Monday, September 22, 2008

అద్రుష్టవంతులు--1969



సంగీతం::KV.మహాదేవన్
రచన::K.వెంకటరత్నం
గానం::P.సుశీల


మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
చుక్కలన్ని కొండమీద సోకు చేసుకొనే వేళ
చల్లగాలి తోటసంత చక్కిలిగింత పెట్టువేళ
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
పొద్దువాలినంతనే సద్దుమణగనిచ్చిరా
వేళదాటి వస్తివా వెనక్కి తిరిగి పోతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య


మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు అ..ఓ..మ్మ్..
మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినప్పుడు
వంగ తోట మలుపుకాడ కొంగు లాగినపుడు
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని
కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో
చిన్న బోయి నవ్వుల పాలైతివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో
మంచెకాడ కలుసుకో మరువకు మావయ్య
నువు మరువకు మరువకు మవయ్య

గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
గడ్డిబళ్ళ ఎనకాతల గమ్మత్తుగ నక్కిరా
ఊర చెరువు రెల్లుపక్క ఒంగి ఒంగి నడిచిరా
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
ఐనవాళ్ళ కళ్ళ బడకు అల్లరి పాలౌతాను
గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తివా
తంటా మన ఇద్దరికి తప్పదు మావయ్య
తప్పదు తప్పదు మావయ్య

No comments: