Monday, September 22, 2008

అద్రుష్టవంతులు--1969

రచన::ఆరుద్ర
సంగీతం::K.V.మహాదేవన్
గానం::ఘంటసాల,P.సుశీల

ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ఇపుడొద్దన్నావంటే కుర్రవాడా...రేపు ఇమ్మన్నా ఇస్తానా వెర్రివాడా

ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా

పెదవులు రెండూ కలగలిసినచో తేనెలు కురిసే ముద్దు
మనసులు రెండూ పెనవేసినచో మమతకు లేదు హద్దు

చూడు ఉబలాటం ఆడు చెలగాటం
చూడు ఉబలాటం ఆడు చెలగాటం
పెడమోమైనా విడువను నిన్నువద్దురమొగమాటం

ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే మోజే ఇపుడా ఉద్దేశం లేదే
నిను ముద్దాడాలంటే కుర్రదానా అసలు మనసంటూ ఉండాలి వెర్రిదానా
ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా నీకా ఉద్దేశం లేదా

ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్‍ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్
‍ఆడదాని ముద్దులో వేడి ఉన్నదోయ్‍ ఆ వేడికే వెన్నలా కరిగిపోతావోయ్‍
మోజు పడకుంటే మొగవాడే కాదు..మోజు పడకుంటే మొగవాడే కాదు
గడసరి బిగువు సడలించనిదే జవరాలే కాదు

No comments: