సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::SP.బాలు,S.జానకి
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
ఎందుకంటా?
యుగయుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడూ లేదంటా
అలాగా..
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
ఎందుకంటా?
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదంట
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నదికీ కడలికి పొంగంట
ప్రతి రేయి మనకొక తొలిరేయంట
ఆ…..
తొలిముద్దు పెదవులు విడిపోవంట
ఆ….
జగతికంతటికీ మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
ఆ..నా కంట నిను చూసుకుంటా
ఆ..నీ చూపు నా రేపు పంట
ఆ…ఆ…
నీకూ నాకూ పెళ్ళంట
నింగికి నేలకు కుళ్ళంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
మన కోర్కెలన్నీ పసిపాపలంట
ఆ..ఆ…చిగురాకు మనసుల చిరునవ్వులంట
ఆ..ఆ…
వయసు లేనిది మన వలపేనంట
మనజీవితము ఆటాపాటెనంట
ఆ..నాలోన నిను దాచుకుంటా
ఆ..నీ ఊపిరై కాచుగుంట
ఆ..ఆ…
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
యుగయుగాలుగా వేరైనా
అవి కలవనిదెపుడూ లేదంట
నీకూ నాకూ పెళ్ళంట
నదికీ కడలికి పొంగంట
No comments:
Post a Comment