Tuesday, January 18, 2011

ప్రమీలార్జునీయము--1965




సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::ఘంటసాల
నటీ నటులు::N.T.R, B.సరోజ, కాంతారావు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ కీ.శే.ఎన్.టి.రామారావు గారి 15వ వర్థంతిని (జనవరి 18, 2011)

పల్లవి::

అతి ధీరవే గాని, మాట మాట
అతి ధీరవే గాని, అపురూప రమణివే
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

చరణం::1

నీ సుకుమార ఠీవికి మురిసి ఓ...
నీ సుకుమార ఠీవికి మురిసి
నీ అసమాన ధాటికి దడిసి
ఎవని కనులు చెదరునో,
నీకు దిష్టి తగులునొ తరుణీ
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

చరణం::2

నీ నయగారమే సెలయేరుగా,
నీ అనురాగమే సుడిగాలిగా ఆ..ఆ..
నీ నయగారమే సెలయేరుగా,
నీ అనురాగమే సుడిగాలిగా
ఎవడు మూర్ఛ మునుగునో,
నీ మనసు కరుగునొ జవ్వనీ
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

చరణం::3

నీ క్రీగంట విరిసిన చూపులు ఓ..ఓ..
నీ క్రీగంట విరిసిన చూపులు
అహ ప్రాణాల నొరిసే చూపులే
ఎవని గుండెలదరునో
నీకు జాలి కలుగునొ రమణీ
అతి ధీరవే గాని, అపురూప రమణివే
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త

No comments: