Sunday, January 09, 2011

భక్తతుకారం--1973

























సంగీతం::P.ఆదినారాయణ రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల


పూజకు వేళాయెరా!
రంగా..పూజకు వేళాయెరా..ఆ..ఆ..
పూజకు వేళాయెరా..

ఇన్నినాళ్ళు నే నెటుల వేచితినో..
ఇన్నిరేలు ఎంతెంత వేగితినో..2
పిలుపునువిని విచ్చేసితివని..నా..2
వలపులన్ని నీకొరకే దాచితిని
ఎవరూ..పోందని ఏకాంత సేవలో
ఈ వేళ తనిదీర గా నిన్నేఅలరించు

||పూజకు వేళాయెరా..ఆ..ఆ..ఆ
పూజకు వేళాయెరా..||

ఈ నీలి నీలి ముంగురులు ఇంద్రనీలాల మంజరులు
ఈ వికసిత సిత నయనాలు శతదళకోమల కమలాలు
అరుణారుణమీ అధరమూ...తరుణ మందార పల్లవము
ఆఆఆఆఆఆఆఆ....ఆఆఆఅ
ఎదలో పొంగిన ఈ రమణీయ పయొధరాలు..ఊ..ఊ..
ఫాలకడలిలో ఉదయించు సుధాకలశాలు..ఆఆఆఅ..
ఎంతసుందరము శిల్ప బంధురము
ఈ జఘన మండలము సృష్టి నంతటిని
దాచుకొన్న ఆ పృధివీ మండలము............

ఓ....అభినవ సౌదర్యరాశీ...
ఓ...అపూర్వ చాతుర్యమూర్తీ
నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో...
మధురిమలెన్నో పొదుగుకొన్న నీస్తన్య సుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో...
హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున
జన్మించేభాగ్యమే లేదాయె తల్లీ...తల్లీ...తల్లీ.....

స్వామీ!!......

వచనం::: అవునమ్మ....నీవు ప్రదర్శించిన సౌదర్యము అనిత్యము
నీవు నమ్ముకొన్న యవ్వనము అసాస్వితము

దువ్వుకొన్న నీ నీలిముంగురులే దూదిపింజలై పోవునులే..
నవ్వుతున్న ఆకంటివెలుగులే..దివ్వెల పోలిక ఆరునులే..
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే..వాడి వత్తులై పోవునులే..
పాలుపొంగు ఆ కలశాలే తోలుతిత్తులై పోవునులే..
నడుము వంగగా...నీ ఒడలు క్రుంగగా..నడువలేని నీ బడుగు జీవితము
వడ వడ వణుకునులే...ఆశలురేపే సుందరహేహను అస్థిపంజరమౌనులే

No comments: