Tuesday, September 23, 2008

మంచి కుటుంబం--1968





















సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల


ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా
ఇంకా ఇంకా ఇంకా చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ

ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా


చిలిపి ఊహలే రేపకూ..సిగ్గుదొంతరలు దోచకూ
చిలిపి ఊహలే రేపకూ..సిగ్గుదొంతరలు దోచకూ
జిలిబిలి ఆశలు పెంచకు పెంచకు పెంచకూ
పెంచి నన్ను వేధించకూ

ఒంపులతో ఊరించకూ..ఉసిగొలిపీ వారించకూ
ఒంపులతో ఊరించకూ..ఉసిగొలిపీ వారించకూ
కలిగిన కోరిక దాచకు దాచకు దాచకూ
దాచి నన్ను దండించకూ

ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా..ఆఆ


కాదని కౌగిలి వీడకూ..కలలోకూడ కదలకూ
కాదని కౌగిలి వీడకూ..కలలోకూడ కదలకూ
కలిగే హాయిని ఆపకు ఆపకు ఆపకూ
ఆపి నన్ను ఆడించకూ

ఒడిలో చనువుగ వాలకూ..దుడుక్తనాలూ చూపకూ
ఒడిలో చనువుగ వాలకూ..దుడుకు తనాలూ చూపకూ
ఉక్కిరి బిక్కిరి చేయకు చేయకు చేయకూ 
చేసి మేను మరిపించకూ 

ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా
ఇంకా ఇంకా ఇంకా చేరువ కావాలీ
ఇద్దరు ఒకటై పోవాలీ
ఎవరూ లేని చూటా ఇదిగో చిన్నమాటా
ఎవరూ లేని చూటా..ఏయ్..ఇదిగో చిన్నమాటా

No comments: