రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా !!!
1:గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
తెల్లారి పోయింది పల్లె లేచింది
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది
2:కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా … రావమ్మా… కృష్ణార్పణం ….
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ..
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం
పల్లె తల్లికి వందనం- పసిడి తల్లికి వందనం
భాగ్య రాసులు పంచిపెట్టే పల్లె తల్లికి వందనం
।పల్లె తల్లికి వందనం |
ఏరు తల్లికి వందనం-హోరు తల్లికి వందనం
ఏటిఊటలు పంచిపెట్టే ఏటి తల్లికి వందనం
।పల్లె తల్లికి వందనం |
శాంతి తల్లికి వందనం- కాంతి తల్లికి వందనం
శాంతి కాంతులు పంచిపెట్టే పల్లె తల్లికి వందనం
।పల్లె తల్లికి వందనం |
1 comment:
భలే బాగుందండి.
పైరు పెరిగాక కాడెద్దుల్ని పొలంలోకి తోలారేమిటి? మొదట దున్నడానికి, విత్తనాలు చల్లడానికి కదా ఎద్దులు వెళ్ళాలి.
Post a Comment