సంగీతం::MS.విశ్వనాథన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,S.జానకి
అమ్మీ ఓ లమ్మీ గుమ్మైన అప్పలమ్మీ
నా చింతమాను సిగురా నా గున్నమావిడి గుబురా
నా ఏడిబులమ షారా నా ఇప్పపూలసారా..
అరిసెలపాకంకన్నా అందమైన జాణా..ఆ..ఆ..ఆ..
అరిసెలపాకం కన్నా అందమైనదానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..అహ..అహ..అహా..
అబ్బీ ఓ రబ్బీ చురుకైన సోకులబ్బీ
నా సింగరాయకొండ..నా సికాకోలుదండ
నా చంద్రహారం గొలుసా..నా గుమ్మిడాల పులుసా..
గుడమేటి వరదకన్నా సురుకైన వాడా..ఆ..ఆ..ఆ..
హేయ్..గుడమేటి వరదకన్నా సురుకైన వాడా
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..హ్హు..
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..ఆ..హేయ్..
తాళ్ళపాకలో నిన్ను కలిసినప్పుడు
రంగు గళ్ళకోకలో నువ్వు మెరిసినప్పుడు
నిన్ను చూసానో లేదో..చెయ్యివేసానో..లేదో
నిన్ను చూసానో లేదో..చెయ్యివేసానో..లేదో
నివు నిప్పుదగ్గరి నక్కలాగ కరగలేదా
కరిగి కరిగి ఒక్కమాటు వొరగలేదా..
ఎల్లమ్మ జాతరకు ఎల్లినప్పుడు
ఎంట..ఎంటబడి నా చేయ్యి గిల్లినప్పుడు..అహా..
కాస్త..కసిరానూ..లేదో..కొంగు ఇసిరానో..లేదో..
కాస్త..కసిరానూ..లేదో..కొంగు ఇసిరానో..లేదో..
నువ్వు కాలుకాలిన పిల్లిలాగ..తిరగలేదా..
తిరిగి..తిరిగి..అరుగుమీద ఒరగలేదా..
అమ్మీ ఓ లమ్మీ గుమ్మైన అప్పలమ్మీ
నా చింతమాను సిగురా నా గున్నమావిడి గుబురా
నా ఏడిబులమ షారా నా ఇప్పపూలసారా..
హేయ్..గుడమేటి వరదకన్నా సురుకైన వాడా
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..హ్హా..
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..ఆ..హేయ్..
సందెకాడ నేను తానమాడినప్పుడు..
తడికసాటునుంచి నువ్వు తొంగి చూసినప్పుడు
అయ్య..లేసాడో..లేదో..కర్ర తీసాడో..లేదో..
అయ్య..లేసాడో..లేదో..కర్ర తీసాడో..లేదో..
నా కాళ్ళమీదబడి మొక్కలేదా..
కట్టుకొంటానని ఒట్టుపెట్టలేదా..
నీ సికిలి సూపు నాపైన యిసిరినప్పుడు..
నీ మొకమంతా సిరినవ్వే విరిసి నప్పుడు..
ఏమైదో..ఏమో..ఏమవుతుందో..ఏమో..
ఆనాటినుంచి నా మనసే నిలవకున్నదే..
నాటుమందేసిన నీ ఊసే..వదలకున్నదే..
గుడమేటి వరదకన్నా సురుకైన వాడా
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..హ్హా..
నీ బడాచోరుమాటలకు..బదులు చెప్పలే..నా..ఆ..హేయ్..
అరిసెలపాకం కన్నా అందమైనదానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..
నువ్వు అలగేసి పోతుంటే..నే నాగుతానా..అహ..అహ..అహా..
No comments:
Post a Comment