Monday, September 29, 2008

ఉమ్మడి కుటుంబం--1960



సంగీతం::TV.రాజు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

చెప్పాలని వుంది..అహా..
చెప్పాలని వుంది..మ్మ్..
దేవతయే దిగివచ్చి
మనుషులలో కలసిన
కథ చెప్పాలని వుంది


పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవతకథ చెప్పాలని వుంది


కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవతకథ చెప్పాలనివుంది


అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో
అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో
ఎన్ని జన్మలకు ఈ ౠణం ఎలా ఎలా తీరునో
నీ చల్లని మదిలో ఆదేవికింత చోటిస్తే
నీ చల్లని మదిలో ఆదేవికింత చోటిస్తే
ఆలోకమే మరచిపోవు నీలోనే నిలిచిపోవు ఆ...
..అహాహ...ఆహ అహాహహా ఓ...హో...ఓ హో హో...ఓహోహో...

Tuesday, September 23, 2008

మంచి కుటుంబం--1967





సంగీతం::S.P.కోదండ పాణి
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీ



నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది

నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు..ఆఅ
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలూ..ఆఆ
నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు
నీ కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలూ
నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి
నీ ఎదలో పూల పొదలే పూచి మధువులు చిందాయి
నా మమతలు పెంచాయి

నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది

నీ అల్లరి చూపులకే ఒళ్ళంత గిలిగింత..మ్మ్
నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత..ఉహు
నీ అల్లరి చూపులకే ఒళ్ళంత గిలిగింత
నీ తుంటరి చేష్టలకే మదిలో పులకింత
నీ వంపులలోన సొంపులలోన ఒలుకును వయ్యరం
నీ వంపులలోన సొంపులలోన ఒలుకును వయ్యరం
అది వలపుల జలపాతం

నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది

నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా..ఓహో
నీ పలుకులు వినకుంటే నిదురే రాదుకదా..ఆహా
నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా
నీ పలుకులు వినకుంటే నిదురే రాదుకదా
నీ సరసనలేని నిముషము కూడ ఏదో వెలితి సుమా
నీ సరసనలేని నిముషము కూడ ఏదో వెలితి సుమా
ఇక నీవే నేను సుమా..ఇక నీవే నేను సుమా

నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ కోరింది
నీలో ఏముందో ఏమో మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇ
మ్మంది

మంచి కుటుంబం--1968





















సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల


ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా
ఇంకా ఇంకా ఇంకా చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ

ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా


చిలిపి ఊహలే రేపకూ..సిగ్గుదొంతరలు దోచకూ
చిలిపి ఊహలే రేపకూ..సిగ్గుదొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు పెంచకు పెంచకు పెంచకూ
పెంచి నన్ను వేధించకూ

ఒంపులతో ఊరించకూ..ఉసిగొలిపీ వారించకూ
ఒంపులతో ఊరించకూ..ఉసిగొలిపీ వారించకూ
కలిగిన కోరిక దాచకు దాచకు దాచకూ
దాచి నన్ను దండించకూ

ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా..ఆఆ


కాదని కౌగిలి వీడకూ..కలలోకూడ కదలకూ
కాదని కౌగిలి వీడకూ..కలలోకూడ కదలకూ
కలిగే హాయిని ఆపకు ఆపకు ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ

ఒడిలో చనువుగ వాలకూ..దుడుక్తనాలూ చూపకూ
ఒడిలో చనువుగ వాలకూ..దుడుకు తనాలూ చూపకూ
ఉక్కిరి బిక్కిరి చేయకు చేయకు చేయకూ 
చేసి మేను మరిపించకూ 

ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా
ఇంకా ఇంకా ఇంకా చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా

రాగదీపం--1982



























Raaga Deepam Songs - Kunkuma Poosina Aakaasamlo... by teluguone


సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::ఘటసాల,P.సుశీల


కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్య రాగాలూ
కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్య రాగాలూ
అవి మౌన గీతాలై...
చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలూ..

కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్య రాగాలూ
కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్య రాగాలూ
అవి మధుర భావాలై..
మన ప్రణయ గీతాలై..
నా సిగలో విరిసిన కుసుమాలూ
..
ఎదలే తుమ్మెదలై వినిపించే ఝీకారం
పెదవులు త్వరపడితే వలపుల శ్రీకారం
కనులే కౌగిలులై కలిసే సంసారం
పరువపు వురవడిలో మనసులు ముడిపడుతూ
తొలిసారి కలిసెను ప్రాణాలు చెలికాని జీవనదాహాలూ..

కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్య రాగాలూ
అవి మధుర భావాలై..
మన ప్రణయ గీతాలై..
నా సిగలో విరిసిన కుసుమాలూ..

కలలే కలయికలై చిగురించే శౄంగారం
ప్రేమకు గుడి కడితే మాన ఇల్లే ప్రాకారం
మనసే మందిరమై పలికే ఓంకారం
వలపుల తొలకరిలో తనువులు ఒకటౌతూ
తొలిసారి పలికెను రాగాలు మనసార మధుర సరాగాలూ..

కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్య రాగాలూ
అవి మౌన గీతాలై...
చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలూ..
నా సిగలో విరిసిన కుసుమాలూ.
.

Monday, September 22, 2008

అద్రుష్టవంతులు--1969






సంగీతం::KV.మహాదేవన్
రచన::K.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల


అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..

చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు
పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు
చిక్కని మీగడ తరకల్లాగా చక్కనైన చెక్కిళ్ళు
పసి నిమ్మపండు లాగా మిసమిసలాడే వొళ్ళు
బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు
బెట్టు చూపి గుట్టు దాచే గడసరి సొగసరి కళ్ళు
కొంత కోడెతనముంది..మరి కొంత ఆడతనముంది
హోయ్‍..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా ......

మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు
బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు..
హాయ్..మూతి చూస్తే మీసమింకా మొలిచినట్టు లేదు
బెదురు చూస్తే ఎవ్వరితోను కుదిరినట్టు లేదు..
ఆ కసరు లోనే అలకనవ్వుల విసురు లేక పోలేదు
కొంత చిలిపితనముంది..మరి కొంత కలికితనముంది
హోయ్‍..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా ......

బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే
బులిపించే సొగసున్న ఓ బుల్లోడా నిను చూస్తుంటే
కొమ్ములు తిరిగిన మగాడికే దిమ్మెత్తి పోతుంటే
కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా
కన్నె పిల్లలే చూశారా కన్ను గీటక మానేరా
కవ్వించే కౌగిలిలో..కరగించక వదిలేర
హోయ్‍..అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా
ఈ బుల్లోడే బుల్లెమ్మయితే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా
అయా..యా..యా..యా..యా..
అయ్యయ్యో బ్రహ్మయ్యా ......

అద్రుష్టవంతులు--1969



సంగీతం::KV.మహాదేవన్
రచన::K.వెంకటరత్నం
గానం::P.సుశీల


మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య


మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు అ..ఓ..మ్మ్..
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో
చిన్న బోయి నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

అద్రుష్టవంతులు--1969




సంగీతం::మహాదేవన్
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల


ఓహోహో..హ్హో..హ్హో..ఒహో..హ్హో..హ్హో..
పడినముద్ర చెరిగిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...


పడినముద్ర చెరిగిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...


1)మచ్చికైన పాలపిట్టనూ..ఓ..రాజా..నా..రాజా
మచ్చికైన పాలపిట్టనూ..వలపంత
ఇచ్చుకొన్న కన్నెపిల్లనూ..
మచ్చికైన పాలపిట్టనూ..వలపంత
ఇచ్చుకొన్న కన్నెపిల్లనూ....
నీ జబ్బపైన పచ్చబొట్టునోయ్....
నీ జబ్బపైన పచ్చబొట్టునోయ్..ఔరౌర...
రొమ్ముమీద పుట్ట మచ్చనోయ్
..

ఒహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో
పడినముద్ర చెదరిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పెరటిచెట్టు పారిపోదురోయ్..సోగ్గాడ
పిల్లమనసు మారిపోదురోయ్...

2)డేగలాగ ఎగిరిపోతివోయ్..నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్....
డేగలాగ ఎగిరిపోతివోయ్..నిన్ను నేను తీగలాగ చుట్టుకొంటినోయ్
పాలలోన తేనె కలిసెనోయ్..ఓ..రాజా..నా..రాజా
ఆ..ఆ..ఆ..పాలలోన తేనె కలిసెనోయ్
నేడే మన పరువానికి పండుగైనదోయ్..
ఒహో..హో..హ్హో
..ఓహో..హో..హ్హో..ఓహో..హో..హ్హో
పడినముద్ర చెదరిపోదురోయ్..వన్నెకాడ
పడుచుగుండె విడిచిపోదురోయ్
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ
పడినముద్ర చెదరిపోదురోయ్..సోగ్గాడ

అద్రుష్టవంతులు--1969




రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల


కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

కన్నెబుగ్గకు సిగ్గుకమ్మెను కళ్ళుచూస్తే కైపులెక్కెను
కన్నెబుగ్గకు సిగ్గుకమ్మెను కళ్ళుచూస్తే కైపులెక్కెను
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కళలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

కంటికింపు జంటలంటే వెంటపడతావంట నువ్వు
కంటికింపు జంటలంటే వెంటపడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్లచల్లని వెన్నెలతో వేపుతావట
తెల్లవార్లూ చల్లచల్లని వెన్నెలతో వేపుతావట
మత్తు తెలిసిన చందురూడ మసక వెలుగే చాలులేరా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

అల్లుకున్న మనసులున్నవీ అలసిపోని బంధమున్నది
అల్లుకున్న మనసులున్నవీ అలసిపోని బంధమున్నది
చెలిమినాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
చెలిమినాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
తీపివాక్కుల చందురూడ కాపువై నువ్ వుండిపోరా
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా

అద్రుష్టవంతులు--1969



రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల


చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్...నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్
చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్


చింత చెట్టు చిగురు చూడు..చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్..2


పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
పాలవయసు పొందుకోరి పొంగుతున్నది నా పైట కూడ వాడి పేరె పలవరిస్తది
వగలమారి వాలుచూపు వ~ర్~రగున్నది
వగలమారి వాలుచూపు వ~ర్~రగున్నది
అది వెంటపడితె ఏదేదో వె~ర్~రిగున్నది


చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్..2

పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నది
పగ్గమేస్తే పెంకెతనం తగ్గనన్నది సిగ్గు దోస్తే చిటికెలోన మొగ్గుతున్నది
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది
జబర్దస్తీ చేస్తుంది జబ్బ మీద వాలుతుంది అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్..2

వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
వన్నె మీద చిన్నవాడి కన్ను పడ్డది అది వన్నె విడిచి నన్ను విడిచి మళ్ళనన్నది
ఇంతలేసి కన్నులతో మంతరిస్తది...ఇంతలేసి కన్నులతో మంతరిస్తది
అహ ఎంత దోచినా కొంత మిగులుతుంటది


చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు
చింత చిగురు పుల్లగున్నాదోయ్...

నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్
నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్


చింత చెట్టు చిగురు చూడు..చిన్నవాడి బెదురు చూడు
చింత చెట్టు కాపుకొచ్చిందోయ్...నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్..
నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్...
నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్

అద్రుష్టవంతులు--1969






రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల


ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా


ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా

పెదవులు రెండూ కలగలిసినచో తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో మమతకు లేదు హద్దు
పెదవులు రెండూ కలగలిసినచో తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో మమతకు లేదు హద్దు
చూడు ఉబలాటం ఆడు చెలగాటం
చూడు ఉబలాటం ఆడు చెలగాటం
పెడమోమైనా విడువను నిన్నువద్దురమొగమాటం


ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా

ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్‍ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్
‍ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్‍ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్‍
మోజు పడకుంటే మొగవాడే కాదు..మోజు పడకుంటే మొగవాడే కాదు
గడసరి బిగువు సడలించనిదే జవరాలే కాదు


ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా

Sunday, September 21, 2008

స్వాతిముత్యం--1986 రాగం::రీతిగౌళ


సంగీతం::ఇళయ రాజ
రచన::ఆత్రేయ
గానం::SP.బాలు,S.జానకి

Producer::Edida Nageswara Rao
Film Directed By::K.Viswanath
తారాగణం::కమల్‌హాసన్,రాధిక,గొల్లపూడిమారుతిరావు,J.V.సోమయాజులు,శరత్‌బాబు,దీప,Y.విజయ,డబ్బింగ్ జానకి,ఏడిదశ్రీరాం,మల్లికార్జునరావు,సుత్తి వీరభద్రరావు,విద్యాసాగర్,వరలక్ష్మీ.  
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారి సృతులు 

రాగం::రీతిగౌళ :::

:::::::::

రామా కనవేమిరా
రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా
రామా కనవేమిరా
రమణీయ లామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా


సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా
శ్రీరామ చంద్రమూర్తికన్నెత్తి చూడడేమని
అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా.....
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ
రామా కనవేమిరా....


ముసిముసి నగవుల రసిక శిఖామణుడు
సానిదమ పమగరిస
ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు త తకిట తక జణుత
ఒసపరి చూపుల అసదుష విక్రములు
తకజణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మనసు కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా....

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు
గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బాబులని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషత్గణులు
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తకద తైయ్యకు తా దిమి తా..


రామాయ రామభధ్రాయ రామచంద్రాయ నమహ
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు సీతవంక ఓరకంట చూసినాడు

ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళవిరిగెను శివధనస్సు
తనువొణికెను సీతానవవధువు
జయజయరామ రఘుకులసోమా
జయజయరామ రఘుకులసోమా
దశరధరామా దైస్యకరామ
దశరధరామా దైస్యకరామ
జయజయరామ రఘుకులసోమా
దశరధరామా దైస్యకరామ


సీతాకల్యాణ వైభొగమే
శ్రీరామ కల్యాణ వైభొగమే
సీతాకల్యాణ వైభొగమే
శ్రీరామ కల్యాణ వైభొగమే
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమనీయమే
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమనీయమే
సీతాకల్యాణ వైభొగమే
శ్రీరామ కల్యాణ వైభొగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా
రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా..ఆ..ఆ
రామా కనవేమిరా...రామా కనవేమిరా


Swathi Mutyam--1985
Music::Ilayaraja
Lyricis::Aathreya
Singer's::S.P.Baalu,S.Janaki
Phroducher::Edida Nagesvara Rao
Film^ Direchted By^::K.Visvanath
Cast::Kamalhaasan,Raadhika,Nirmalamma,Gollapoodimaarutirao,J.V.Somayaajulu,SaratBabu,Deepa,Y.Vijaya,Dubbing Janaki,EdidaSreeram,Mallikarjuna Rao,Suthi Veerabhadra Rao,Vidyasagar,
Varalakshmi,  

::::::::

Raamaa kanavemiraa
raamaa kanavemiraa sri raGhuraama kanavemiraa
raamaa kanavemiraa
ramanee lalaama nava laavanya seema
dharaaputri suma gaatRi
dharaaputri suma gaatRi nadayaadi raagaa

raamaa kanavemiraa

seetaaswayamvaram prakatinchina pimmata
janakuni koluvulo pravesinche jaanakini
sabhaasadulandaru pade pade choodagaa sree raama chandra muurti
kannetti choodademani anukuntunnaarata tamalo
seetamma anungu chelikattelu

musimusi nagavula rasika sikhaamanulu
osapari choopula asadusha vikramulu sagarida mani da ma ni ni
musimusi nagavula rasika sikhaamanulu tha thakita thaka januta
osapari choopula asadusha vikramulu
thakajanu thakadhimi thaka
meesam meete rosha paraayanulu nee da ma pa ma sa ri ga
maa sari evaranu matta gunolvanuluu aaha
kshaname oka dinamai nireekshaname oka yugamai
taruni vanka siva dhanuvu vanka
tama tanuvu manasu kanulu terachi choodaga

raamaa kanavemiraa

mundukegi villandaboyi muchchematalu pattina doralu o varudu
todagotti dhanuvu cheypatti baabulani gundelu jaarina vibhulu
gundelu jaarina vibhulu
villettaaleka mogamettaaleka siggesina narakundavulu
tama vaLLu vorigi rendu kaLLu tirigi voggesina purushatghanulu
ette vaaru leraa a villu ekku pette vaaru leraaa
ette vaaru leraa a villu ekku pette vaaru leraaa
ette vaaru leraa a villu ekku pette vaaru leraaa
aha ette vaaru leraa a villu ekku pette vaaru leraaa
aha ette vaaru leraa a villu ekku pette vaaru leraaa

takad taiyyaku taa dimi taa..

భద్రకాళి --1976



సంగీతం::ఇళయరాజ
రచన::దాశరథి
గానం::యేసుదాస్,P.సుశీల

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ

నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ
పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ
నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ
పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ
ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏ నాడు విడదమ్మా
అమ్మ వలె రమ్మనగా పాప వలె చేరేవూ
నా చెంత నీవుంటే స్వర్గమేమి నాదౌనూ
గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే
కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే

స్నానమాడి శుభవేళా కురులతో పువ్వులతో
దేవి వలె నీవొస్తే నా మనసు నిలువదులే
అందాల కన్నులకూ కటుకను దిద్దేనూ
చెడు చూపు పడకుండా అగరు చుక్క పెట్టేనూ
చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ
జోలాలీ..జోలాలీ..జోలాలీ..జోలాలీ..జో జో జో !!!!

Friday, September 19, 2008

సిసింద్రి చిట్టిబాబు--1971



మీకు ఈ పాట వినాలని ఉంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతంT.చలపతి రావ్రచన::దాసరి
గానం::L.R.ఈశ్వరి

హమ్మా హమ్మా హమ్మా హమ్మా
ముల్లుగుచ్చుకొన్నాది బావా
తుమ్మ ముల్లుగుచ్చుకొన్నాది బావా
హాయ్..ముల్లుతీసి ముద్దుచేసీ
ముల్లుతీసి ముద్దుచేసి
ఇల్లుచేర్చర ఓ బావా...
ఇల్లు చేర్చర ఓ బావా....


హమ్మా హమ్మా హమ్మా హమ్మా
ముల్లుగుచ్చుకొన్నాది బావా
తుమ్మ ముల్లుగుచ్చుకొన్నాది బావా
హాయ్..ముల్లుతీసి ముద్దుచేసీ
ముల్లుతీసి ముద్దుచేసి
ఇల్లుచేర్చర ఓ బావా...
ఇల్లు చేర్చర ఓ బావా....

పైరగాలి విసురుతువుంటే
....పాకకున్నాదీ
....పాకకున్నాదీ
గట్టుమీద నడవాలంటే
కాళ్ళు నిలవనన్నాదీ
కాళ్ళు నిలవనన్నాదీ
ఆపలేని తాపమాయే
ఆగి చూడర ఓ బావా
ఆపలేని తాపమాయే
ఆగి చూడర ఓ బావా
హయ్యో హయ్యో హయ్యో హయ్యో
కొంగుపట్టుకొన్నాడే బావా
జడకొంగుపట్టుకొన్నాడే బావా
హాయ్..పచ్చ పచ్చని పరువమంతా
పరులపాలైపోకముందే
పరువు నిలపర ఓ బావా
పరువు నిలపర ఓ బావా


కొంటే మనసు జంటనుకోరి
వెంటపడుతు వున్నాదీ
వెంతపడుతు వున్నాదీ
ఏరుదాటి ఊరుదాటీ
ఎగిరిపోదమన్నాదీ
ఎగిరిపోదమన్నాదీ
నీలిమబ్బుల మేడలోన
ఆడుకొందాం ఓయ్ బావా
నీలిమబ్బుల మేడలోన
ఆడుకొందాం ఓయ్ బావా
అరే అరే అరే అరే
కాలుజారి పడ్డాను బావా
అయ్యో కాలు జారి పడ్డాను బావా
హాయ్...ఇంక నేనూ కదలలేనూ
నువ్వులేక నడవలేనూ
ఎత్తుకోర ఓబావా..ఎత్తుకోర ఓ బావా
నన్ ఎత్తుకోర ఓ బావా....

Tuesday, September 16, 2008

సిసింద్రి చిట్టిబాబు--1971



సంగీతం::T.చలపతి రావ్
రచన::??Narayana reddi
గానం::ఘటసాల,P.సుశీల

వస్తా వెళ్ళోస్తా
వస్తా మళ్ళి వస్తా

ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ

మల్లెలు పూచేవేళా
మనసులు పిలిచేవేళా
మల్లెలు పూచేవేళా
మనసులు పిలిచేవేళా
మళ్ళి మళ్ళి వస్తా..ఆ..ఆ..
వస్తా వెళ్ళోస్తా
వస్తా మళ్ళి వస్తా

కనులైన కలవందే
మనసైనా తెలవందే
ముద్దైనా ఇవాందే
మోజైనా తీరందే
అలా జారుకొంటావే
పలాయించిపోతావే
అలా జారుకొంటావే
పలాయించిపోతావే
అయితే నేవెళ్ళోస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళోస్తా..
వస్తా..మళ్ళి ఎప్పుడైనా వస్తా
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ

శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
లఘ్నం చూసుకొవస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళోస్తా
వస్తా మళ్ళి వస్తా

చినదాని చెక్కిలిపై చిటికైనా వేయందే
కళ్ళల్లో కళ్ళుంచి కథలైనా చెప్పందే
అలా జారుకొంటావే ఫలాయించిపోతావే
అలా జారుకొంటావే ఫలాయించిపోతావే
అయితే నేనెల్లోస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళోస్తా..
వస్తా..ఎప్పుడైనా వస్తా
ఎప్పుడూ..ఏప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ
ఎప్పుడూ..ఎప్పుడూ..
ఇంకెప్పుడూ..ఎప్పుడూ

శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
శ్రావణమంగళవారం
చల్లని సాయంకాలం
లఘ్నం చూసుకొవస్తా..ఆ..ఆ
వస్తా వెళ్ళోస్తా
వస్తా మళ్ళి వ
స్తా

Sunday, September 14, 2008

అవే కళ్ళు--1967




సంగీతం::వేద
రచన::కోసరాజు
గానం::ఘంటసాల,పిఠాపురం

మా ఊళ్ళో ఒక పడుచుంది
దయ్యమంటె భయమన్నది
డ డ డ డా డ డ
మా ఊళ్ళో ఒక పడుచుంది
దయ్యమంటె భయమన్నది
ఆ ఊళ్ళో ఓ చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడు


చెమ్మచెక్క
చెమ్మచెక్క
చెమ్మాచెక్కా..హోయ్
మల్లెమొగ్గ
మల్లెమొగ్గ
మల్లెమొగ్గా..హోయ్

చెమ్మచెక్క
చెమ్మచెక్క
చెమ్మాచెక్కా
మల్లెమొగ్గ
మల్లెమొగ్గ
మల్లెమొగ్గా..హోయ్

హొయ్ భలె భలె భలే...యహ్
మా ఊళ్ళో ఒక పడుచుంది
దయ్యమంటె భయమన్నది
ఆ ఊళ్ళో ఓ చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడు


కంటి మీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్లా అన్నాడు

హోయ్..లైలలలైలలలలా..హోయ్
లైలలలైలలలలా..హోయ్
లైలలలైలలలలా..హోయ్
లైలలలైలలలలా....

కంటి మీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరచిందయ్యో

హటికే హటికే హటికే
అరె బటికే బటికే బటికే
హటికే హటికే హటికే
అరె బటికే బటికే బటికే

హోయ్ భలె భలె భలే..య్య
మా ఊళ్ళో ఒక పడుచుంది
దయ్యమంటె భయమన్నది
ఆ ఊళ్ళో ఓ చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడు


బుర్రిపిట్ట..అహా..తుర్రు మంటే..ఓహో..బాబో అంది
అత్త కొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు

హొయ్ లైల లల లా..హొయ్ లైలలలలా
హొయ్ లైల లల లా..హొయ్ లైలలలలా
హొయ్ లైల లల లా..హొయ్ లైలలలలా

బుర్రిపిట్ట..హ్హ..తుర్రు మంటే..హ్హొ.. బాబో అంది
అత్త కొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు

ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటూ అరచింద
య్యో
హటికే హటికే హటికే
అరె బటికే బటికే బటికే
హటికే హటికే హటికే
అరె బటికే బటికే బటికే

హోయ్ భలె భలె భలే..య్యమా ఊళ్ళో ఒక పడుచుంది
దయ్యమంటె భయమన్నది
ఆ ఊళ్ళో ఓ చిన్నోడు
నేనున్నాలే పదమన్నాడు

చెమ్మచెక్క
చెమ్మచెక్క
చెమ్మాచెక్కా
మల్లెమొగ్గ
మల్లెమొగ్గ
మల్లెమొగ్గా
చెమ్మచెక్క
చెమ్మచెక్క
చెమ్మాచెక్కా
మల్లెమొగ్గ
మల్లెమొగ్గ
మల్లెమొగ్గా
చెమ్మచెక్క మల్లె మొగ్గ
చెమ్మ చక్క మల్లె మొగ్గ
చెమ్మచెక్క మల్లె మొగ్గ
చెమ్మ చక్క మల్లె మొగ్గ
హొయ్ బలె బలె బలె బలే య్య



మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
డడాఢడాఢడడడాఢడ
మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క

హోయ్..మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్..చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క
హోయ్..మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
హోయ్..బలెబలెబలెబలెబలే..య్య

మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు

చరణం::1

కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు

హోయ్..లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్..లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్..లాయిలల్ల లాయిలల్లలల్ల లల్లలల్లలా

కంటిమీద కునుకురాదు బావా అంది
కన్ను మూసుకో నన్ను తలచుకో పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటు అరిచిందయ్యా

హటకే హటకే హటకే అరె..బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హటకే హటకే హటకే అరె..బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హోయ్..బలెబలెబలెబలెబలే..య్య

చరణం::2

బుర్రుపిట్టా అహా తుర్రుమంటే ఓహో బాబోయ్ అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు

హోయ్..లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్..లాయిలల్ల లాయిలల్ల లల్లలా
హోయ్..లాయిలల్ల లాయిలల్లలల్ల లల్లలల్లలా

బుర్రుపిట్టా అహా తుర్రుమంటే ఓహో బాబోయ్ అంది
అత్తకొడుకుని అరవబోకులే పిల్లా అన్నాడు
ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో
ఓలమ్మో గైరమ్మో కెవ్వంటు అరిచిందయ్యా

హటకే హటకే హటకే అరె..బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హటకే హటకే హటకే అరె..బచ్‌కే బచ్‌కే బచ్‌కే
హోయ్... బలెబలెబలెబలెబలే..య్య

మా ఊళ్లో ఒక పడుచుంది దెయ్యమంటే భయమన్నది
ఆవూళ్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు

చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క చెమ్మచెక్క చెమ్మచక్క
మల్లెమొగ్గ మల్లెమొగ్గ మల్లెమొగ్గ
చెమ్మచెక్క మల్లెమొగ్గ..చెమ్మచెక్క మల్లెమొగ్గ
చెమ్మచెక్క మల్లెమొగ్గ..చెమ్మచెక్క మల్లెమొగ్గ

బలెబలెబలెబలెబలే..య్య

Saturday, September 13, 2008

పంతులమ్మ--1977::రేవతి ::రాగం:





















పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల

రేవతి::రాగం


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
మానస వీణా మధుగీతం
మనసంసారం సంగీతం
సాగర మధనం..అమృత మధురం
సంగమ..సరిగమ..నవపారిజాతం

మానస వీణా మధుగీతం
మనసంసారం సంగీతం
సంసారం...సంగీతం...

ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హౄదయపరాగం
ఆ ఆ..అ అ ఆ..అ అ అ ఆ..ఆ ఆ
అ..అ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
ఏ రాగమో ఏమో మన అనురాగం
వలపు వసంతాన హౄదయపరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం

శతవసంతాల...దశదిశంతాల
సుమసుగంధాల...భ్రమరనాదాల
కుసుమించు నీ అందమే..విరిసింది అరవిందమై
కురిసింది మకరందమై..

మానస వీణా మధుగీతం
మనసంసారం సంగీతం
సంసారం...సంగీతం...

జాబిలి కన్నా నా చెలి మిన్నా..
పులకింతలకే పూచిన పొన్న..
కానుకలేమి నే నివ్వగలను?
కన్నుల కాటుక నే నివ్వగలను !

పాలకడలిలా వెన్నెల పోంగింది
పూలపడవలా నా తనువూగింది
ఏ మల్లెల తీరాన నిను చేరగలనూ ?
మనసున మమతై కడతేరగలను !

ఆ...గగసరి గపదప మమ గగ రిరి సస సరిసగమ
రిమగపదప రిమరిమ స రి..గస స..పద ద..పద ద..

మానస వీణా మధుగీతం
మనసంసారం సంగీతం
సంసారం...సంగీతం...

ఆ..ఆఆ...ఆ..ఆ..
నిరిగమద మగరిని..దనిని..నిదమ..
ఆ ఆ ఆ...ఆ ఆ అ అ ఆ ఆ..అ అ ఆ..
నిని రిరి గగ మమ దద దద నిని రిరి
గగ మమ మమ దద నిని రిరి గగ

కురిసే దాకా అనుకోలేదూ శ్రావణ మేఘమని
ఆ ఆ అ..తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని
ఆ ఆ..కలిసేదాకా అనుకోలేదు తీయనీ స్నేహమనీ

సనిరి సని..ని ని ని..నిని నిని నిని దని దనిద మద సస స
మగదమగ మగ మగ గద మగ మగ..నిమగమ దప..దగరిగ రిగ..దనినిరి నిరి
ఆ ఆ అ అ...ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..ఆ ఆ అ అ..
ఆ ఆ ఆ......ఆ ఆ ఆ అ అ అ ఆ ఆ..మా...రిమగదప రిమరి..
సరిమరి సరిసద..ససరి సరిమ..పెదవినేనుగా..పదము నీవుగా..ఎదను పాడని

మానస వీణా మధుగీతం
మనసంసారం సంగీతం
సాగర మధనం..అమృత మధురం
సంగమ..సరిగమ..నవపారిజాతం

పంతులమ్మ--1977




పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::SP.బాలు


ఎడారిలో కోయిలాతెల్లారనీ రేయిలా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పల్లవించు ప్రతిపాటా బ్రతుకు వంటిదే
రాగమొకటి లేక తెగిన తీగవంటిదే

ఎద వీణపై అనురాగమై తలవాల్చి నిదురించు నా దేవతా
కల ఆయితే శిల అయితే మిగిలింది ఈ గుండెకోతా
నా కోసమే విరబూసినా మనసున్న మనసైన మరుమల్లికా
ఆమనులే వేసవులై రగిలింది ఈ రాలుపూత రగిలింది ఈ రాలుపూతా
విధిరాతచేతా..నా స్వర్ణసీతా.....
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

కొన్ని పాటలింతే..గుండెకోతలోనే చిగురిస్తాయ్
కొన్ని బ్రతుకులంతే..వెన్నెలతో చితి రగిలిస్తాయ్

ఆ రూపమే నా దీపమై వెలిగింది మూణ్ణాళ్ళు నూరేళ్ళుగా
వేదనలో వెన్నెలగా వెలిగించి తన కంటిపాపా
చలిమంటలే చితిమంటలై చెలరేగె చెలిలేని నా కౌగిటా
బ్రతుకంటే మృతికంటే చేదైన ఒక తీపి పాట చేదైన ఒక తీపి పాటా
చెలిలేని పాటా..ఒక చేదుపాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా
పూదారులన్ని గోదారికాగా
పూదారులన్నీ గోదారికాగా
పాడింది కన్నీటి పాటా
ఎడారిలో కోయిలా తెల్లారనీ రేయిలా

పంతులమ్మ--1977::మోహన::రాగం:



పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::SP. బాలసుబ్రమణ్యం

రాగం:::మోహన::

సిరిమల్లె నీవే..విరిజల్లు కావే
వరదల్లె రావే..వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే..ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే

ఎలదేటి పాటా..చెలెరేగె నాలో
చెలరేగి పోవే..మధుమాసమల్లే
ఎల మావి తోటా..పలికింది నాలో
పలికించుకోవే..మది కొయిలల్లే
నీ పలుకు నాదే..నా బ్రతుకు నీదే

తొలిపూత నవ్వే..వనదేవతల్లే
పున్నాగ పూలే..సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే..ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే

ఆఆ..ఆఆఆఆ..ఆఆఆఆఆ..
మరుమల్లె తోటా..మారాకు వేసే
మారాకు వేసే..నీ రాక తోనే
నీ పలుకు పాటై..బ్రతుకైనా వేళా
బ్రతికించుకోవే..నీ పదముగానే
నా పదము నీవే..నా బ్రతుకు నీవే

అనురాగమల్లే..సుమగీతమల్లే
నన్నల్లు కోవే..నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే
అహా..ఆ..హా..లలలాల..లాలా

పంతులమ్మ--1977




పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::SP.బాలుP.సుశీల


తేనె తీగ కుడుతుంటే తీపిగుంటదా
తేనె తీగ కుడుతుంటే తీపిగుంటదా
ఐన నీవు కన్ను కొడుతుంటే ఎన్నెలొస్తది
ఎన్నో వన్నె లిస్తదీ...

పూలజల్లు పడుతుంటే..హ..హా..ఆఆ...
పూలజల్లు పడుతుంటే ఎల్లువస్తదా అయిన
నీవు పక్క కొస్తుంటే పండగొస్తది
వయసే పంటకొస్తదీ....

