Showing posts with label Music Director::S.P.Kodandapani. Show all posts
Showing posts with label Music Director::S.P.Kodandapani. Show all posts

Friday, March 13, 2015

కీలు బొమ్మలు--1965




సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర 
గానం::P.సుశీల 
Film Directed By::C.S.Rao 

తారాగణం::జమున,జగ్గయ్య,వాసంతి,గుమ్మడి,చలం,సూర్యకాంతం,రమణారెడ్డి,కన్నాంబ

పల్లవి::

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హహహహా

చరణం::1

చీటికి మాటికి చెలరేగే..నీ నోటికి తాళం వేస్తాడు
చీటికి మాటికి చెలరేగే..నీ నోటికి తాళం వేస్తాడు
వెక్కిరింతు నీ వెటకారాలకు..టక్కున కళ్ళెం వేస్తాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హాహా

చరణం::2

మిడిసిపాటు ఇంకెన్నాళ్ళులే..నీ మెడలు వంచి ముడివేస్తాడు
చెప్పిన మాటలు వినకుంటే..ఏఏ..చెప్పిన మాటలు వినకుంటే
నీ చెవులు పట్టి ఆడిస్తాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు
మొగుడొస్తాడూ..ఊ..హాహా

చరణం::3

సిగ్గులతో తలవంచుకొనే..నీ బుగ్గమీద చిటికేస్తాడు
జరిగే కొలదీ ఎడమైతే..ఏఏ..జరిగే కొలది ఎడమైతే
నీ జడతో భరతం పడతాడూ

బొట్టు కాటుక పెట్టుకొనీ
పూవుల దండలు ముడుచుకొనీ
తూనీగల్లె ఎగిరేదాన..తొందరలోనె వస్తాడు

మొగుడొస్తాడూ..ఊ..హాహాహా

Keelubommalu--1965
Music::S.P.Kodandapani
Lyrics::Arudra
Singer::P.Suseela
Film Directed By::C.S.Rao 
Cast::Jamuna,Jaggayya,Vasanti,Gummadi,Chalam,Sooryakaantam,Ramanareddi,Kannamba.

:::::::::::::::::::

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..hahahahaa

::::1

chiiTiki maaTiki chelarEgE..nee nOTiki taaLam vEstaaDu
chiiTiki maaTiki chelarEgE..nee nOTiki taaLam vEstaaDu
vekkirintu nee veTakaaraalaku..Takkuna kaLLem vEstaaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..haahaa

::::2

miDisipaaTu inkennaaLLulE..nee meDalu vanchi muDivEstaaDu
cheppina maaTalu vinakunTE..EE..cheppina maaTalu vinakunTE
nee chevulu paTTi ADistaaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu
moguDostaaDuu..uu..haahaa

::::3

siggulatO talavanchukonE..nee buggameeda chiTikEstaaDu
jarigE koladii eDamaitE..EE..jarigE koladi eDamaitE
nee jaDatO bharatam paDataaDuu

boTTu kaaTuka peTTukonii
poovula danDalu muDuchukonii
tooniigalle egirEdaana..tondaralOne vastaaDu

moguDostaaDuu..uu..haahaahaa

Friday, January 30, 2015

పండంటి కాపురం--1972













సంగీతం::S.P.కోదండపాణి 
రచన::దాశరథి
గానం::ఘంటసాల 
తారాగణం::S.V.రంగారావు,కృష్ణ,విజయనిర్మల,గుమ్మాడి,జమున,ప్రభాకర్రెడ్డి B.సరోజాదేవి,జయసుధ, 

పల్లవి::

బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ 
కలతలులేనీ నలుగురు కలిసీ సాగించారూ పండంటి కాపురం
బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ
   
చరణం::1
    
కన్నకలలు అన్నీకూడ కల్లలాయెనే 
అన్నతమ్ము లొకటనుట అడియాసే ఆయెనే 
గూటిలోని ఆ గువ్వలు ఎగిరిపోయెనే 
స్వర్గమంటి ఇల్లంతా నరకంగా మారెనే       
ఆ కలిమీ ఆ బలిమీ కథగామారె కలతే మిగిలే 
ఈనాడు ఏనాటికి ఏమౌనో ఎవరికి తెలుసూ
విధిరాసిన రాతకు తిరుగే లేదూ 

చరణం::2

బాబూ..ఊ 
బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ 
కలతలులేనీ నలుగురు కలిసీ సాగించారూ పండంటి కాపురం
బాబూ..వినరా..అన్నాతమ్ములా కథ ఒకటీ
బాబూ..బాబూ..

Monday, April 07, 2014

పెళ్ళికూతురు--1970



సంగీతం::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,రేలంగి,నాగభూషణం,కృష్ణంరాజు,అల్లురామలింగయ్య,రాజశ్రీ,గీతాంజలి,జానకి.

పల్లవి::

రాముని రూపమె మోహనము
రాముని రూపమె మోహనము
శ్రీ రాముని రూపమే మోహనమూ
రఘురాముని ధ్యానమే..జీవనమూ రాజ
రాముని నామమే పావనమూ

చరణం::1

కల్యాణ తిలకం మెరిసే..కల్యాణరామా
లోకానికి ప్రేమను చాటిన..సీతారామా
రామరాజ్యమే భువిలో నిలిచిన..రాజారామా
శృంగారం పొంగిపొరలే..సుందరరామా

రాముని రూపమె మోహనము
రఘురాముని ధ్యానమే..జీవనమూ రాజ
రాముని నామమే పావనమూ 

చరణం::2

దైవముగా తల్లిని కొలిచిన..కౌసల్యరామా
తండ్రి కొరకు రాజ్యం వీడిన..దశరథరామా 
శత్రువుల గుండెలు చెండిన..కోదండరామా
విజయంతో విశ్వం ఏలిన..శ్రీజయరామా

రాముని రూపమె మోహనము

చరణం::3

గుండెలలోని కోవలలోన..నిండుగ నిలిచిన శ్రీరామా..ఆ
శివకేశవుల బేధం లేక..భువిలో వెలసిన శివరామా..ఆ
రామజయం..శ్రీరామజయం..రాముని నమ్మితె లేదుభయం
రామజయం..శ్రీరామజయం..రామనామమే మనకభయం..మ్మ్
రాంరాం..ఆ..రాంరాం..ఆఆ..రాంరాం..

రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..ఆఆ
రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..ఆఆ
రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..రాంరాం..ఆఆ


Pellikooturu--1970
Music::S.P.Kodandapaani
Lyrics::Daasarathi
Singer::P.Suseela
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Relangi,Naagabhooshanam,KrishnamRaaju,Alluraamalingayya,Raajasree,jaanaki,Geetaanjali.

::::::::::::::::::::::::::::::::::::::::

raamuni roopame mOhanamu
raamuni roopame mOhanamu
Sree raamuni roopamE mOhanamuu
raghuraamuni dhyaanamE..jeevanamuu raaja
raamuni naamamE paavanamuu

::::1

kalyaaNa tilakam merisE..kalyaaNaraamaa
lOkaaniki prEmanu chaaTina..seetaaraamaa
raamaraajyamE bhuvilO nilichina..raajaaraamaa
SRngaaram pongiporalE..sundararaamaa

raamuni roopame mOhanamu
raghuraamuni dhyaanamE..jeevanamuu raaja
raamuni naamamE paavanamuu 

::::2

daivamugaa tallini kolichina..kousalyaraamaa
tanDri koraku raajyam veeDina..daSaratharaamaa 
Satruvula gunDelu chenDina..kOdanDaraamaa
vijayamtO viSwam Elina..Sreejayaraamaa

raamuni roopame mOhanamu

::::3

gunDelalOni kOvalalOna..ninDuga nilichina Sreeraamaa..aa
SivakESavula bEdham lEka..bhuvilO velasina Sivaraamaa..aa
raamajayam..Sreeraamajayam..raamuni nammite lEdubhayam
raamajayam..Sreeraamajayam..raamanaamamE manakabhayam..mm
raam^raam..aa..raam^raam..aaaaa..raam^raam..

raam^raam..raam^raam..raam^raam..raam^raam..raam^raam..aaaaa
raam^raam..raam^raam..raam^raam..raam^raam..raam^raam..aaaaa
raam^raam..raam^raam..raam^raam..raam^raam..raam^raam..aaaaa

Friday, January 03, 2014

కథానాయిక మొల్ల --1970::చక్రవాకం::రాగం




సంగీతం::S.P.కోదండపాణి
రచన::సినారె 
గానం::P.సుశీల 

చక్రవాకం::రాగం

పల్లవి::

రఘుకుల తిలకా
నీ ఆనతి..రచియించితి..రామాయణ సత్కృతి
ఆకృతి వరియించిన..పతివి నీవే
అతులిత కైవల్య..గతివి నీవే..ఆ ఆ ఆ ఆ ఆ 

జగమే రామమయం..మనసే
అగణిత తారక నామ..మయం
జగమే రామమయం..మనసే
అగణిత తారక నామ..మయం
జగమే రామమయం..

చరణం::1

నీల జలద రమణీయ..రూపం
నిగమాంచల మందిర..మణిదీపం
నీల జలద రమణీయ..రూపం
నిగమాంచల మందిర..మణిదీపం
సుందర జానకీ వందిత..చరణం
సుందర జానకీ వందిత..చరణం
సురముని శరణం..భవతాప హరణం

జగమే రామమయం..మనసే
అగణిత తారక నామ..మయం
జగమే రామమయం..మనసే

చరణం::2

ఆ చిరునవ్వే అమృతపు జల్లు
ఆ చిరునవ్వే అమృతపు జల్లు
అఖిల జగములేలు ఆచేతి విల్లు
అఖిల జగములేలు ఆచేతి విల్లు
అతని గానమున అలరారుకావ్యం
అన్ని యుగాలకు నవ్య్యాతి నవ్యం

జగమే రామమయం..

చరణం::3

ఎవని కమల కమనీయ పదము 
చూపించె అహల్యకు ముక్తి పదము
రాం రాం రాం రాం..
ఎవని చంద్రిక మృదుల కరము! అం
దించెను శబరికి దివ్యవరము
రాం రాం రాం రాం.. 
ఎవని ఏలుబడి ఇంటికొక్క గుడి నిలిపెనో
ఎవని రాజ్యమే రామరాజ్యమై వెలసెనో
ఆ రాముడు నా అంతరంగమున నిండగా
అహము మరచి, ఈ యిహము మరచి
జన్మాంతర బంధములెల్ల విడిచి
ఆ మహర్జ్యోతిలో లీనము కానా
ఆ మహా ప్రభునిలో లీనము కానా
ఓ రామా! రఘురామా! కైవల్య రామా!

Monday, July 29, 2013

అందం కోసం పందెం--1971















Naaloni Swapanaala - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి 
రచన::G.కృష్ణమూర్తి
గానం::P..సుశీల,ఘంటసాల
తారాగణం::కాంతారావు, కాంచన, భారతి, విజయలలిత, రాజనాల, రాజబాబు 

పల్లవి::

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

చరణం::1

తెల్లని జాబిల్లి..తలపే నీవు 
చల్లని గాలిలోని..చలువే నీవు
మాటావు నీవైన..భావమే నేను 
మాటావు నీవైన..భావమే నేను 
పాటవు నీవైన..రాగమే నేను 
పాటవు నీవైన..రాగమే నేను..ఊ.. 
మనలో వలపే..వరమై వెలసే 

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

చరణం::2

రెప్పలు రెండైనా..కన్నొకటేగా 
కన్నులు రెండైనా..చూపొకటేగా 
పెదవులు రెండైనా..పదమొకటేగా 
పెదవులు రెండైనా..పదమొకటేగా 
మేనులు రెండైనా..మనసొకటేగా 
మేనులు రెండైనా..మనసొకటేగా..ఆ 
మనలో వలపే..వరమై వెలసే 

నాలో నీ స్వప్నాల..అందాలే నీవు 
నాకోసమేనా..దిగివచ్చినావు

Andam Kosam Pandem--1971
Music::S.P.Kodandapani
Lyrics::G.Krishnamurthy
Singer's::Ghantasala,P.Suseela
Cast::KantaRao,Kanchana,Bharati,Vijayalalita,Rajanala,RajaBAbu

:::

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavu

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavu

:::1

Thellani jaabilli..thalape neevu 
challani gaaliloni..chaluve neevu
Maatavu neevaina..bhaavame nenu 
Maatavu neevaina..bhaavame nenu 
Paatavu neevaina..raagame nenu 
Paatavu neevaina..raagame nenu 
Manalo valape..varamai velase 

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavuu

:::2

Reppalu rendainaa..kannokategaa 
kannulu rendainaa..choopokategaa
Pedavulu rendainaa..padamokategaa 
Pedavulu rendainaa..padamokategaa
Menulu rendainaa..manasokategaa 
menulu rendainaa..manasokategaa
Manalo valape..varamai velase 

Naalo nee swapnaala..andaale neevu 
naakosamenaa..digivachchinaavu

Wednesday, May 29, 2013

అందం కోసం పందెం--1971


Ra Ra Ra - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి
రచన::శ్రీ శ్రీ
గానం::S.జానకి
తారాగణం::కాంతారావు,కాంచన,భారతి,విజయలలిత,రాజనాల,రాజబాబు 

పల్లవి::

రా రా రా..అంది వెన్నెల 
రా రా రా..అంది వెన్నెల 
కూ కూ కూ..అంది కోయిల
రా రా రా..అంది వెన్నెల 
కూ కూ కూ..అంది కోయిల
సై సై సై..అంది యవ్వనం 
హాయ్ హాయ్ హాయ్..అంది జీవితం 
రా రా రా..అంది వెన్నెల 
కూ కూ కూ..అంది కోయిల

చరణం::1

విలాస వేళ కదా..జాల మేల 
ఇదే విరిసెను..నీకోసం పూలబాల     
విలాస వేళ కదా..జాల మేల 
ఇదే విరిసెను..నీకోసం పూలబాల          
పెదవులు వణికెనె.సిగ్గులు తొణికెనె 
ముసిముసినవ్వులే..గుసగుసలాడగ
కాలమే పాడెనే..వలపులె ఆడెనే 
రా రా రా..అంది వెన్నెల 
కూ కూ కూ..అంది కోయిల

చరణం::2     

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ 
నిన్న లేదు రేపు రాదు 
నిన్న లేదు రేపు రాదు 
నన్ను నీవు వీడ లేవు 
వింతల రేయిది అంతమె లేనిదీ 
కాంతుని కౌగిలిలో నేనె తూలగ
కాలమే ఆగెనే వలపులే రేగెనే 
రా రా రా..అంది వెన్నెల 
కూ కూ కూ..అంది కోయిల
సై సై సై..అంది యవ్వనం 
హాయ్ హాయ్ హాయ్..అంది జీవితం 
రా రా రా..అంది వెన్నెల 
కూ కూ కూ..అంది కోయిల

Wednesday, May 15, 2013

అందం కోసం పందెం--1971


Kannu Chithare Kanni Vayase - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి
రచన::వీటూరి 
గానం::P.సుశీల 
తారాగణం::కాంతారావు,కాంచన,భారతి,విజయలలిత,రాజనాల,రాజబాబు 

పల్లవి::

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం
ఆ సంగీతానికి శృతి జతచేస్తే శృంగారంగ మారేను 
యీ కన్నెకు తగిన కాంతుడువస్తే గారాలన్నీ తీరేను
హోయ్..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్నుచెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం

చరణం::1

చిరు గాలి కూడా సెగలాయే నమ్మా 
యీ వింత యేమో వివరించుమా
చిరు గాలి కూడా సెగలాయే నమ్మా 
యీవింత యేమో వివరించుమా 
అది కాముడు చేసే దాడి విరిశరములు 
ఎంతో వాడి తొలివయసున కలిగే వేడి
ఆ..ఆపలేని మైకమే ఓపలేని మోహమే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం

చరణం::2

నా తనువు తూలే నయనాలు సొలే 
లోలోన ఏవో పులకింతలే
నా తనువు తూలే నయనాలు 
సొలే లోలోన ఏవో పులకింతలే
ప్రతి కన్నెకు ఇది సహజములే 
పతి కౌగిలితో నయమగులే
నీ ముచ్చటలన్నీ తీరునులే 
ఆ..తీయనైనా వేదనా మధురమైనా భావనా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కన్ను చెదరే కన్నె వయసే వేడి జలపాతం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆలలు రేపి కలలు చూపి పాడినది సంగీతం

Tuesday, May 14, 2013

అందం కోసం పందెం--1971


Dhaname Kalalandu Kadumina - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.జానకి
తారాగణం::కాంతారావు,కాంచన,భారతి,విజయలలిత,రాజనాల,రాజబాబు 

పల్లవి::

గానమే కళలందు కడుమిన్నా..ఆఆ 
గానమె కళలందు కడుమిన్నా 
అల..ఆ..భువిలో దివిలో ఎవరేమన్నా 
సామగాన శుద్దిసాటి రాదుకదే 
విలాస కలాప గరిమ ఏదైనా

నాట్యమె కళలందు కడుమిన్నా 
అల..ఆ..కలలో యిలలో ఎవరేది కన్నా
జీవలాలస్యకర జీలు రాదుకద 
వినోద నినాద పతిమయేదైనా 
నాట్యము కళలందు కడుమిన్నా 

చరణం::1

నాదమే ప్రధానము..నాదమే ప్రధానము 
నాదమే ప్రధానము..నాదమే ప్రధానము
సంగీత సంజాత మీ సకల విశ్వము 
సంగీత సంజాత మీ సకల విశ్వము

భ్రమణమే సృజనమూ..భ్రమణమే సృజనమూ
నటరాజ చరణాల..కంపనమే సర్వమూ 
నటరాజ చరణాల..కంపనమే సర్వమూ
సప్తస్వరములే..నిఖిలాదారము 
సప్తతాళములే..స్వరముల జీవము 
గళరుత రహితము..జగాల జపమే 
కదలిక లేనిదీ...నిర్జీవ ప్రతిమె 
గానమె కళలందు..కడుమిన్న

పమపదని సరిగ నిసరిగ 
ధనిసరిగా రిసనిధ పదా
పదని ధనిసా నిసరీని గరిసరీ 
గరిసరీ దనీ రిసానిధపా దా గమపదని 
గానమే కళలందు కడుమిన్నా 

గరి సపద నిగరిగరి నీని 
నిరిసరిసదాద దసనిసని మామ
గమ పధనీస గరినిరినీధ నిమాపదని 
గారిసనిధ రిసానిధప గామాపదని
నాట్యమే కళలందు కడుమిన్నా 

ససానిదపామగా రిరి సనిధపమా
గమగరిగదప పదపపమ పసినీ 
దనిని నిసాససరి గమధపమదా పదన
దనిగరిని సానిసగరిసరి సగరిసని 
గరిసనిసా రిసానిదాని దానిదపాదా 
గరిసనిదనిసా రిసనిదపదాని గమపదని

అందం కోసం పందెం--1971


Chelli Nee - Andam Kosam Pandem by Cinecurry

సంగీతం::S.P.కోదండపాణి
రచన::వీటూరి 
గానం::P.సుశీల 
తారాగణం::కాంతారావు,కాంచన,భారతి,విజయలలిత,రాజనాల,రాజబాబు 

పల్లవి::

ఆ  ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చెలి నీదోయి...యీ రేయి
ఇక రావోయీ...ఓ రసపాయి
చెలి నీదోయి...యీ రేయి 
ఇక రావోయీ...ఓ రసపాయి 
మోహమే తీరగా..హాయిగా ఏలుకోవోయీ..ఈ 
చెలి నీదోయి...యీ రేయి 
ఇక రావోయీ...ఓ రసపాయి 

చరణం::1

పరువము నేడే..ఘుమఘుమలాడే 
కనులే ఏవో...కథలే పాడే
పరువము నేడే..ఘుమఘుమలాడే 
కనులే ఏవో...కథలే పాడే 
అందని అందము..విందులు చేసేనా..ఆ
నా బిగి కౌగిట...బంధీ చేసేనా..ఆ 
సురలోకభోగాలు...చవిచూపనా
చెలి నీదోయి...యీ రేయి 
ఇక రావోయీ...ఓ రసపాయి 

చరణం::2

వదలగరానీ...వెన్నెలవేళా 
వగలే సెగలై...రగిలేజ్వాల
వదలగరానీ...వెన్నెలవేళా 
వగలే సెగలై...రగిలేజ్వాల
అధర సుధారస..ధారలముంచేనా..ఆ 
నాఒడిలోనిను..ఊయలలూచేనా..ఆ
సుఖమందు..శిఖరాలు చూపించనా
చెలి నీదోయి...యీ రేయి 
ఇక రావోయీ...ఓ రసపాయి
మోహమే తీరగా..హాయిగా ఏలుకోవోయీ..ఈ
చెలి నీదోయి...యీ రేయి 
ఇక రావోయీ...ఓ రసపాయి 

Vathalaga rani - Andam Kosam Pandem by Cinecurry

అందం కోసం పందెం--1971 
సంగీతం::S.P.కోదండపాణి
రచన::వీటూరి 
గానం::సుశీల
తారాగణం::కాంతారావు,కాంచన,భారతి,విజయలలిత,రాజనాల,రాజబాబు 

పల్లవి::

వదలగరానీ వెన్నెలవేళా 
వగలే సెగలై రగిలేజ్వాల
వదలగరానీ వెన్నెలవేళా 
వగలే సెగలై రగిలేజ్వాల

అధర సుధారస ధారలముంచేనా..ఆ 
నాఒడిలోనిను ఊయలలూచేనా..ఆ
సుఖమందు శిఖరాలు చూపించనా..ఆ
చెలి నీదోయి...యీ రేయి 
ఇక రావోయీ...ఓ రసపాయి
మోహమే తీరగా..హాయిగా ఏలుకోవోయీ..ఈ
చెలి నీదోయి...యీ రేయి 

ఇక రావోయీ...ఓ రసపాయి

Wednesday, May 08, 2013

నేనంటే నేనే--1968



సంగీతం::S.P.కోదండపాణి 
రచన::అప్పలాచార్య  
గానం::S.P.బాలు,కౌసల్య
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ. 

పల్లవి::

రేయ్..బలె బలె బలె బలె..బలె బలె బలె బలె
నరసింగ సామినిరా..నిన్ను నరక్క తింటారా
బలె బలె బలె బలె..బలె బలె బలె బలె
హిరణ్య కసిపుడరా..నిన్నూ యిరసక తింటారా
ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ ఢమ 
పిస్టలు వీరునిరా..ఇక నీ ఇష్టము సాగదురా
కట కట కట కట కట కట కట కట
చచ్చిన వాడినిరా..నీకై మళ్ళీ బతికారా 
ఏయ్.....ఏయ్.....ఏయ్.....

చరణం::1

మామ మామా మామా మామ మామా మామా
పట్టుకొంటె కందిపోయే పువ్వులాంటి బిడ్డనలా
నీళ్ళలోకి నెడ్తావు..మతిలేదా 
నిన్ను తన్నకుండా విడిచిపెడితే..తప్పుకాదా    
మామ మామా మామా మామ మామా మామా
మామ మామా మామా మామ మామా మామా

చరణం::2

నెత్తిమీద గుడ్డవేసి..చెత్త మొహందాచుకొన్న సోమారీ
ఒరే..ఒరే..ఒరే..ఒరే..సోంబేరీ
పందికొక్కులాగ బలిసి..పాడుపన్లు నేర్చుకొన్న ఏబ్రాసీ
ఒరే..ఒరే..ఒరే..ఒరే..సన్యాసీ

దున్న పోతా...బేబి నివ్వూ 
తిండి పోతా...బేబి నివ్వూ..ఊఊఊ 
తాగుబోతా...బేబి నివ్వూ

నెత్తిమీద గుడ్డవేసి..చెత్త మొహందాచుకొన్న సోమారీ
ఒరే..ఒరే..ఒరే..ఒరే..సోంబేరీ

చరణం::3

నీ బంగారు చేతులు..కందేను పాపం
ఎందుకు ఆ..రాయి..టక్కరిదానా..ఆ..నిన్నొదులుతానా

అనుకొన్నదొకటి..అయ్యేదిఒకటి 
బోల్తా కొడ్తావులే..బుల్ బుల్ పిట్టా..ఏహేY
అనుకొన్నదొకటి..అయ్యేదిఒకటి 
బోల్తా కొడ్తావులే..బుల్ బుల్ పిట్టా

కత్తి గుండెల్లో..దిగబోదులే
ఉత్త డ్రామాల..సరుకేనులే
కత్తి గుండెల్లో..దిగబోదులే
ఉత్త డ్రామాల..సరుకేనులే

ఏమారిపోతివి...చాలా..నామీద కోపమదేలా
నీ మూతి మీసము కాలా..ఏ మాత్రమూ నిన్ను విడజాలా
హేండ్సప్....హేండ్సప్...హేండ్సప్....హేండ్సప్...హేండ్సప్..హేండ్సప్

Nenante Nene--1968
Music::S.P.Kodandapaani
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,Kousalya
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,NellooruKaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala.

::::::::::::::::::::::::::::::::::::::::::

rEy..bale bale bale bale..bale bale bale bale
narasinga saaminiraa..ninnu narakka tinTaaraa
bale bale bale bale..bale bale bale bale
hiraNya kasipuDaraa..ninnuu yirasaka tinTaaraa
Dhama Dhama Dhama Dhama Dhama Dhama Dhama Dhama 
pisTalu veeruniraa..ika nee ishTamu saagaduraa
kaTa kaTa kaTa kaTa kaTa kaTa kaTa kaTa
chachchina vaaDiniraa..neekai maLLii batikaaraa 
Ey.....Ey.....Ey.....

::::1

maama maamaa maamaa maama maamaa maamaa
paTTukonTe kandipOyE puvvulaanTi biDDanalaa
neeLLalOki neDtaavu..matilEdaa 
ninnu tannakunDaa viDichipeDitE..tappukaadaa    
maama maamaa maamaa maama maamaa maamaa
maama maamaa maamaa maama maamaa maamaa

::::2

nettimeeda guDDavEsi..chetta mohamdaachukonna sOmaarii
orE..orE..orE..orE..sOmbErii
pandikokkulaaga balisi..paaDupanlu nErchukonna Ebraasii
orE..orE..orE..orE..sanyaasii

dunna pOtaa...bEbi nivvuu 
tinDi pOtaa...bEbi nivvuu..uuuuuu 
taagubOtaa...bEbi nivvuu

nettimeeda guDDavEsi..chetta mohamdaachukonna sOmaarii
orE..orE..orE..orE..sOmbErii

::::3

nee bangaaru chEtulu..kandEnu paapam
enduku aa..raayi..Takkaridaanaa..aa..ninnodulutaanaa

anukonnadokaTi..ayyEdiokaTi 
bOltaa koDtaavulE..bul bul piTTaa..EhEY
anukonnadokaTi..ayyEdiokaTi 
bOltaa koDtaavulE..bul bul piTTaa

katti gunDellO..digabOdulE
utta Draamaala..sarukEnulE
katti gunDellO..digabOdulE
utta Draamaala..sarukEnulE

EmaaripOtivi...chaalaa..naameeda kOpamadElaa
nee mooti meesamu kaalaa..E maatramuu ninnu viDajaalaa
hEnDsap....hEnDsap...hEnDsap....hEnDsap...hEnDsap..hEnDsap

Friday, April 26, 2013

నేనంటే నేనే--1968



సంగీతం::S.P.కోదండపాణి 
రచన::కోసరాజు  
గానం::మాధవపెద్ది సత్యం,L.R.ఈశ్వరీ  
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ. 

పల్లవి::

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో

చరణం::1

అల్లూరిలో వున్న..పోలేరమ్మా
అనకాపల్లిన వున్న..నూకాలమ్మా
కలకత్తా మహంకాళి..వచ్చిందమ్మా
గండ్రగొడ్డలి బట్టి..నిలిచిందమ్మా 
కాట్టేరి కూతురికి..కల్యాణమా..
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో 

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో..హా

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో

చరణం::2

పళ్ళకోతి పోతురాజు..పెల్లికొడుకువా
పట్టలమ్మ పుట్టలమ్మ..తోడబుడితివా
వక్కలాకులందుకోను..వచ్చి యుంటివా
గంటలమ్మ మెడకు..తాళి గట్టవస్తివా
అబ్బబ్బ్బ నీ సోకు..చూప వస్తివా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో 

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో..హా

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో

అంబవో శక్తివోహో..అంకాళ దేవివో
మా ఊర వెలసినా..జడల మారెమ్మవో

చరణం::3

ఓఓఓఓఓహో..ఆగు....
తప్పెట్లు తాళాలు..ధింధిమ్మి మ్రోగంగ 
ఉగ్రంగ తాండవం..చేయాలమ్మా
సాంబ్రాణి గుగ్గిలం..ధూపాలు వేయంగ
శివమెక్కి నాట్యాలు..చెయ్యాలమ్మా

అహా..తప్పెట్లు తాళాలు..ధింధిమ్మి మ్రోగంగ 
ధింధిమ్మి మ్రోగంగ 
అహా..ఉగ్రంగ తాండవం..చేయాలమ్మా
చేయాలమ్మా
సాంబ్రాణి గుగ్గిలం..ధూపాలు వేయంగ
ధూపాలు వేయంగ
శివమెక్కి నాట్యాలు..చెయ్యాలమ్మా
చెయ్యాలమ్మా..ఆ

చరణం::4

వేప మండల్ని....మెడవెయ్యనా
గావు గొర్రెల్ని..బలి ఇవ్వనా
వేప మండల్ని....మెడవెయ్యనా
గావు గొర్రెల్ని..బలి ఇవ్వనా 
దేవి ఆవేశం...తగ్గించవా
తల్లి నీ శివం..చాలించవా
దేవి ఆవేశం...తగ్గించవా
తల్లి నీ శివం..చాలించవా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 
దిక్కులేని కన్నెలను..ఊహూ..మొక్కుకునే పడుచులనూ..అవునూ  
దిక్కులేని కన్నెలను..మొక్కుకునే పడుచులనూ   
కాపాడే అమ్మవే..కాళీయమ్మా
ఇనుము కరుగ..నిప్పుంది..నిప్పుందీ..ఈ
మురికి కడుగ నీరుంది..నీరుందీ..ఈ
ఇనుము కరుగ..నిప్పుందీ..మురికి కడుగ నీరుంది 
మనసు కరుగు..మార్గమేదో చెప్పాలమ్మా 
మనసు కరుగు..మార్గమేదో చెప్పాలమ్మా 

అంబా నీవే అలిగిననూ..కుంభిని కుప్పగ కూలుగదే
కాళీ నీవే ఉరిమిననూ..ఫెళ ఫెళ పిడుగులు రాలుగదే
అంబా నీవే అలిగిననూ..కుంభిని కుప్పగ కూలుగదే
కాళీ నీవే ఉరిమిననూ..ఫెళ ఫెళ పిడుగులు రాలుగదే 
జిగి జిగి చింతన...చిందులు దొక్కు
భగ భగ భగ్గున...మంటలు గక్కు
ఇష్టం కాని ఎదిరి మూకలను..వీపులు చిట్లగ గొట్టు..గొట్టు 
ధీంతనక్క..అహా..ధీంతనక్క..అహా..ధీంతనక్క..ఆ..ధీంతనక్క
దిగు దిగనూ..ఏయ్..దిగవా..దిగుతా
పోతావా పోవా..పోతానూ..పోతానూ..పోతానూ..పోతానూ..పోదాం


Nenante Nene--1968
Music::S.P.Kodandapaani
Lyrics::Kosaraaju 
Singer's::Maadhavapeddi,L.R.Iswarii
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,NellooruKaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala.

::::::::::::::::::::::::::::::::::::::::::

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO

::::1

alloorilO vunna..pOlErammaa
anakaapallina vunna..nookaalammaa
kalakattaa mahankaaLi..vachchindammaa
ganDragoDDali baTTi..nilichindammaa 
kaaTTEri kooturiki..kalyaaNamaa..
O O O O O O O O O O OhO 

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO..haa

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO

::::2

paLLakOti pOturaaju..pellikoDukuvaa
paTTalamma puTTalamma..tODabuDitivaa
vakkalaakulandukOnu..vachchi yunTivaa
ganTalamma meDaku..taaLi gaTTavastivaa
abbabbba nee sOku..choopa vastivaa
O O O O O O O O O O OhO 

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO..haa

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO

aMbavO SaktivOhO..ankaaLa dEvivO
maa Ura velasinaa..jaDala maaremmavO

::::3

OOOOOhO..Agu....
tappeTlu taaLaalu..dhimdhimmi mrOganga 
ugranga taanDavam..chEyaalammaa
saambraaNi guggilam..dhoopaalu vEyanga
Sivamekki naaTyaalu..cheyyaalammaa

ahaa..tappeTlu taaLaalu..dhimdhimmi mrOganga 
dhimdhimmi mrOganga 
ahaa..ugranga taanDavam..chEyaalammaa
chEyaalammaa
saambraaNi guggilam..dhoopaalu vEyanga
dhoopaalu vEyanga
Sivamekki naaTyaalu..cheyyaalammaa
cheyyaalammaa..aa

::::4

vEpa manDalni....meDaveyyanaa
gaavu gorrelni..bali ivvanaa
vEpa manDalni....meDaveyyanaa
gaavu gorrelni..bali ivvanaa 
dEvi AvESam...tagginchavaa
talli nee Sivam..chaalinchavaa
dEvi AvESam...tagginchavaa
talli nee Sivam..chaalinchavaa
O O O O O O O O O O O O O O 
dikkulEni kannelanu..Uhuu..mokkukunE paDuchulanuu..avunoo  
dikkulEni kannelanu..mokkukunE paDuchulanuu   
kaapaaDE ammavE..kaaLiiyammaa
inumu karuga..nippundi..nippundii..ii
muriki kaDuga neerundi..neerundii..ii
inumu karuga..nippundii..muriki kaDuga neerundi 
manasu karugu..maargamEdO cheppaalammaa 
manasu karugu..maargamEdO cheppaalammaa 

ambaa neevE aliginanoo..kumbhini kuppaga koolugadE
kaaLii neevE uriminanuu..pheLa pheLa piDugulu raalugadE
ambaa neevE aliginanoo..kumbhini kuppaga koolugadE
kaaLii neevE uriminanuu..pheLa pheLa piDugulu raalugadE 
jigi jigi chintana...chindulu dokku
bhaga bhaga bhagguna...manTalu gakku
ishTam kaani ediri mookalanu..veepulu chiTlaga goTTu..goTTu 
dhiintanakka..ahaa..dhiintanakka..ahaa..dhiintanakka..aa..dhiintanakka
digu diganoo..Ey..digavaa..digutaa
pOtaavaa pOvaa..pOtaanuu..pOtaanuu..pOtaanuu..pOtaanuu..pOdaam

Wednesday, April 24, 2013

నేనంటే నేనే--1968



సంగీతం::S.P.కోదండపాణి 
రచన::D.C.నారాయణరెడ్డి  
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణంరాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ. 

పల్లవి::

చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు
ఎందులోనూ..లేని సుఖం 
పొందులోనే..ఉంది నిజం
ఈ పొందులోనే..ఉంది నిజం
చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు 

చరణం::1

కనులూ కనులూ..కలుపుటకు..ఊఊఊ 
మనసులోనిది..తెలుపుటకు..ఊఊఊఊ 
వలపుల..ఊయలూగుటకు
కలల కడలిలో..తేలుటకు
అందరాని స్వర్గమేదో ఇందులోనే అందుటకు
ఇందులోనే..అందుటకు

చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు 

చరణం::2

వానకు తడిసిన మేనిలో..ఓ..ఓ..ఓ
వెచ్చని కోరికలూరగా..ఆ ఆ..ఆ
ఎన్నడు తీరని ఆశలూ..అన్నీ నేడే తీరగా
ఎన్నడు తీరని ఆశలూ..అన్నీ నేడే తీరగా
కానరాని అందమంతా..కనులముందే నిలువగా

చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు
చాలదా ఈ చోటు..రాదులే ఏ లోటు 

చరణం::3

చెక్కిలి చెక్కిలి చేరగా..ఆ..ఆ..ఆ..ఆ
ఏవో గుసగుసలాడగా..ఆ..ఆ..ఆ..ఆ

ఉరుముల మెరుపుల..జోరులో 
హృదయాలొకటై..సోలగా..ఆ
మనకు తెలియని..మైకం లోనా 
మనము ఒకటై పోవగా..మనము ఒకటై పోవగా

Nenante Nene--1968
Music::S.P.Kodandapaani
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,Nellooru KaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala.

::::::::::::::::::::::::::::::::::::::::::

chaaladaa ii chOTu..raadulE E lOTu
chaaladaa ii chOTu..raadulE E lOTu
endulOnuu..lEni sukham 
pondulOnE..undi nijam
ii pondulOnE..undi nijam
chaaladaa ii chOTu..raadulE E lOTu 

::::1

kanuluu kanuluu..kalupuTaku..uuuuuu 
manasulOnidi..telupuTaku..uuuuuuuu 
valapula..UyaluuguTaku
kalala kaDalilO..tEluTaku
andaraani swargamEdO indulOnE anduTaku
indulOnE..anduTaku

chaaladaa ii chOTu..raadulE E lOTu
chaaladaa ii chOTu..raadulE E lOTu 

::::2

vaanaku taDisina mEnilO..O..O..O
vechchani kOrikalooragaa..aa aa..aa
ennaDu teerani aaSaluu..annii nEDE teeragaa
ennaDu teerani aaSaluu..annii nEDE teeragaa
kaanaraani andamantaa..kanulamundE niluvagaa

chaaladaa ii chOTu..raadulE E lOTu
chaaladaa ii chOTu..raadulE E lOTu 

::::3

chekkili chekkili chEragaa..aa..aa..aa..aa
EvO gusagusalaaDagaa..aa..aa..aa..aa

urumula merupula..jOrulO 
hRdayaalokaTai..sOlagaa..aa
manaku teliyani..maikam lOnaa 
manamu okaTai pOvagaa..manamu okaTai pOvagaa

నేనంటే నేనే--1968



సంగీతం::S.P.కోదండపాణి 
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::V.Raamachandra Rao
తారాగణం::కృష్ణ,జగ్గయ్య,నాగభూషణం,కృష్ణమ్రాజు,చంద్రమోహన్,నెల్లూరుకాంతారావు,రావికొండలరావు,K.V.చలం,కాంచన,సంధ్యారాణి,శ్రీరంజని,రాధాకుమారి,సూర్యకాంతం,సుంకర్లలక్ష్మి,రాజేశ్వరి,మధుమతి,విద్యశ్రీ,బేబిశాంతికళ.

పల్లవి::

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో 

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో 

క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 

చరణం::1

సిరి కోరి నను చేరి..తెరచాటునా..ఆ 
చెలికాడు ఆడేను..దోబూచులే..ఏఏఏ 
సిరి కోరి నను చేరి తెరచాటునా..ఆ 
చెలికాడు ఆడేను దోబూచులే..ఏఏఏ 

కన్నులకు..తెలియనిది 
కమ్మని మనసుకు..తెలియనులే 
అల్లరిలో ఆటలలో..చల్లని మనసే దాగెనులే 

క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 

ఒకే ఒక గులాబికై వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో 

చరణం::2

కోనేట కలహంస..ఎటు ఈదినా 
తీరాన నా చెంత..చేరాలిలే  
తళతళలు దక్కవులే..దారిన పోయే దానయ్య 
వెలలేని మక్కువలు..నోచిన వాని ధనమయ్యా

ఒకే ఒక గులాబికై..వాలిన తుమ్మెదలెన్నెన్నో 
ఒకే ఒక కోరిక..రేపిన వింతలు ఎన్నెన్నో 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 
క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్ క్వాక్..ఆ 

Nenante Nene--1968
Music::S.P.Kodandapaani
Lyrics::D.C.Naaraayanareddi
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.Raamachandra Rao
Cast::Krishna,Jaggayya,Naagabhooshanam,Krishnamraaju,Chandramohan,Nellooru KaantaaRao,RaavukondalRao,K.V.Chalam,Kaanchana,Sandhyaaraani,Sreeranjani,Raadhaakumaari,Sooryakaantam,SunkarlaLakshmi,Raajeswari,Madhumati,Vidyasree,BabySaantiKala.

