Thursday, January 06, 2011

భక్తతుకారం--1973




సంగీతం::ఆదినారాయణరావ్
రచన::వేటూరి
గానం::ఘంటసాల


ఓ...నరుడా...పామరుడా..చిందులువేయకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా..2
తెలిసీ తెలియని అజ్ఞానముతో..2
ప్రజలను వంచన చేయకురా..2

తనకంతా తెలుసునని తనమాటే వేదమని
తానే ఒక ఘనుడని తలచే నరుడా పామరుడా
తానెవరో తెలుసుకొనీ తన తప్పులు దిద్దుకొని
తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని
విత్తముపై ఆశలు విడిచి చిత్తముతో రంగని కొలిచి
పరమార్థం గ్రహించరా..తత్వం తెలిసి తరించరా

|| చిందులు వేయకురా...||

తిరుచూర్ణం ధరింపగానే ...2
తీర్థాలే తరించగానే..
ఎంతటి వాడైన భక్తుడు కాలేడు కాబోడు
నీ మనసే మందిరమైతే నామాటే సుందరమైతే
తుకారామును బ్రోచినరంగడు నిత్యం నీలో వసించురా

|| చిందులు వేయకురా...||

No comments: