Showing posts with label భద్రకాళి --1976. Show all posts
Showing posts with label భద్రకాళి --1976. Show all posts

Sunday, September 21, 2008

భద్రకాళి --1976



సంగీతం::ఇళయరాజ
రచన::దాశరథి
గానం::యేసుదాస్,P.సుశీల

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ

నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ
పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ
నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ
పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ
ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏ నాడు విడదమ్మా
అమ్మ వలె రమ్మనగా పాప వలె చేరేవూ
నా చెంత నీవుంటే స్వర్గమేమి నాదౌనూ
గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే
కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే

స్నానమాడి శుభవేళా కురులతో పువ్వులతో
దేవి వలె నీవొస్తే నా మనసు నిలువదులే
అందాల కన్నులకూ కటుకను దిద్దేనూ
చెడు చూపు పడకుండా అగరు చుక్క పెట్టేనూ
చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ
జోలాలీ..జోలాలీ..జోలాలీ..జోలాలీ..జో జో జో !!!!