::::::::::::::::::::::::::::::::::::::::::

okE oka gulaabikai vaalina tummedalennennO 
okE oka kOrika rEpina vintalu ennennO 

okE oka gulaabikai vaalina tummedalennennO 
okE oka kOrika rEpina vintalu ennennO 

kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 

::::1

siri kOri nanu chEri..terachaaTunaa..aaaaaaa 
chelikaaDu aaDEnu..dOboochulE..EEE 
siri kOri nanu chEri terachaaTunaa..aaaaaaa 
chelikaaDu aaDEnu dOboochulE..EEE 

kannulaku..teliyanidi 
kammani manasuku..teliyanulE 
allarilO aaTalalO..challani manasE daagenulE 

kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 

okE oka gulaabikai vaalina tummedalennennO 
okE oka kOrika rEpina vintalu ennennO  

::::2

kOnETa kalahamsa..eTu iidinaa 
teeraana naa chenta..chEraalilE  
taLataLalu dakkavulE..daarina pOyE daanayya 
velalEni makkuvalu..nOchina vaani dhanamayyaa

okE oka gulaabikai vaalina tummedalennennO 
okE oka kOrika rEpina vintalu ennennO 

kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa  
kvaak kvaak kvaak kvaak kvaak kvaak..aa 

Monday, December 12, 2011

మంచి కుటుంబం--1967




సంగీతం::S.P.కోదండపాణి
రచన::ఆరుద్ర
గానం::P.సుశీల,S.జానకి,B.వసంత

పల్లవి::

తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు
తుళ్ళి తుళ్ళి పడ్తుంది..తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు..రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు

చరణం::1

బుగ్గ మీద కెంపులేవో..నిగ్గు లోలికి పోగా
బుగ్గ మీద కెంపులేవో..నిగ్గు లోలికి పోగా
సిగ్గులేవో నాలో..మొగ్గ తొడిగి రాగా
సిగ్గులేవో నాలో..మొగ్గ తొడిగి రాగా
సిరి మల్లెల పందిరి లోనా..నవమంగళ వేదిక పైనా
సిరి మల్లెల పందిరి లోనా..నవమంగళ వేదిక పైనా
జరిగేను కళ్యాణ వైభోగం 
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం::2

కోరుకున్న వరుడే చేరుకున్న వేళా..కోరుకున్న వరుడే చేరుకున్న వేళా
పొంగి పొంగి తానే చెంగులాగు వేళా..ఆ..పొంగి పొంగి తానే చెంగులాగు వేళా
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి
చల చల్లగ గంధం పూసి..మెల మెల్లగ కౌగిట దూసి
లతవోలే జత గూడి లాలింతునే 

తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు

చరణం::3

ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో..ఎంత గడుసువాడో ఎన్ని నేర్చినాడో
తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి..తెలుసుకోవే చెల్లి వలపు పాలవెల్లి
అతడెంతటి మొనగాడైనా..గిలి గింతల చెలికాడైనా
అతడెంతటి మొనగాడైనా..గిలి గింతల చెలికాడైనా
తొలి రేయి పరువాల...బంధింతునే

తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు
మళ్ళీ మళ్ళీ ఈ రోజు..రాదని తెలుసు
తుళ్ళి తుళ్ళి పడుతోంది..తొలకరి వయసు


Wednesday, November 23, 2011

అభిమానవంతులు--1973
























సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,V.రామకృష్ణ  
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు, శారద,అంజలీదేవి, రమాప్రభ 

పల్లవి::

ఉయ్యాలా..జంపాలా..ఉయ్యాలా..జంపాలా 
ఊగరా ఊగరా..ఆఆఆఆఆ..హోయ్
ఊగరా ఊగరా...అందాల బాబూ 
కన్నుల్లో కలలెన్నో...కదిలేటి వేళ
ఊగరా ఊగరా..ఉయ్యాలా..జంపాలా..ఆఆ
ఉయ్యాలా..జంపాలా..ఆఆ

చరణం::1

భోగాలు భాగ్యాలు విడిచీ..ఈ..తనవారినందరినీ మరిచీ 
నిరుపేదనగు నన్ను మెచ్చిందిరా..ఆ..మీ అమ్మ నా వెంట వచ్చిందిరా
అలనాడు గౌరి ఆ శివుని కోరి..తనతండ్రి నెదిరించి రాలేదా..ఆ
మగువలకు ఆ తల్లి ఆదర్శమే కాదా..ఆఆ
ఉయ్యాలా..జంపాలా..ఆ..ఉయ్యాలా..జంపాలా

చరణం::2

బంగారు వుయ్యాల లేదురా..నీకు అద్దాల మేడలు లేవురా 
మీ అమ్మ ఒడి నీకు ఉయ్యాలరా మీ నాన్న హృదయమే అద్దాలమేడరా
అనురాగమొలికే పతి చెంతవుంటే..చిరునవ్వు చిలికే పసిపాపవుంటే
ఇల్లాలి కింకేమి కావాలిరా..ఆఆ..ఉయ్యాలా...జంపాలా  
ఊగరా ఊగరా..అందాల బాబూ..కన్నుల్లో కలలెన్నో కదిలేటివేళ
ఊగరా ఊగరా..ఉయ్యాలా..ఆఆ..జంపాలా..ఉయ్యాలా..జంపాలా

Tuesday, November 22, 2011

అభిమానవంతులు--1973



























సంగీత::S.P.కోదండపాణి
రచన::దాశరథి
గానం::P.సుశీల,S.P.బాలు 
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు,శారద,అంజలీదేవి, రమాప్రభ

పల్లవి::

ఓ మనసు దోచిన చెలికాడా..మమత పెంచిన చినవాడా 
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే  
ఓ చిలిపి నవ్యుల చిలకమ్మా..వన్నె చిన్నెల చిన్నమ్మా 
నీకు నాప్తె ఇంతప్రేమ..ఎందుకోసమొ చెప్పవా  

చరణం::1

చందమామ చెలిమి కోరును..కలువభామ ఎందుకోసం  
గోరువంకను రామచిలకా..కోరుకుందీ ఎందుకోసం  
చందమామ చెలిమి కోరును..కలువభామ ఎందుకోసం  
గోరువంకను రామచిలకా..కోరుకుందీ ఎందుకోసం             
మనలోని అనురాగం..పెనవేసింది అందుకే
  
ఓ మనసుదోచిన చెలికాడా..మమత పెంచిన చినవాడా 
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే  

చరణం::2

వలపుకోరీ కన్నవారికి..దూరమైన చిన్నదానా  
నీవు నన్ను వలచినపుడే..జీవితంలో పూలవాన 
నీ మనసే నాదైతే నీ మనసే నాదైతే..లేనిది ఎదీ లేదులే   
ఓ చిలిపినవ్యుల చిలకమ్మా..వన్నె చిన్నెల చిన్నమ్మా  
ఎన్నిజన్మల పుణ్యఫలమో..నిన్ను నన్నూ కలిపెలే      
ఆ  ఆ ఆ  ఆ ఆహా..ఓ  ఓ ఓ  ఓ మ్మ్ మ్మ్ మ్మ్  

అభిమానవంతులు--1973






















సంగీత::S.P.కోదండపాణి
రచన::కొసరాజు రాఘవయ్య
గానం::P.సుశీల,S.P.బాలు,నవకాంత్,కౌసల్య
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,రాజబాబు,శారద,అంజలీదేవి, రమాప్రభ

పల్లవి::

చేయి కలిపి మనసు నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా
చేయి కలిపి మనసు..నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా

చరణం::1

చెమటదీసీ వళ్ళు వంచీ..చాకిరి చెయ్యాలిరా 
వీటుబోయిన బీటినేలను..పాటుకు తేవాలిరా 
కన్నతల్లిగా కల్పవల్లిగా..కన్నతల్లిగా కల్పవల్లిగా 
ఏ ప్రొద్దు భూమాత..వెన్నాని నిలవాలిరా 
హేయ్...చేయి కలిపి మనసు నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా

చరణం::2
      
ఇంటి ఇల్లాలు జంటగా వుండి..వెంట రావాలిరా 
కంటి సైగతో గట్టుపై నుండి..కలకల నవ్వాలిరా
పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా..పచ్చపచ్చగా ప్రజలు మెచ్చగా 
సంసారం ముందడుగు..వెయ్యాలిరా 
చేయి కలిపి మనసు..నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా   

చరణం::3

మనిషిని నమ్మితే..ఫలితం లేదురా 
మట్టిని నమ్మాలిరా..కడవల పాలూ 
కమ్మగ పిండే గోవును..నమ్మాలిరా 
కరువు తీరగా..ఆశలూరగా 
కరువు తీరగా..ఆశలూరగా 
సరదాగ మన బ్రతుకు..జరిగేనురా
చేయి కలిపి మనసు..నిలిపీ 
చేలు దున్నాలిరా హోయ్..సిరులు పొంగాలిరా    
ఓహో..ఓహో..ఓహో..హో..ఓహోహో..ఓఓఓ..ఓహోహో

Tuesday, November 08, 2011

దేవత--1964::కల్యాణి:::రాగం



సంగీతం::S.P. కోదండపాణి
రచన::శ్రీ.శ్రీ,వీటూరిసుందరరామమూర్తి
గానం::ఘంటసాల, P. సుశీల

Film Directed By::K.HemaambharadhgaraRao  
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి. 

కల్యాణి:::రాగం

పల్లవి::

NTR::--తొలి వలపే..పదే పదే పిలిచే..ఎదలో సందడి చేసే
సావిత్రి::--తొలి వలపే..పదే పదే పిలిచే..మదిలో మల్లెలు విరిసే

సావిత్రి::--తొలివలపే..ఏ ఏ ఏ ఏ..
ఆ ఆ ఆ..ఆ ఆ ఆ..ఆ ఆ ఆ

చరణం::1

NTR::--ఏమో ఇది ఏమో..
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు

సావిత్రి::--ఆ అందం..అనుబంధం..నా మనసున నీకై దాచిన
పూచిన కానుకలు!

NTR::ఏమో ఇది ఏమో..
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు

సావిత్రి::--ఆ అందం..అనుబంధం..నా మనసున నీకై దాచిన
పూచిన కానుకలు!

NTR:: --నీ కన్నుల వెలిగేనే దీపాలు..

సావిత్రి::--అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు

NTR::--నీ కన్నుల వెలిగేనే దీపాలు..

సావిత్రి::--అవి నీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు

NTR::--తొలి వలపే..పదే పదే పిలిచే..ఎదలో సందడి చేసే
తొలి వలపే..ఏ..

సావిత్రి::--గ రి ని రి గా

NTR::--ఆ.. ఆ.. ఆ

సావిత్రి::--మగనిగమా..

NTR::--ఆ..ఆ..ఆ..

సావిత్రి::--గమ,నీద నీద మా..

NTR::--ఆ.. ఆ.. ఆ..

చరణం::2

సావిత్రి::--యేలా ఈ వేళ..కడువింతగ దోచే
తీయగా..హాయిగ..ఈ జగమూ

NTR::--యవ్వనము..అనుభవము..జతకూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

సావిత్రి::--యేలా ఈ వేళ..కడువింతగ దోచే
తీయగా..హాయిగ..ఈ జగమూ

NTR::--యవ్వనము..అనుభవము..జతకూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

సావిత్రి::--ఈ రేయి పలికెలే..స్వగతము

NTR::--ఈనాడే బ్రతుకున..శుభదినమూ

సావిత్రి::--ఈ రేయి పలికెలే..స్వగతమూ

NTR::--ఈనాడే బ్రతుకున..శుభదినము
ఈ తనువే..మనకిక చెరి సగము

NTR::--తొలి వలపే..పదే పదే పిలిచే..ఎదలో సందడి చేసే

సావిత్రి::--తొలి వలపే..పదే పదే పిలిచే..మదిలో మల్లెలు విరిసే

Friday, November 04, 2011

దేవత--1965



సంగీతం::S. P. కోదండపాణి
రచన::వీటూరిసుందరరామమూర్తి
గానం::ఘంటసాల

Film Directed By::K.HemaambharadhgaraRao 
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి. 

పల్లవి::


ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం::1


పతిదేవుని మురిపించే వలపుల వీణా

జీవితమే పండించే నవ్వుల వానా
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
కష్ట సుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధురభావనా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

చరణం::2


సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

దేవత--1965



సంగీతం::S. P. కోదండపాణి
రచన::
వీటూరిసుందరరామమూర్తి 
గానం::ఘంటసాల,P.సుశీల
Film Directed By::K.HemaambharadhgaraRao 
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,పద్మనాభం,గీతాంజలి,చిత్తూరు నాగయ్య,హేమలత,నిర్మలమ్మ,రాజనాల,S.V.రంగారావు.అంజలిదేవి,రాజబాబు,గుమ్మడి,కృష్ణకుమారి. 

పల్లవి::

NTR::::కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ

సావిత్రీ::నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు

చరణం::1


సావిత్రీ::సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు

NTR::అనువైనవేళ అందాలు దాచకు
అనువైనవేళ అందాలు దాచకు
అణువణువు నిన్నే కోరె మురిపించకు
ఇకనైనా నిను సిగ్గు తెరవేయకూ

సావిత్రీ::నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
NTR::కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ఈ..

చరణం::2


సావిత్రీ::ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు
ఎటుచూసినా నువ్వే వినిపించే నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు

NTR::మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

సావిత్రీ::నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు

NTR::కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ..ii..