Monday, September 22, 2008
అద్రుష్టవంతులు--1969
రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
కన్నెబుగ్గకు సిగ్గుకమ్మెను కళ్ళుచూస్తే కైపులెక్కెను
కన్నెబుగ్గకు సిగ్గుకమ్మెను కళ్ళుచూస్తే కైపులెక్కెను
కాపురానికి కొత్తవాళ్ళం కాడిమోయని కుర్రవాళ్ళం
కళలు తెలిసిన చిలిపివాడా కలుపరా మము కలువరేడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
కంటికింపు జంటలంటే వెంటపడతావంట నువ్వు
కంటికింపు జంటలంటే వెంటపడతావంట నువ్వు
తెల్లవార్లూ చల్లచల్లని వెన్నెలతో వేపుతావట
తెల్లవార్లూ చల్లచల్లని వెన్నెలతో వేపుతావట
మత్తు తెలిసిన చందురూడ మసక వెలుగే చాలులేరా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
అల్లుకున్న మనసులున్నవీ అలసిపోని బంధమున్నది
అల్లుకున్న మనసులున్నవీ అలసిపోని బంధమున్నది
చెలిమినాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
చెలిమినాటిన చిన్న ఇంట ఎదగనీ మా వలపు పంట
తీపివాక్కుల చందురూడ కాపువై నువ్ వుండిపోరా
కోడికూసే జాముదాకా తోడు రారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు తరుముతున్నవి అందగాడా
కోడికూసే జాముదాకా..తోడు రారా చందురూడా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment