Wednesday, September 09, 2009

కన్నకొడుకు--1973



























సంగీతం::T.చలపతిరావు
రచన:కొసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల,శరావతి
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.

పల్లవి::

అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ మ్మ్ హూ.. 
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక..నిలిచిందే చూడడూ
అయ్యో రామా..పిలిచిందే చూడడూ
అయ్యో రామా..పిలిచిందే చూడడూ         
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ 

చరణం:1

బూరెల బుగ్గల బుడగడే..ఏమన్నా యిటు తిరగడే
బూరెల బుగ్గల బుడగడే..ఏమన్నా యిటు తిరగడే
బెల్లం కొట్టిన రాయిలాగా..బెల్లం కొట్టిన రాయిలాగా
బిర్రబిగుసుకొని వున్నాడే
అయ్యో రామా..బుర్ర గోక్కుంటున్నాడే   
అయ్యో రామా..బుర్ర గోక్కుంటున్నాడే
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ 

చరణం::2

ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా..బిత్తర చూపులు చూస్తాడమ్మా
ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా..బిత్తర చూపులు చూస్తాడమ్మా
ఏ యమ్మగన్న పిల్లోడోగాని..ఏ యమ్మగన్న పిల్లోడోగాని
ఎంత జెప్పినా..వినడమ్మా
అయ్యో రామా..ఏమైపోతాడోయమ్మా       
అయ్యో రామా..ఏమైపోతాడోయమ్మా 
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ 

చరణం::3

కలిగిన పిల్లను కాదంటాడే..పేదపిల్లపై మోజంటాడే 
కలిగిన పిల్లను కాదంటాడే..పేదపిల్లపై మోజంటాడే
డబ్బున్నవాళ్ళకు..ప్రేమ వుండదా
డబ్బున్నవాళ్ళకు ప్రేమ వుండదా..లేనివాళ్ళకే వుంటుందా   
అయ్యో రామా పిచ్చి..యింతగా ముదిరిందా 
అయ్యో రామా పిచ్చి..యింతగా ముదిరిందా    
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
అందమైన పిల్లగాడూ..అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక..నిలిచిందే చూడడూ
అయ్యో రామా..పిలిచిందే చూడడూ 
అయ్యో రామా..పిలిచిందే చూడడూ

No comments: