పాట ఇక్కడ వినండి
సంగీతం::రాజన్ నాగేద్ర
రచన::వేటూరి
గానం::బాలు,P.సుశీల
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
హబ్బా..దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా
చల్లగాలి పాటవుంది..సంపంగి తోటవుంది
ఆ ఎనక చాటువుంది ఎనక చాటు మాట ఉంది
ఇన్నున్నా నా చెంత చిన్నాది లేకుంటే
ఇన్నున్నా నా చెంత చిన్నాది లేకుంటే
ఎన్నలేమి చేసుకోను సెందరయ్యా
ఈ వేడినేడ దాచుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
హబ్బా..దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా
సన్నజాజి పందిరుంది..తొలిరోజు తొందరుంది
సోకైన వాడి చూపూ సోకి సోకి సొదపెడుతుంది
ఇనున్న నా సెంత సిన్నోడు లేకుంటే
ఇనున్న నా సెంత సిన్నోడు లేకుంటే
ఎన్నలేమి చేసుకోను సెందరయ్యా
ఈ వన్నెలేడ దాచుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
హబ్బా..దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా
అర్ధరాత్రి అవుతున్నాది నిద్దరేమో రాకున్నాది
ఇద్దరుండి ఎవ్వరులేనీ ముద్దు ముచ్చటౌతున్నాది
సుక్కబంతి పూవుంది సక్కదనం పక్కేసింది
సక్కిలిగిలి సంతకాడా జాతరేదో చలరేగింది
ఇనున్నా నాసెంత సిన్నోడు లేకుంటే
ఇనున్న నాసెంత సిన్నాది లేకుంటే
ఎన్నెలేమి సేసుకోనూ సెందరయ్యా...
నా ఏడినేడ దాసుకోనూ సెందరయ్యా
పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా
దండగైపోయింది సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా
సెందరయ్యా..సెందరయ్యా
No comments:
Post a Comment