సంగీతం::K.V. మహదేవన్ రచన::వేటూరి గానం::S.P.బాలు, P.సుశీల తారాగణం::అక్కినేని,గుమ్మడి,సత్యనారాయణ,జయప్రద,సూర్యకాంతం,రాజసులోచన,నాగేష్పల్లవి:: ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకునే..నింగి కుటీరం కలవారలు కలలుకనే..పసిడి పంజరం నిరుపేదలు తలదాచుకునే..నింగి కుటీరం కలవారలు కలలుకనే..పసిడి పంజరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం ఊ..ఊ..ఊ.. చరణం::1 ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం ఎనిమిది దిక్కుల నడుమ సంసారం ఎనభై నాలుగు లక్షల సంతానం సప్తస్వర సంగీతం..నవరసాల సాహిత్యం రంగరించుకున్నదీ రంగుల వలయం రిసరిగ గసగమ సగమదనిస నిదపమగరిసనిద సప్త స్వర సంగీతం..నవరసాల సాహిత్యం రంగరించుకున్నదీ రంగుల వలయం మనసంఘమ నిలయం..నవసాగర మధనం..ఇది శాశ్వత ప్రణయం సుందరం..సుమధురం..ప్రేమ మందిరం నిరుపేదలు తలదాచుకొనే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం చరణం::2 నీలో విన్నా వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం నీలో విన్నా వలపుల ఓంకారం నీలో కన్నా వెలుగుల ఆకారం ఉదయారుణ మందారం..హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన..కళ్యాణ మంటపం రిసరిగ గరిదప దపదప దపదస ఉదయారుణ మందారం..హృదయేశ్వరి సింధూరం కౌగిలిగా మెరిసిన..కళ్యాణ మంటపం ఇది సృష్టికి ప్రాణం..మన ముక్తికి మూలం ఇది ఇలలో స్వర్గం.. సుందరం..సుమధురం..ప్రేమ మందిరం నిరుపేదలు తల దాచుకొనే నింగి కుటీరం కలవారలు కలలు కనే పసిడి పంజరం ప్రేమ మందిరం..ఇదే ప్రేమ మందిరం
సంగీతం::V.కుమార్ రచన::C.నారాయణరెడ్డి గానం::P.సుశీల తారాగణం::జగ్గయ్య, జమున,జయంతి, రమాప్రభ,నాగభూషణం, ధూళిపాళ పల్లవి:: అనగనగా ఒక చిలకమ్మా..అనగనగా ఒక గోరింకా అనగనగా ఒక చిలకమ్మా..అనగనగా ఒక గోరింకా ఒకరి ప్రాణం ఒకరైన..ఆ జంటా ఊరువాడకంతటికీ..కన్నుల పంటా అనగనగా ఒక చిలకమ్మా..అనగనగా ఒక గోరింకా చరణం::1 ముచ్చటైన..గూడు కట్టుకొన్నాయీ ముద్దూ మురిపాలు..పంచుకొన్నాయీ ముచ్చటైన..గూడు కట్టుకొన్నాయీ ముద్దూ మురిపాలు..పంచుకొన్నాయీ ఇద్దరే పాపలను కన్నాయీ.. ఒద్దికగా..కాపుర మున్నాయీ అనగనగా ఒక చిలకమ్మా..అనగనగా ఒక గోరింకా చరణం::2 పంచవన్నెల రామచిలక..వచ్చిందీ పక్కనున్న చెట్టుమీద..వాలిందీ దాని వన్నెలకే బ్రమిసెనో..వగలు చూసి మురిసెనో గోరింక మనసేమో..మారిందీ తర్వాత? సందెవాలి పోతున్నా..జామురాతి రవుతున్నా గోరింక ఇల్లు చేరదాయే..చిలకమ్మకు తీరని దిగులాయే ఒంటరిగా చిలకమ్మ..ఉసూరని వేచింది గోరింక రాలేదనీ..ఏడ్చిందీ.. ఆతర్వాత? ఇంత వరకు చెప్పింది..నే నెరిగిన కథా కాలమే చెపుతుందీ..జరగనున్న కథా
సంగీతం::రమేష్‌నాయుడు రచన::సినారె గానం::S.జానకి తారాగణం::జయంతి,సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు,శ్రీధర్. పల్లవి:: ఆఆఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా చరణం::1 బంగారు చెక్కిళ్ళ..రంగైన చినవాడు..ఊహూ.. ఏ ఊరో..ఏ పేరో..ఏ ఊరో..ఏ పేరో..మా ఊరికొచ్చినాడూ వాడె వలచీనాడమ్మా..ఆ..వలచి పలకలేదమ్మా..ఆ వాడు పలికినా చాలును ఓయమ్మా..నా ప్రాణాలు వికసించునోయమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా చరణం::2 ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహా మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ ఆ ఆ ఆ వాని మునిపళ్ళు..మెరిసేను ముత్యాలలాగా వాని కళ్ళేమొ..కదిలేను నీలాలలాగా వాడు నవ్వీనాడమ్మా..అమ్మో నవ్వీనాడమ్మా ఆ ముసిముసి నవ్వులే..ముత్యాల ముగ్గులై మురిపించెనమ్మా..అవి యెంతో ముద్దొచ్చెనోయమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా చరణం::3 ఓహో..హో హో..ఆ ఆ ఆ నవ్వుతోనే నా మనసు..ఎగిసిందీ ఆ చూపులోనే నా తనువు..ఇమిడిందీ ఏమి మగవాడెయమ్మా..నాకు తగినోడెయమ్మా ఆ మగవాని కౌగిట..మరణించినాచాలు వాని పాదాలపై..రాలిపోయినా మేలు సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా
సంగీతం::రమేశ్ నాయుడు రచన::దాసం గోపాలకృష్ణ గానం::S.P.బాలు, P.సుశీల పల్లవి:: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా పూబోణి కానుకవె సిరిమల్లికా
చరణం::1 జవరాలి జడలోనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జవరాలి జడలోన..జలతారు తారవై కాముకుల మెడలోన..కర్పూర హారమై దేహాన్ని..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేహాన్ని పులకించి..మురిసిపోతావు దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ.. దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ.... జవరాలి జడలోన..జలతారు తారవై కాముకుల మెడలోన..కర్పూర హారమై దేహాన్ని పులకించి..మురిసిపోతావు దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ.. గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా చరణం::2 సుతిమెత్తగా నీవు తల్పాలు వేస్తావు సువాసనలతోటి..తానమాడిస్తావు ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు.. ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు సుతిమెత్తగా నీవు..ఆ ఆ ఆ ఆ ఆ ఆ సుతిమెత్తగా నీవు..తల్పాలు వేస్తావు సువాసనలతోటి..తానమాడిస్తావు ఉల్లాసకేళికి..ఆ ఆ ఆ ఆ ఆ ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు.. ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..గుండెలే దోస్తావు ఓ మల్లికా పూవుల్లో మేనకవె నవమల్లికా..పూబోణి కానుకవె సిరిమల్లికా పూబోణి కానుకవె సిరిమల్లికా
సంగీతం::సత్యం రచన::మైలవరపు గోపి గానం::S.P.బాలు, S.జానకి పల్లవి:: చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది చిరునవ్వు చిలికించవే..నీ లేత సింగారమొలికించవే నీ లేత సింగార మొలికించవే.. గోరొంక కూసింది..గోరింట పూసింది.. గోరొంక కూసింది..గోరింట పూసింది ముత్యాల మనసీయ్యరా..నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా చరణం::1 పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ ఆ ఆ హా..హ..హా..ఆ..హ.. పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ.. ఈ సిగ్గు బరువు నేనోపలేను..ఈ సిగ్గు బరువు నేనోపలేను నీ కంటి పాపలో దాచుకో నన్నూ..దాచుకో నన్నూ చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది ముత్యాల మనసీయ్యరా..నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా చరణం::2 కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ ఆ ఆ..హా..హ..హా..ఆ..హ.. కొండ వాగుదూకితే తెలిసిందీ..కోడె వయసు పొంగిందనీ ఈ వయసు హోరు నేనాపలేను..ఈ వయసు హోరు నేనాపలేను నీ కౌగిలింతలో దోచుకో నన్నూ..దోచుకో నన్నూ చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది గోరొంక కూసింది..గోరింట పూసింది చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
సంగీతం::K.V.మహదేవన్ రచన::దాశరథి గానం::P.సుశీల తారాగణం::అక్కినేని,సావిత్రి,గుమ్మడి,నాగభూషణం,జమున,పద్మనాభం,అల్లు రామలింగయ్య. పల్లవి:: ఓహో హో హో..ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహొహూ ఓ ఓ ఓ గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ హోయ్ గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్... చరణం::1 వగరు వగరుగ పొగరుంది..పొగరుకు తగ్గ బిగువుంది వగరు వగరుగ పొగరుంది..పొగరుకు తగ్గ బిగువుంది తీయ తీయగ సొగసుంది..సొగసుని మించె మంచుంది తీయ తీయగ సొగసుంది..సొగసుని మించె మంచుంది.. ఈ ఈ ఈ ఈ ఈ ఈ గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్.... చరణం::2 ఎన్నెల వుంది..ఎండ వుంది..పూవు వుంది..ముల్లుంది ఎన్నెల వుంది..ఎండ వుంది..పూవు వుంది..ముల్లుంది ఏది ఎవ్వరికి ఇవ్వాలో..ఇడమరిసే ఆ ఇది వుంది.... గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్... చరణం::3 పిట్ట మనసు పిసరంతైనా..పెపంచమంతా దాగుంది పిట్ట మనసు పిసరంతైనా..పెపంచమంతా దాగుంది అంతు దొరకని నిండు గుండెలో..ఎంత తోడితే అంతుంది అంతు దొరకని నిండు గుండెలో..ఎంత తోడితే అంతుంది ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఈ గోదారి గట్టుంది..గట్టుమీన సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది..పిట్ట మనసులొ ఏముంది ఓ ఓ ఓ ఓ ఓ ఓ హోయ్...
సంగీతం::K.V.మహదేవన్ రచన::ఆత్రేయ గానం::S.P..బాలు,రమేష్ తారాగణం::కృష్ణ,కాంతారావు,చంద్రమోహన్,గిరిబాబు,జరీనా,అంజలీదేవి,శుభ,సూర్యకాంతం పల్లవి:: గాజులోయ్..గాజులు..గాజులూ వేసుకో ఈ గాజులూ..చుసుకో ఈ సొగసులూ వేసుకో ఈ గాజులూ..చుసుకో ఈ సొగసులూ ఏ వయసుకా గాజులూ..ఏడువారాలకూ గాజులూ ఏ వయసుకా గాజులూ..ఏడువారాలకూ గాజులూ గాజులు..గాజులూ..గాజులు..గాజులూ గాజులు..గాజులూ..గాజులు..గాజులూ వేసుకో ఈ గాజులూ..చుసుకో ఈ సొగసులూ చరణం::1 ఎరుపు పసుపు ఆకుపచ్చ నీలిగాజులూ లబరు గాజులు లక్కగాజులు..మట్టిగాజులు గట్టిగాజులూ చేయి చూసి సైజు చూసి..నైసుగ వేస్తామూ అమ్మా..అబ్బా..నొప్పీ..గిప్పీ..అనకుండవేస్తామూ చేయి చూసి సైజు చూసి..నైసుగ వేస్తామూ అమ్మా..అబ్బా..నొప్పీ..గిప్పీ..అనకుండ వేస్తామూ వేసినత్తే తెలియదూ..తీసుకోను బాధలేదు హోయ్..హోయ్..హోయ్..హోయ్.. వేసినత్తే తెలియదూ..తీసుకోను బాధలేదు మనం గాజులేస్తే చాలు..సినిమా ష్టారులౌతారు అమ్మ..తల్లీ..చెల్లీ..బుల్లీ.. వేసుకో ఈ గాజులూ..చుసుకో ఈ సొగసులూ చరనం::2 కన్నెపిల్ల వేసుకొంటే..కల్యాణం అవుతుంది "అవును తప్పకుంద అవుతుంది" ఆ కట్టుకొన్న మొగుడికీ..మోజే పెరుగుతుంది " ఆ పెరిగి తీరుతుందీ" మోజు మోజుగా ఉంటు ముచ్చటగా ప్రతి ఏడు కారు కారు కారుమంటు..పెరుగుతుంది కాపురం అమ్మ..తల్లీ..చెల్లీ..బుల్లీ.. వేసుకో ఈ గాజులూ..చుసుకో ఈ సొగసులూ ఏ వయసుకా గాజులూ..ఏడువారాలకూ గాజులూ
గాజులు..గాజులూ..గాజులు..గాజులూ గాజులు..గాజులూ..గాజులు..గాజులూ వేసుకో ఈ గాజులూ..చుసుకో ఈ సొగసులూ గాజులోయ్..గాజులు..గాజులూ
సంగీతం::T.V.చలపతిరావ్ రచన::దాశరధి గానం::ఘంటసాల పల్లవి:: ఆహా ఏమందము..ఓహో ఈ చందము నీ తీయని పెదవుల..తొణికే మధువులు నావే హ్హే.. ఆహా ఏమందము..ఓహో ఈ చందము నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..ర్రా.. చరణం::1 చిన్నారి చిలకలెన్నో చేరాయి కోరి నన్ను..హహహా అయితేనేం అందాల రామ చిలక..అలరించె నేడు నన్ను ఈ బింకము ఈ పొంకము..ఈ బింకము ఈ పొంకము ఏనాడు చూడ లేదే..ఏహేహే.. ఏమందము..ఓహోహో..ఈ చందము నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ.. చరణం::2 నీ దారి చూచి చూచి..నిను కోరి వేచి వేచి నీ దారి చూచి చూచి..నిను కోరి వేచి వేచి మనసేలనో చెలరేగెను..మనసేలనో చెలరేగెను నే నిలువలేను రావే..హ్హాహ్హహ్హా.. ఏమందము..ఓహోహో..ఈ చందము నీ తీయని పెదవుల తొణికే మధువులు నావే..హ్హ.. చరణం::3 అరచాటు పైటలోన..అరమోడ్పు కనులలోన అరచాటు పైటలోన..అరమోడ్పు కనులలోన ఆ వంపులు ఆ సొంపులు..ఆ వంపులు ఆ సొంపులు నే తాళలేను రావే..ర్రా..
సంగీతం::S.రాజేశ్వరరావు రచన::కోసరాజు గానం::ఘంటసాల , P.సుశీల పల్లవి:: ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎటుల నిన్ను వీడుదురా ఎటుల నిన్ను వీడుదురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే నా ప్రేమ హరించితివే నా ప్రేమ హరించితివే ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ చరణం::1 ఆ... మనసులోన కోవెలగట్టి మల్లెపూల అంజలిబట్టి మనసులోన కోవెలగట్టి మల్లెపూల అంజలిబట్టి నిను నిత్యము పూజింతునురా నీ కథలే స్మరియింతునురా నిను నిత్యము పూజింతునురా నీ కథలే స్మరియింతునురా ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ళ పొగడుదురా ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ చరణం::2
నీ పూజా సుమములు బెట్టి రకరకాల దండలు గట్టి నీ మెడలో వేసెదనే నాదానిగ జేసేదనే ఎంత మంచిదానవే పొరపాటు గ్రహించితివే కలలే నిజమాయెనులే జీవితమే మారెనులే ఇద్దరము చూపులు కలిపి ఏకంగా పోదములే ఇద్దరము చూపులు కలిపి ఏకంగా పోదములే ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