అయ్యారే వయ్యారం ఊగింది ఉయ్యాలా..ఆ
ఇయ్యలా నా వలపే నీ తలపు తీయలా..ఓ..
ఏసింది ఈడు ఈల చేసింది గోలా
నీ జోడు కావాలా నాతోడు రావాలా
సందేల నీ సోకు జాబిల్లి కావాలా
చీకట్లో నీ నవ్వు పూవులెట్టుకోవలా
ఓయ్..నీ వేడి నాకు ఓణి చల్లారే వేళా
నీవాడి సూపుల్లో తెల్లారిపోవాలా
హే....హా...తందన తందన తనే తందన

తేనె తీగ కుడుతుంటే తీపిగుంటదా
ఐన నీవు కన్ను కొడుతుంటే ఎన్నెలొస్తది
ఎన్నో వన్నె లిస్తదీ...
పూలజల్లు పడుతుంటే ఎల్లువస్తదా అయిన
నీవు పక్క కొస్తుంటే పండగొస్తది
వయసే పంటకొస్తదీ....

అహ..హహా..హ..హ..హ..హా
ఆ..హా..హ..హా..ఆహా...లాలలా..లాలలా..
గోరింక తాకంగ నెలవంక అవ్వలా..ఆ
గోతంత నీ ఎలుగు కొండంత కావాలా..ఆ
ఆ..ఆకంటి కీ కన్ను కాటుకైపోవాల
నీ చూపు నా చూపు సుట్టాలు కావాలా
వానోచ్చి వరదల్లే నీ వయసు పోంగాలా..ఆ
నే నోచ్చి వలపల్లే వాటేసు కోవాలా..ఆ..
హోయ్...నా ఎండకే నీవు ఎన్నెల్లు కాయలా
కౌగిట్లో నా బ్రతుకు కడతేరి పోవాలా
ఆఆ...హో...తందన తందన తానే తందనా
పూలజల్లు పడుతుంటే ఎల్లువస్తదా అయిన
నీవు పక్క కొస్తుంటే పండగొస్తది
వయసే పంటకొస్తదీ....
తేనె తీగ కుడుతుంటే తీపిగుంటదా
ఐన నీవు కన్ను కొడుతుంటే ఎన్నెలొస్తది
ఎన్నో వన్నె లిస్తదీ...
అహా..పండగొస్తదీ..వయసే పంటకొస్తది
అహా..ఎన్నెలొస్తదీ..ఎన్నో వన్నెలిస్తదీ

పంతులమ్మ--1977



పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::బాలు,P.సుశీల

పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
హబ్బా..దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా

చల్లగాలి పాటవుంది..సంపంగి తోటవుంది
ఆ ఎనక చాటువుంది ఎనక చాటు మాట ఉంది
ఇన్నున్నా నా చెంత చిన్నాది లేకుంటే
ఇన్నున్నా నా చెంత చిన్నాది లేకుంటే
ఎన్నలేమి చేసుకోను సెందరయ్యా
ఈ వేడినేడ దాచుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
హబ్బా..దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా

సన్నజాజి పందిరుంది..తొలిరోజు తొందరుంది
సోకైన వాడి చూపూ సోకి సోకి సొదపెడుతుంది
ఇనున్న నా సెంత సిన్నోడు లేకుంటే
ఇనున్న నా సెంత సిన్నోడు లేకుంటే
ఎన్నలేమి చేసుకోను సెందరయ్యా
ఈ వన్నెలేడ దాచుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
హబ్బా..దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా

అర్ధరాత్రి అవుతున్నాది నిద్దరేమో రాకున్నాది
ఇద్దరుండి ఎవ్వరులేనీ ముద్దు ముచ్చటౌతున్నాది
సుక్కబంతి పూవుంది సక్కదనం పక్కేసింది
సక్కిలిగిలి సంతకాడా జాతరేదో చలరేగింది
ఇనున్నా నాసెంత సిన్నోడు లేకుంటే
ఇనున్న నాసెంత సిన్నాది లేకుంటే
ఎన్నెలేమి సేసుకోనూ సెందరయ్యా...
నా ఏడినేడ దాసుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా

పంతులమ్మ--1977




పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్‌నాగేంద్ర
రచన::వేటూరి
గానం::P.సుశీల


మనసెరిగినవాడు మా దేవుడూ

మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడు

ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ..

తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైబోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా..నీడగా..రఘురాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

కడకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరువైన పేరు
శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
హనుమ ఎదలొ భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామికమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ

మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు

Friday, September 12, 2008

జ్యోతి--1976



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::సుశీల

రాగం::

ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
తెలియనివారికి తెలుపర స్వామీ
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏల వెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు

ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఆ..ఆ..అ..అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఏ అర్థమున్నదో..ఏసత్యమున్నదో
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు

పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో..ఓఓ..
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో
రెండుప్రేమల మధ్య బండగా మారావు
స్వామీ..రెండుప్రేమల మధ్య బండగా మారావు
రేపులేని నీకు దోపిడి ఎందుకో..ఓఓ..
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు

జ్యోతి--1976



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,S.జానకి

నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట

ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడూ లేదంటా

అలాగా..

నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట

ఎందుకంటా?
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదంట


నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నదికీ కడలికి పొంగంట


ప్రతి రేయి మనకొక తొలిరేయంట
ఆ…..
తొలిముద్దు పెదవులు విడిపోవంట
ఆ….
జగతికంతటికీ మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
ఆ..నా కంట నిను చూసుకుంటా
ఆ..నీ చూపు నా రేపు పంట

ఆ…ఆ…

నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట


మన కోర్కెలన్నీ పసిపాపలంట
ఆ..ఆ…చిగురాకు మనసుల చిరునవ్వులంట
ఆ..ఆ…
వయసు లేనిది మన వలపేనంట
మనజీవితము ఆటాపాటెనంట
ఆ..నాలోన నిను దాచుకుంటా
ఆ..నీ ఊపిరై కాచుగుంట

ఆ..ఆ…

నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదం

నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట

జ్యోతి--1976::రాగం::యదుకుల కాంభోజి



సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,జానకి

రాగం::యదుకుల కాంభోజి::

(పహడి)

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ
చిరకాలముండాలి ఈ నవ్వూ
చిగురిస్తు వుండాలి..ఆ నవ్వూ..ఆ నవ్వూ

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ


పనిసా..అ..హా..హా..
సగమా..అ..హ..హా..గమపా..
నినిపమగమగమపా..ఆ..ఆ..ఆ..ఆఆ..
ఆ..చిరుగాలి తరగల్లే మెలమెల్లగా
సెలయేటి నురగల్లే తెల్ల తెల్లగా..
చిరుగాలి తరగల్లే మెలమెల్లగా
సెలయేటి నురగల్లే తెల్ల తెల్లగా
చిననాటి కలలన్నీ తియతీయగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా
మ్మ్మ్మ్..ఆ..హా..

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ

నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా..ఆ..
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
ఆ..ఆ..ఆ..ఆ..ఆఆఆ...
వెలుగుతూ వుంటాను నీ దివ్యగా..ఆ..
వెలుగుతూ వుంటాను నీ దివ్యగా
నే మిగిలి వుంటాను తొలి నవ్వుగా..తొలినవ్వుగా

సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ
చిరకాలముండాలి ఈ నవ్వూ
చిగురిస్తు వుండాలి ఆ నవ్వూ..ఆ నవ్వూ
సిరిమల్లెపూవల్లే నవ్వూ
చినారి పాపల్లే నవ్వూ..నవ్వూ





Jyothi--1976
Music::Chakravarthy
Lyricist::Aacharya Aathreya
Singers::S.P.Balu, S.Janaki

Sirimalle puvalle navvu
chinnari papalle navvu
chirakalamundali nee navvu
chiguristu vundali na nuvvu..na nuvvu 
Sirimalle puvalle navvu
chinnari papalle navvu..nvvu
panisa..hahaha..sagama..hahaha..gamapa..hahaha
ninisapama..gamagamapa..hahaha

Chirugali taragalle mela mellagaa
selayeti nurugalle tela tellagaa
Chirugali taragalle mela mellagaa
selayeti nurugalle tela tellagaa
chinanati kalalalle tiyatiyyagaa
yennenno raagalu ravalinchagaa
ravalinchagaa..

Sirimalle puvalle navvu
chinnari papalle navvu..nvvu

Ne pedavipai navvule kempugaa aa.
Ne kanulalo nuvvu teli merupugaa aa
Chekkillapai navvu nunu siggugaa
Chekkillapai navvu nunu siggugaa
paruvanni vudikinchi vurikinchagaa
urikinchagaa..

Sirimalle puvalle navvu..
chinnari papalle navvu..nvvu

Ne navvu na bratuku veliginchagaa
aa velugulo nenu payaninchagaa
Ne navvu na bratuku veliginchagaa
aa velugulo nenu payaninchagaa
aa..aa..
Velugutu vuntanu ne divvegaa
Velugutu vuntanu ne divvegaa
ne migili vuntanu tholi navvugaa
tholi navvugaa..                   

Sirimalle puvalle navvu
chinnari papalle navvu
chirakalamundali nee navvu
chiguristu vundali na nuvvu..na nuvvu
Sirimalle puvalle navvu..
chinnari papalle navvu..nvvu..

Monday, September 01, 2008

రైతు బిడ్డ--1971
















సంగీతం::S. హనుమంతరావు
రచన::D.సినారె
గానం::S.P.బాలు, P.సుశీల  
తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ,అనూరాధ,శాంతకుమారి,సత్యనారాయణ

సాకీ::

దిక్కులను చూసేవు..దిగులుగా నిలిచేవు
అనుకున్న కబురందలేదా..ఆ..
ఎందుకమ్మాయి..నీకింత బాధా

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..విరిసిన మరుమల్లి..జరుగును మన పెళ్ళీ
విరిసిన మరుమల్లి..జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా..ఆఆఆ..మురిపాల సందడిలోనా
ఆఆఆ..మురిపాల సందడిలోనా

విరిసిన మరుమల్లి..జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా..ఆఆఆ..మురిపాల సందడిలోనా 
..ఆఆ..మురిపాల సందడిలోనా

చరణం::1 

అమ్మగారి దీవెనలు అందుకున్నారా
అన్నగారు అందుకు సరే అన్నారా..ఓ..ఓ..ఆ..ఆ
అమ్మగారి దీవెనలు అందుకున్నారా
అన్నగారు అందుకు సరే అన్నారా
మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు
మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు
మనల మన్నిచారు..మనువు కుదిరించారు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ
విరిసిన మరుమల్లి..జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా..మురిపాల సందడిలోనా
ఆఆ..మురిపాల సందడిలోనా 


చరణం::2  

ఆ..అ..ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..ఓ
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా..కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా..కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?

వలచి కాదంటానా..కలసి విడిపోతానా?
వలచి కాదంటానా..కలసి విడిపోతానా?
ఏకమై ఉందామూ ఎన్ని జన్మలకైనా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

విరిసిన మరు మల్లి..జరుగును మన పెళ్ళీ..ముత్యాల పందిరిలోనా
మురిపాల సందడిలోనా..ఆఆఅ..మురిపాల సందడిలోనా