Saturday, January 08, 2011

భక్తతుకారం--1973::దర్భారు::రాగం




సంగీతం::ఆదినారాయణ రావ్
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల


రాగం::దర్భారు

ఉన్నావా..అసలున్నావా..
ఉంటే కళ్ళుమూసుకొన్నావా..
ఈ లోకం కుళ్ళు చూడకున్నావా..
ఉన్నావని కనుగొన్నామని
మున్నెందరెందరో అన్నారు..
ఉన్నావని చూస్తున్నావని
నమ్మియెందరో ఉన్నారు....

||ఉన్నావా..అసలున్నావా..||

నీ పేరిట వంచన పెరుగుతువుంటే..
నీ ఎదుటే హింసలు జరుగుతువుంటే
మనిషిని మనిషి దోస్తూ వుంటే
మంచికి సమాధికడుతూ వుంటే
రాతిబొమ్మవై నిలిచావు చేతకాని వాడనిపించావు

||ఉన్నావా..అసలున్నావా..||

నీ భక్తుడనయ్యాను నిత్య దరిద్రుడనయ్యాను
సేవలు చేసాను నా బ్రతుకే నైవేద్యం చేసాను
చేసిన మేలును మరిచేవాడ నువ్వాదేవుడివీ???
నువ్వొక వ్యర్థుడివీ.......
హూ...నీకొక పేరూలేదు...రూపంలేదు..
నీతీలేదు..నియమంలేదు..నిజానికి..నువ్వేలేవు..లేవు..లేవూ..

||ఉన్నావా..అసలున్నావా..|
|

No comments: