Thursday, January 13, 2011

తిరుపతి--1974::బౌళీ::రాగం



సంగీతం::చక్రవర్తి  
రచన::కోసరాజురాఘవయ్యా   
గానం::S.జానకి,చక్రవర్తి 
తారాగణం::రాజబాబు,సత్యనారాయణ,మురళీమోహన్,జయసుధ,నిర్మల,జయలక్ష్మి,అల్లు రామలింగయ్య
బౌళీ::రాగం   

పల్లవి::

పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         
తిరిగి రాకుంటే తిరపతీ..ఏమిటయ్యా మాగతీ తిరపతీ  
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         

చరణం::1

బచ్చాలాట లాడుకొని..చొక్కాలను చింపుకున్నాం
గోలీకాయ దెబ్బలతో..గుండ్లు పగల గొట్టుకున్నాం
చిట్ట చివరికిలా నిన్ను ఒక్కణ్ణే..పంపుతున్నాం..ఓ 
తిరపతీ..ఈ..తిరపతీ..ఈ..తిరపతీ..ఈ  
చిట్ట చివరికిలా నిన్ను..ఒక్కణ్ణే పంపుతున్నాం   
బిక్క మొగం బెట్టకుండ..భీముడల్లే ఎల్లిరారా    
పోయిరారా తిరపతీ పట్నం..పోయిరారా తిరపతీ         

చరణం::2

గట్టిగట్టి గోలీలు గుట్టలు..గుట్టలు వుంటాయంట
గుట్టుచప్పుడు కాకుండా నాలుగు..నాలుగు
నాలుగు..నాలుగు..గోలీలు..గోలీలు కొట్టుకొస్తావా
బొమ్మల సిగరెట్టు పెట్టెలూ..బజారునిండా వుండేనంటా
బరువని నువ్వనుకోకుండా..దొరికినవన్నీ తెస్తావా
బస్తీ రుచి మరిగి..మా నేస్తం వదిలేస్తావా
పోయిరారా తిరపతీ..పట్నం పోయిరారా తిరపతీ

చరణం::3

మీ రడిగినవన్నీ తేస్తా..నా కొక మాటిస్తారా
ఇస్తాం...  
నాన్నిచ్చిన కర్రలు ఆకులు..కాపాడుతు వుంటారా
ఓ....ఉంటాం  
మా అమ్మను చెల్లిని..వెయ్యికళ్ళ చూస్తారా..ఆఆఆ 
ఒరేయ్ చలపతీ..నాయనా గణపతీ..కాస్త చూస్తూ వుండండి
మా అమ్మను చెల్లిని..వెయ్యికళ్ళ చూస్తారా
చేతిలో చెయ్యెయ్యండి..వెళ్ళొస్తా వుండండి
పోయిరారా తిరపతీ..పొయొస్తా వుండరా చలపతీ   
పోయిరారా తిరపతీ..పొయొస్తా వుండరా గణపతీ   


No comments: