సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::సుశీల
రాగం::
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
తెలియనివారికి తెలుపర స్వామీ
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏల వెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
ఎక్కడో ఎవరికో ముడివేసిపెడతావు
ఏముడిని ఎందుకో విడదీసిపోతావూ
అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఆ..ఆ..అ..అస్తవ్యస్తాలుగా కనుపించు నీ లీలలు
ఏ అర్థమున్నదో..ఏసత్యమున్నదో
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో..ఓఓ..
పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో
ఏనాటి రుణమునూ తీర్చుకోంటున్నావో
రెండుప్రేమల మధ్య బండగా మారావు
స్వామీ..రెండుప్రేమల మధ్య బండగా మారావు
రేపులేని నీకు దోపిడి ఎందుకో..ఓఓ..
తెలియనివారికి తెలుపర స్వామీ
కన్నులపొరలను తొలగించవేమి
ఏడు కొండలపైన ఏలవెలిసావు
ఎవరికీ అందక ఎందుకున్నావు
No comments:
Post a Comment