Tuesday, September 23, 2008

రాగదీపం--1982



























Raaga Deepam Songs - Kunkuma Poosina Aakaasamlo... by teluguone


సంగీతం::చక్రవర్తి
రచన::దాసరి నారాయణ రావ్
గానం::ఘటసాల,P.సుశీల


కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్య రాగాలూ
కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్య రాగాలూ
అవి మౌన గీతాలై...
చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలూ..

కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్య రాగాలూ
కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్య రాగాలూ
అవి మధుర భావాలై..
మన ప్రణయ గీతాలై..
నా సిగలో విరిసిన కుసుమాలూ
..
ఎదలే తుమ్మెదలై వినిపించే ఝీకారం
పెదవులు త్వరపడితే వలపుల శ్రీకారం
కనులే కౌగిలులై కలిసే సంసారం
పరువపు వురవడిలో మనసులు ముడిపడుతూ
తొలిసారి కలిసెను ప్రాణాలు చెలికాని జీవనదాహాలూ..

కుంకుమ పూసిన ఆకాశంలో
ప్రణయ సంధ్య రాగాలూ
అవి మధుర భావాలై..
మన ప్రణయ గీతాలై..
నా సిగలో విరిసిన కుసుమాలూ..

కలలే కలయికలై చిగురించే శౄంగారం
ప్రేమకు గుడి కడితే మాన ఇల్లే ప్రాకారం
మనసే మందిరమై పలికే ఓంకారం
వలపుల తొలకరిలో తనువులు ఒకటౌతూ
తొలిసారి పలికెను రాగాలు మనసార మధుర సరాగాలూ..

కుంకుమ కోరిన అనురాగంలో
ఉదయ సంధ్య రాగాలూ
అవి మౌన గీతాలై...
చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలూ..
నా సిగలో విరిసిన కుసుమాలూ.
.

No comments: