Saturday, September 12, 2009

మరపురాని మనిషి--1973























సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,జయంతి,మంజుల,జగ్గయ్య,లత,చంద్రమోహన్,రోజారమణి,బేబీ శ్రీదేవి

పల్లవి::

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును
నా కళ్ళకే వెలుగైన..నువ్వు చాలును 
నీ నవ్వు..చాలును

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును

చరణం::1

చెప్పలేని వెన్నెన్నో..లోన దాగివున్నవి 
వుండి వుండి నిన్నే కాదని..వుబికి వురుకుతున్నవి 
చెప్పలేని వెన్నెన్నో..లోన దాగివున్నవి 
వుండి వుండి నిన్నే కాదని..వుబికి వురుకుతున్నవి 
ఒప్పుకోక వోపలేక మనసు..వూగుతున్నది 
తప్పుకాదు తప్పదు అని..వయసు లాగుతున్నది 
ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును

చరణం::2

వలపు చదువుకు ఓనమాలు..నువ్వు నేర్పావు 
ఆ..ఓ..కు వున్న వొంపులన్నీ..నువ్వు చూపావు
వలపు చదువుకు ఓనమాలు..నువ్వు నేర్పావు 
ఆ..ఓ..కు వున్న వొంపులన్నీ..నువ్వు చూపావు
ప్రేమ నీకు ధారబోసి..పేదనైనాను 
పేదవాడిదే రాజ్యమని..నన్నేలుతున్నావు

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును

చరణం::3

తీయనైన కోర్కెలేవో..రేయి రేగుతున్నవి 
తెల్లవారి పక్కనజేరి..నన్ను లేపుతున్నవి
తీయనైన కోర్కెలేవో..రేయి రేగుతున్నవి 
తెల్లవారి పక్కనజేరి..నన్ను లేపుతున్నవి
లేచి చూచి వేచి వేచి..లేత ముదురైపోతుంది 
మొగ్గ ముదిరి సిగ్గువిడిచి..పూవు తానై పూస్తుంది

ఏం చెప్పను..ఎలా చెప్పను 
చెప్పకే చెపుతున్న..కళ్ళు చాలును 
నీ కళ్ళు..చాలును
నా కళ్ళకే వెలుగైన..నువ్వు చాలును 
నీ నవ్వు చాలును..మ్మ్ హూహుహూ

No comments: