Wednesday, December 29, 2010

దేవుడు చేసిన బొమ్మలు--1976



సంగీతం::సత్యం
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::S.P.బాలు, S.జానకి  
నటీనటులు::జయసుధ,మురళిమోహన్,చలం,అనిత,గిరిబాబు,ప్రభ. 

పల్లవి::

నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ....

చరణం::1

కొలచినవారే కొరతలు బాపీ..కోరిక తీర్చే దైవమునీవే
నిత్యము నిన్నే సేవించినచో..నా కలలన్నీ సఫలము కావా
కలిమి బలిమి..నీ కరుణే.. 
నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ......

చరణం::2

మోహనరూపం మురళీగానం..నీ శుభనామం తారకమంత్రం 
నీ కడగంటీ చూపులె చాలు..తనువూ మనసూ పులకించేనూ
జపము తపము..నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ.....

చరణం::3

కన్నుల ఎదుటా కనపడు దైవం..కరుణించుటయే స్త్రీసౌభాగ్యం 
ఆరనిజ్యోతీ అమౄతమూర్తీ..దీవెనకాదా సుఖసంసారం
ఇల్లేస్వర్గం ఈ ఇలలో..
నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకే
నిను వినా నాకెవ్వరూ..నా ఆరాధనలు నీకొరకే 
నిను వినా నాకెవ్వరూ.....  

No comments: