Monday, December 27, 2010

చందన--1974

సంగీతం::రమేష్‌నాయుడు
రచన::సినారె
గానం::S.జానకి
తారాగణం::జయంతి,సత్యనారాయణ,రాజబాబు,నిర్మల,రంగనాధ్,త్యాగరాజు,శ్రీధర్.

పల్లవి::
ఆఆఆ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా 
సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా 

చరణం::1

బంగారు చెక్కిళ్ళ..రంగైన చినవాడు..ఊహూ..
ఏ ఊరో..ఏ పేరో..ఏ ఊరో..ఏ పేరో..మా ఊరికొచ్చినాడూ 
వాడె వలచీనాడమ్మా..ఆ..వలచి పలకలేదమ్మా..ఆ
వాడు పలికినా చాలును ఓయమ్మా..నా ప్రాణాలు వికసించునోయమ్మా
    
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా  
సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా    
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా  
సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా  

చరణం::2

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆహా మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ 
ఆ ఆ ఆ 
వాని మునిపళ్ళు..మెరిసేను ముత్యాలలాగా
వాని కళ్ళేమొ..కదిలేను నీలాలలాగా
వాడు నవ్వీనాడమ్మా..అమ్మో నవ్వీనాడమ్మా
ఆ ముసిముసి నవ్వులే..ముత్యాల ముగ్గులై 
మురిపించెనమ్మా..అవి యెంతో ముద్దొచ్చెనోయమ్మా   
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా  
సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా  
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో..రామూలమ్మా  
సిన్నాబోయి కూసున్నావ్ రామూలమ్మో..రామూలమ్మా  

చరణం::3

ఓహో..హో హో..ఆ ఆ 
ఆ నవ్వుతోనే నా మనసు..ఎగిసిందీ
ఆ చూపులోనే నా తనువు..ఇమిడిందీ
ఏమి మగవాడెయమ్మా..నాకు తగినోడెయమ్మా 
ఆ మగవాని కౌగిట..మరణించినాచాలు
వాని పాదాలపై..రాలిపోయినా మేలు 
       
No comments: