సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P. సుశీల
ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ
కలవరింతల ఆకలీ..కలువ కన్నుల కౌగిలీ
ఎదలపొదల్లో..వలపులయల్లో మోగే సన్నాయీ
ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ
పున్నమొచ్చెను నాగులబుసతో..పూవులుపూచెను గాలుల ఖసితో
వేసుకో..పెనవేసుకో..ముద్దుగా..ముడివేసుకో..
చెరకు చేనుల ఇడుపు నీడల..చెరిసగమౌదమొ..
మరచిపోయిన మనసులోతుల..ఒకటైపోదామే..
తీపిగా తాపమారగా..తీరగా చపలతీరగా..
ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ
నాకు నచ్చిన సొగసులరుచితో..ఈడువచ్చిన ఇద్దరి జతలో
జంటనే..జడలల్లుకో..వంటితో..వలవేసుకో..
తనివితీరగా..తనువు అంచులు చెరిపేసేద్దామూ..
వలపుతీరక వలపు మంచులు దులుపేసేద్దామో..
పూవులో తుమ్మెదలాడగా..తేనేలో తానమాడగా
ఎదురు చూసిన జాబిలీ..నిదురలేచిన రాతిరీ
కలవరింతల ఆకలీ..కలువ కన్నుల కౌగిలీ
ఎదలపొదల్లో..వలపులయల్లో మోగే సన్నాయీ
No comments:
Post a Comment