Monday, September 29, 2008
ఉమ్మడి కుటుంబం--1960
సంగీతం::TV.రాజు
రచన::C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల
చెప్పాలని వుంది..అహా..
చెప్పాలని వుంది..మ్మ్..
దేవతయే దిగివచ్చి
మనుషులలో కలసిన
కథ చెప్పాలని వుంది
పల్లెటూరి అబ్బాయిని పదును పెట్టి వెన్ను తట్టి
పల్లెటూరి అబ్బాయిని పదునుపెట్టి వెన్నుతట్టి
మనిషిగ తీరిచి దిద్దిన మరువరాని దేవతకథ చెప్పాలని వుంది
కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
కోరనిదే వరాలిచ్చి కొండంత వెలుగు నిచ్చి
మట్టిని మణిగా చేసిన మమతెరిగిన దేవతకథ చెప్పాలనివుంది
అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో
అంతటి దేవికి నాపై ఇంతటి దయ ఏలనో
ఎన్ని జన్మలకు ఈ ౠణం ఎలా ఎలా తీరునో
నీ చల్లని మదిలో ఆదేవికింత చోటిస్తే
నీ చల్లని మదిలో ఆదేవికింత చోటిస్తే
ఆలోకమే మరచిపోవు నీలోనే నిలిచిపోవు ఆ...
..అహాహ...ఆహ అహాహహా ఓ...హో...ఓ హో హో...ఓహోహో...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment