Saturday, December 18, 2010

శ్రీమంతుడు--1971











విశ్వభారతి ప్రొడక్షన్స్ వారి
శ్రీమంతుడు--1971
నిర్మాత::G. రాధాకృష్ణమూర్తి
దర్శకత్వం::K. ప్రత్యగాత్మ
సంగీతం::T.చలపతిరావ్
రచన::దాశరధి
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, జమున,గుమ్మడి,సూర్యకాంతం,రాజబాబు

పల్లవి::

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో


చరణం::1

కలతలు పోవాలనీ..తొలకరి రావాలనీ
వలపుల జల్లులో..బ్రతుకులు పండాలనీ
వేచిన కన్నులతో..వేసారి ఉన్నాను

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

చరణం::2

మమతల ఉయ్యాలలో..మనసులు ఊగాలనీ
మల్లెలపందిరిలో..మనువులు కూడాలనీ
ఒదిగే ఉండనీ..కొంగుచాచి అడిగేను

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

చరణం::3

నీ కన్నులరేకులలో..నిండుకలలు పూయాలనీ
వాడని ఆ కలలలో..నా నీడ చూచుకోవాలనీ
ఎన్నెన్నో ఆశలతో..ఇన్నాళ్ళు ఉన్నాన్ను..

చల్లని వెన్నెలలో..నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని..నా మదిలో ఒదిగిపో

No comments: