సంగీతం::T.చలపతిరావు
రచన:ఆరుద్ర
గానం::P.సుశీల,ఘంటసాల,జయదేవ్,రంది రమేష్
తారాగణం::అక్కినేని, లక్ష్మి, గుమ్మడి, అంజలీదేవి, కృష్ణంరాజు,సూర్యకాంతం,రమాప్రభ,రాజబాబు,ధూళిపాళ,సాక్షి రంగారావు.
పల్లవి::
లోకం..మ్మ్ మ్మ్ మ్మ్..శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లోకం..మ్మ్ మ్మ్ మ్మ్..శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లలలాలా..ఆఆఆ
మైకం..మ్మ్ మ్మ్ మ్మ్..తదేకం..మ్మ్ మ్మ్ మ్మ్..
మైకం తదేకం..వదలొద్దు..లాలాలాలాలలా
అను అను అను..హరేరాం..అను
అను అను అను..హరేకృష్ణ అను
హరేరాం..లాలాలాలా..హరేరాం..లాలాలాలాలా
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం
చరణం::1
నీతి నియమం బూడిద..ఏహే
పాత సమాజం వీడర..ఏహే
నీతి నీయమం బూడిద..ఏహే
పాత సమాజం వీడర..అహో
ఇల్లూ వాకిలీ..తల్లీ తండ్రీ..ఎవరూ లేరు
ఏవరూ రారు..నీతో..నేవే
నీలో నీవే..బతకాలి బతకాలి బతకాలి
హరేరాం..లాలాలాలా..హరేరాం..లాలాలాలాలా
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం
రాం రాం హరేరాం..కృష్ణ కృష్ణ ఘనశ్యాం
చరణం::2
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో
ఆడాళ్ళకు మగవాళ్ళకు..తేడా తెలియదు
అయ్య పంపే డబ్బులకే..అర్దం తెలియదు
కలసి మెలసి విందు..అహా..కైపులోన్ చిందు
కలసి మెలసి విందు..అహా..కైపులోన చిందు
ఈ పోకడ దగా దగా..బతుకంతా వృధా వృధా
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో
చరణం::3
సౌఖ్యాలకు దొడ్డిదారి..వెతికేవాళ్ళు
బ్లాకుల్లోన లక్షలెన్నో..నూకేవాళ్ళు
పాటు పడనివాళ్ళు..సాపాటు రాయుళ్ళు
ఏ పాటు పడనివాళ్ళు..సాపాటు రాయుళ్ళు
అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో
చరణం::4
కష్టాల్లో పేదాళ్ళకు..మీరు అవసరం
కలవాళ్ళ దోపిడీకి..మీరు ఆయుధం
ఆపదలో ముడుపు..ఆపైన పరగడుపు
ఆపదలో ముడుపు..ఆపైన పరగడుపు
అనాదిగా ఇదే ఇదే..రివాజుగ సాగాలా ?
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో
No comments:
Post a Comment