సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి
పల్లవి::
హేయ్..య్యా..
వచ్చింది వచ్చింది..లచ్చిమి
వచ్చింది వచ్చింది..లచ్చిమి
వనలచ్చిమి మాహలచ్చిమి ధనలక్ష్మి మాలచ్చిమి
వచ్చింది వచ్చింది..లచ్చిమి మాలచ్చిమి
పచ్చాని చిలకల్లే..పసి నిమ్మపండల్లే
పచ్చాని చిలకల్లే..పసి నిమ్మపండల్లే
ముచ్చటైన వయ్యారం..మూటగట్టి తెచ్చింది
వచ్చింది..హేయ్..వచ్చింది లచ్చిమి మా లచ్చిమి
చరణం::1
మెత్తగా ఓరచూపు..నాటుకుంది
మెత్తగా ఓరచూపు..నాటుకుంది
సుర కత్తిలా గుండెల్లో..దిగుతుంది
తీయగా ఒక నవ్వు..చిలుకుతుంది
గుండెగాయాన్ని..మరీ మరీ కెలుకుతుంది
హేయ్..తీయగా ఒక నవ్వు చిలుకుతుంది
గుండెగాయాన్ని మరీ మరీ..కెలుకుతుంది హాయ్ అల్లా
అరె అందమంటే దానిదే..బతుకెందుకురా అది లేనిదే
హాయ్ హాయ్..వచ్చింది వచ్చింది లచ్చిమి మా లచ్చిమి
చరణం::2
లేని నడుము ఓయమ్మో..కదులుతుంది
అది ఉన్నమనసునే..కాస్తాకాజేస్తుంది
ఘల్లూ ఘల్లూన అది..నడుస్తుంది దాని
కాళ్ళకింద పడుచుదనం..పడిచస్తుంది
ఘల్లూ ఘల్లూన..అది నడుస్తుంది దాని
కాళ్ళకింద పడుచుదనం..పడిచస్తుంది
అయ్ బాబోయ్..నా ప్రక్కనే వుంటే
ఆ చెలి ఇంకెక్కడిదిరా..ఆకలి
వచ్చింది..హేయ్..వచ్చింది..లచ్చిమి మా లచ్చిమి
చరణం::3
ఖాదర్ బాయికి..కోడిపలావు తెచ్చింది
సింహాద్రికి చేపల..పులుసు తెచ్చింది
ఖాదర్ బాయికి..కోడిపలావు తెచ్చింది
సింహాద్రికి చేపల..పులుసు తెచ్చింది
యాదగిరికి దూదుమలాయి..తెచ్చింది
యాదగిరికి..దూదుమలాయి తెచ్చింది
మరి నీకూ..
అన్ని రుచులూ కలిగివున్న కన్నెవయసే తెచ్చింది
ముద్దుల కానుకగా ఇంచ్చింది..హాయ్ హాయ్ హాయ్
వచ్చింది వచ్చింది లచ్చిమి
మనలచ్చిమి మహలచ్చిమి ధనలక్ష్మి మా లచ్చిమి
వచ్చింది వచ్చింది లచ్చిమి మాలచ్చిమి
No comments:
Post a Comment