Showing posts with label సంసారం సాగరం--1974. Show all posts
Showing posts with label సంసారం సాగరం--1974. Show all posts

Sunday, January 09, 2011

సంసారం సాగరం--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::P.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ. 

పల్లవి::

దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::1

చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
చేతులు కాల్చుకునే..సిసింద్రీలకన్నా
కళ్ళు జిగేలనే..మతాబాలకన్నా
నలుగురూ కిలకిల..నవ్వినపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు 

చరణం::2

తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
తారాజువ్వల్లా ఎగిరి ఎగిరి పడక
చిమ్మిన రవ్వల్లా చెల్లాచెదురుకాక
ఒకటిగా కలిసి మెలిసి ఉన్నపుడే పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్ 
ఉన్నంతలో కడుపునిండ..తిన్నపుడే పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ

చరణం::3

అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
అమావాశ్య చీకటిలో ప్రమిదలే వెలుగులు
అమ్మకు నాన్నకూ పిల్లలే దివ్వెలు
పరువుగా ఆ పిల్లలు బ్రతికినపుడె పండగ
ఆ ఆ ఆ..ఓహో..మ్మ్ మ్మ్ మ్మ్  
ఉన్నంతలో కడుపునిండ తిన్నపుడె పండగ
దివ్వీదివ్వీ దివ్విట్లు దీపావళి దివ్విట్లు
ఇంటింటా ఈపూట..ఇంటింటా ఈపూట 
ఎన్నో ఎన్నో ఎన్నో..ముచ్చట్లూ ముచ్చట్లూ
దివ్వీదివ్వీ దివ్విట్లు..దీపావళి దివ్విట్లు

Wednesday, January 05, 2011

సంసారం సాగరం--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె 
గానం::S.P.బాలు
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ,రోజారమణి,చంద్రమోహన్పల్లవి::

సంసారం సాగరం..సంసారం సాగరం 
బ్రతుకే ఒక నావగా..ఆశే చుక్కానిగా
పయనించే...ఓ నావికా..ఆఆఆ  
ఎక్కడుంది..ఎక్కడుంది..ఎక్కడుంది నీ తీరం
సంసారం...సాగరం

చరణం::1

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
నడిపే ఒడుపుంటేనే..నావసాగిపోతుంది..మ్మ్ హూ మ్మ్ 
ముందుచూపు వుంటేనే..బ్రతుకే బాగుపడుతుంది..ఆఆఆఆ  
బరువు మించిపోయిందా..నావకే ముప్పు
తెలిసి గోతిలో దిగితే..ఎవరిది తప్పు ఎవరిదీ..ఈ..తప్పు   
సంసారం సాగరం..సంసారం సాగరం 

చరణం::2

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ..మ్మ్ మ్మ్ మ్మ్ 
నడిసంద్రం సుడిగుండం..నావను ముంచేసింది..ఆఆఆ 
కుమిలే నీ గుండెల్లో..కోతకోసిపోయింది..ఆఆఆ 
సడలిన నీ చేతులతో..కడలి నీదలేవు..ఆఆఆ 
గట్టు చేరుకోలేవు గట్టు చేరుకోలేవు..మరి ఊరుకోలేవు  
సంసారం సాగరం..బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా
పయనించే...ఓ నావికా 
ఎక్కడుంది..ఎక్కడుంది..ఎక్కడుంది నీ తీరం
సంసారం సాగరం..సంసారం సాగరం 

చరణం::3

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఎగిరేపక్షికి గమ్యం..ఎక్కడుందొ తెలియదు..ఆఆఅ
తెగిన గాలిపట మెక్కడ..దిగుతుందో తెలియదు..ఆఆఆ
దిక్కులేని మనిషీ..ఈ..దిక్కులేని మనిషీ..ఏ దిక్కునపడి పోయేవు 
నీ శవాన్ని నువ్వే మోసుకుపోతున్నావు..మోసుకుపోతున్నావు     
సంసారం సాగరం..బ్రతుకే ఒక నావగా ఆశే చుక్కానిగా
పయనించే...ఓ..నావికా
ఎక్కడుంది..ఎక్కడుంది..ఎక్కడుంది నీ తీరం
సంసారం సాగరం  

చరణం::4

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
చచ్చేట్టుగ పెనుగులాడి..సాధించిందేమిటీ..ఆఆఆ
ఒక బిచ్చగాడ్ని కన్న..కీర్తిదక్కింది నేటికీ..ఆఆఅ 
నువ్వు నాటిన ఆ మొక్కకు..ఎవరు చీడపురుగు..ఆఆఅ   
ఎవరో..ఎవరో..ఎవరో..అది నీ అంతరాత్మనడుగు
అంతరాత్మనడుగు..ఊ..నీ అంతరాత్మనడుగు..ఊ 

Sunday, January 02, 2011

సంసారం సాగరం--1974



సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సుంకర సత్యనారాయణ 
గానం::S.P.బాలుP.సుశీల
తారాగణం::S.V.రంగారావు,సత్యనారాయణ,గుమ్మడి,రాజబాబు,జయంతి,శుభ,రమాప్రభ,రోజారమణి,చంద్రమోహన్. 

పల్లవి::

యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు     

చరణం::1

ఒకటి ఒకటి రెండూ..నింగి నేల రెండూ 
పగలూ రేయీ రెండూ..కంటికి రెప్పలు రెండూ
యింటికి యిద్దరు...నిండూ 
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

చరణం::2

ఎదిగే పిల్లల కదిలే పెదవులు..ఎదలో ఆశలు చిలకాలి 
ఎదిగే పిల్లల కదిలే పెదవులు..ఎదలో ఆశలు చిలకాలి 
ఆశల బడిలో అ ఆ లు నేర్చి..ఆశయాల గుడికట్టాలి
యింటిపేరు...నిలబెట్టాలి         
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ.. పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు

చరణం::3

ఆలుమగల అనురాగం..ఆనందానికి ప్రతిరూపం
ఆనందం నిండిన ఈ బ్రతుకే..కలకాలమిలా నిలవాలి
యిల్లే స్వర్గం...కావాలి       
ఆ యింటికి దీపం ఇల్లాలు..ఆ దీపకాంతుల కిరణాలే 
పిల్లలూ..ఊ..పిల్లలు..ఊ..యింటికి దీపం ఇల్లాలు