సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::చలం,కృష్ణంరాజు,అల్లు రామలింగయ్య,బాలకృష్ణ,విజయనిర్మల,సూర్యకాంతం,నిర్మల
పల్లవి::
మల్లెపువ్వులా తెప్పగట్టీ..ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహన రంగా తెలియరానీ తీరం చూదామా
మల్లెపువ్వులా తెప్పగట్టీ..ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహనాంగీ తెలియరానీ తీరం చూదామా
చరణం::1
పైట చెంగు పందిరి కిందా..బాసలేవో చేసుకుంటూ
ఒకరి కంటి పాపలోనా..ఒకరి నీడ చూసుకుంటూ
పైట చెంగు పందిరి కిందా..బాసలేవో చేసుకుంటూ
ఒకరి కంటి పాపలోనా..ఒకరి నీడ చూసుకుంటూ
గోరువెచ్చని కలలే కందామా..చల్ మోహన రంగా ఊరి ఊసే మరచిపోదామా
మల్లెపువ్వులా తెప్పగట్టీ..ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహన రంగా తెలియరానీ తీరం చూదామా
చరణం::2
మనసే ఒక పానుపు చేసీ..వలపే ఒక తలగడ చేసీ
మనసే ఒక పానుపు చేసీ..వలపే ఒక తలగడ చేసీ
విదిపోని కౌగిలిలో పగలూ...రేయీ ముడివేసీ
కలకాలం కాపురముందామా..చల్ మోహనాంగీ ఇలనే ఒక స్వర్గం చేదామా
మల్లెపువ్వులా తెప్పగట్టీ...ఉల్లి పూల తెరచాపెత్తీ
తెప్పమీద తేలిపోదామా..చల్ మోహనాంగీ
చల్ మోహన రంగా..తెలియరానీ తీరం చూదామా
No comments:
Post a Comment