పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::SP. బాలసుబ్రమణ్యం
రాగం:::మోహన::
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే
వరదల్లె రావే..వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే..ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే
ఎలదేటి పాటా..చెలెరేగె నాలో
చెలరేగి పోవే..మధుమాసమల్లే
ఎల మావి తోటా..పలికింది నాలో
పలికించుకోవే..మది కొయిలల్లే
నీ పలుకు నాదే..నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే..వనదేవతల్లే
పున్నాగ పూలే..సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే..ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే
ఆఆ..ఆఆఆఆ..ఆఆఆఆఆ..
మరుమల్లె తోటా..మారాకు వేసే
మారాకు వేసే..నీ రాక తోనే
నీ పలుకు పాటై..బ్రతుకైనా వేళా
బ్రతికించుకోవే..నీ పదముగానే
నా పదము నీవే..నా బ్రతుకు నీవే
అనురాగమల్లే..సుమగీతమల్లే
నన్నల్లు కోవే..నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
సిరిమల్లె నీవే..విరిజల్లు కావే
అహా..ఆ..హా..లలలాల..లాలా
No comments:
Post a Comment