సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,రామ్మోహన్,ప్రభాకర రెడ్డి,గీతాంజలి,జయలలిత,రావికొండలరావు
పల్లవి::
చిన్నారి బాలల్లారా..రారండి
ఎన్నెన్నో వింతలున్నై..చూడండి
చరణం::1
తెలుగువారి రాజధాని..తెలుసా
మీకు చెప్పండి..ఓ హైద్రాబాద్
ఆ ఇదే ఇదే మన..భాగ్యనగరం
ఇదే..హైదరాబాదు
దేశమంతటా తిరిగి..చూసినా
దీనికి ధీటేలేదు..దీనికి ధీటేలేదు
చిన్నారి బాలల్లారా..రారండి
ఎన్నెన్నో వింతలున్నై..చూడండి
చరణం::2
చాచా నెహ్రూ పేరిట చల్లగ వెలసెను
ఈ తోట...చాచా నెహ్రూ
చాచా నెహ్రూ పేరిట చల్లగ వెలసెను
ఈ తోట పులులు..జింకలు చిలకలూ
పులులు జింకలు చిలకలూ..కలుసుకున్నవి ఈ చోట
చిన్నారి బాలల్లారా రారండి..ఎన్నెన్నో వింతలున్నై చూడండి
చరణం::3
అదిగో అదిగో అదిగో..కో అంటే ఓ అంటుంది
గోలకొండఖిల్లా..గోలకొండఖిల్లా..కో కో కో కో
ఇదిగో ఇదిగో రాముని గుడికై బ్రతుకర్పించిన రామదాసు చెఱసాలా
రామదాసు చెఱసాలా..మన రామదాసు చెఱసాలా
చరణం::4
బాల్యంలోనే భవితవ్యానికి..బంగరు బాటలు వేయాలి
నేటి బాలలే రేపటి పౌరులు..నిజం తెలుసుకుని మెలగాలి
నేటి బాలలే రేపటి పౌరులు..నిజం తెలుసుకుని మెలగాలి
చిన్నారి బాలల్లారా రారండి..ఎన్నెన్నో వింతలున్నై చూడండి
No comments:
Post a Comment