Friday, January 14, 2011

బంగారు తల్లి--1971

సంగీతం::S.రాజేశ్వరరావు
రచన::కోసరాజురాఘవయ్య 
గానం::P.సుశీల,పిఠపురం,శ్రీహరిరావు
తారాగణం::జగ్గయ్య,జమున,శోభన్‌బాబు,కృష్ణంరాజు,వెన్నిరడై నిర్మల,నాగభూషణం,బేబి శ్రీదేవీ   

పల్లవి::

ఒహోహో..ఒహోహో
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ

చరణం::1

చిచ్చుబుడ్లతో మతాబాలతో..చీకటి చిత్తయి పోయేనురా  
చిచ్చుబుడ్లతో మతాబాలతో..చీకటి చిత్తయి పోయేనురా  
చితికిపోయినా మన బ్రతుకులో..ఆశల వెన్నెల కాసెనురా  
చితికిపోయినా మన బ్రతుకులో..ఆశల వెన్నెల కాసెనురా
ఆశల వెన్నెల..కాసెనురా     
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ

చరణం::2

ఒక్కడు పదిమందిని దోచు తిను 
టక్కు టమారం సాగదురా..ఇక సాగదురా
ప్రజాశక్తి నెదిరించేవాడికి..పలికేదిక్కే ఉండదురా
పలికే దిక్కే..ఉండదురా    
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ

చరణం::3

అన్యాయ కాలమ్ము..మారాలి మారాలి
అక్రమాల ఆటలింక..అందరు అరికట్టాలి
పల్లెటూళ్లు భాగ్యంతో..కలకలలాడాలయ్యా
కలకలలాడాలయ్యా
ఆనందం పొంగి పొరలి..చిందులు వెయాలయ్యా            
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
కోటి దీపములు ధగ ధగ వెలిగే..మన దీపావళి పండగ 
వచ్చిందయ్యా పండగ..ఎంతో కన్నుల పండగ
ఎంతో కన్నుల పండగ..ఎంతో కన్నుల పండగ..ఎంతో కన్నుల 

No comments: