పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్‌నాగేంద్ర
రచన::వేటూరి
గానం::P.సుశీల
మనసెరిగినవాడు మా దేవుడూ
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడు
ఎరిగిన వారికి ఎదలో ఉన్నాడు
ఎరుగని వారికి ఎదుటే ఉన్నాడు
మానవుడై పుట్టి మాధవుడై నాడు..ఆ..
తలచిన వారికి తారకరాముడు
పిలిచిన పలికే చెలికాడు సైబోడు
కోలువై ఉన్నాడు కోదండరాముడు
మన తోడుగా..నీడగా..రఘురాముడు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ
కడకు బోయను ఆది కవిని చేసిన పేరు
గరళ కంఠుని నోట తరలి వచ్చిన పేరు
ఇహపర సాధనకు ఇరువైన పేరు
శబరి ఎంగిలి గంగా తానమాడిన పేరు
హనుమ ఎదలొ భక్తి ఇనుమడించిన పేరు
రామ రామ అంటే కామికమే తీరు
కలకాలము మమ్ము కాపాడు పేరు
మనసెరిగినవాడు మా దేవుడూ శ్రీరాముడూ
మధుర మధుర తర శుభనాముడు..గుణధాముడు
No comments:
Post a Comment