..ఏమవుతాడు
ఆటు పోటుకు ఆగుతాడు..రాటు తేలి
తేలుతాడు అంతకన్నా..ఏమవుతాడు
ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు
చరణం::1
పగ్గం తెంచి పడుచుదనం..పైపై కొస్తే
ఏంజేస్తాడు..పైపై కొస్తే ఏంజేస్తాడు
పగ్గం తెంచి పడుచుదనం..పైపై కొస్తే ఏంజేస్తాడు
బుగ్గమీద ఒక కాటేస్తాడు..ఆ..ఆ..ఆ
సిగ్గులు నిలువున..దోచేస్తాడు
ఓయ్ యహయహు ఓయ్ యహయహు
బుగ్గమీద ఒక కాటేస్తాడు..ఆ ఆ..ఆ
సిగ్గులు నిలువున.. దోచేస్తాడు
దోచేలోగా దొంగను బట్టి..అల్లరిచేస్తే ఏం చేస్తాడు
అల్లరైనది ఇక అడ్డేముందని..ఆలూమగలం
మేమంటాడు మేమంటాడు..ఇంకేమంటాడు
ఎవడే ఈ పిలగాడు..ఇక్కడొఛ్ఛి తగిలాడు
పెద్ద మొనగాడల్లే..వచ్చాడు
మన మధ్యన పడితే..ఏమవుతాడు
ఏమవుతాడు..ఏమవుతాడు
చరణం::2
జలకాలాడే జవ్వనులు..తళతళలాడుట చూశాడు
తళతళలాడుట..చూశాడు
జలకాలాడే జవ్వనులు..తళతళలాడుట చూశాడు
గోపికలేమో..అనుకున్నాడు
పాపం..గోపాలుడల్లే..వచ్చాడు
ఓయ్ యహయహు..గోపికలేమో అనుకున్నాడు
గోపాలుడల్లే..వచ్చాడు
ఎత్తుకుపోను..కోకలు లేవు
ఎక్కేటందుకు..కొమ్మలులేవు
కోకకు బదులు కోర్కెవుంది..కొమ్మకు బదులీ బొమ్మ వుంది
ఎత్తుకుపోతాడు..ఇలా ఎత్తుకుపోతాడు
No comments:
Post a Comment